క్రొత్త సంవత్సరంలో బాప్ దాదా ద్వారా ఇవ్వబడిన
స్లోగన్ - నిర్భలత తొలగించండి.
అతి స్నేహి మరియు సమీప పిల్లలతో క్రొత్త సంవత్సరం
గురించి అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -
ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో ఎగిరేకళలో ఉండే
పిల్లలను బాప్ దాదా చూస్తున్నారు. సెకనులో అశరీరభవ యొక్క వరదానం లభించింది,
సెకనులో ఎగిరిపోయారు. అశరీరీగా అవ్వటం అంటే ఉన్నతంగా ఎగరటం. శరీర అభిమానంలోకి
రావటం అంటే పంజరంలో పక్షిగా అవ్వటం. ఈ సమయంలో అందరు అశరీరీభవ యొక్క వరదానిగా
అంటే ఎగిరే పక్షిగా అయిపోయారు. స్వతంత్ర ఆత్మలు మరియు ఎగిరే పక్షుల సంఘటన ఇది.
అందరు స్వతంత్రులే కదా? మీ స్వీట్ హోమ్ కి వెళ్ళిపోండి అని ఆజ్ఞ లభిస్తే ఎంత
సమయంలో వెళ్ళగలరు? సెకనులో వెళ్ళగలరు కదా! మీ యొక్క మాస్టర్ సర్వశక్తివాన్
స్థితి ద్వారా, మీ సర్వశక్తుల కిరణాల ద్వారా అంధకారంలో వెలుగుని తీసుకురండి,
జ్ఞానసూర్యునిగా అయ్యి అంధకారాన్ని తొలగించండి, సెకనులో ఈ బేహద్ సేవ చేయగలరా?
అటువంటి మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యారా? సైన్స్ సాధనాలు ఒక సెకనులో అంధకారంలో
వెలుగు తీసుకురాగలుగుతున్నాయి మరి జ్ఞానసూర్యుని పిల్లలైన మీరు ఎంత సమయంలో
వెలుగు తీసుకురాగలరు? సైన్స్ కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్ఠమైనది. సెకనులో
స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయగానే అంధకారంలో భ్రమించే ఆత్మలను వెలుగులోకి
తీసుకువస్తున్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? ఏమని భావిస్తున్నారు?
ఏడు రోజులు, ఏడు గంటల కోర్సు ఇచ్చి అంధకారం నుండి
వెలుగులోకి తీసుకురాగలరా లేక మూడు రోజుల యోగ శిబిరం ద్వారా తీసుకురాగలరా? లేక
సెకనులో వెలుగునిచ్చే స్థితికి చేరుకున్నారా? ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు సేవ
యొక్క వేగం గంటలలో ఉందా లేక నిమిషాలలోకి వచ్చిందా లేక సెకనులోకి చేరుకుందా? ఏమని
భావిస్తున్నారు? ఇప్పుడు సమయం కావాలా లేక సెకను వరకు చేరుకున్నారా? సెకనులో
ముక్తి - జీవన్ముక్తి యొక్క ప్రాప్తి పొందండి అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా!
దానిని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేటందుకు తయారేనా? స్వపరివర్తనలో వేగం సెకను
వరకు చేరుకుందా? ఏమని భావిస్తున్నారు? పాత సంవత్సరం సమాప్తి అయిపోతుంది,
క్రొత్త సంవత్సరం వస్తుంది సంగమంలో మీరు కూర్చున్నారు. పాత సంవత్సరంలో
స్వపరివర్తన లేక విశ్వపరివర్తన యొక్క వేగం ఎంత వరకు ఉంది? తీవ్రంగా ఉందా? ఇలా
ఫలితం తీస్తారు కదా! ఈ సంవత్సరం ఏ ఫలితం వచ్చింది? స్వయం పట్ల, సంబంధ
సంప్రదింపుల్లోని వారి పట్ల, విశ్వసేవ పట్ల ఫలితం ఏమి వచ్చింది? ఈ సంవత్సరం ఏమి
లక్ష్యం లభించింది? తెలుసు కదా! ఎగిరేపక్షి అయ్యి ఎగిరేకళలో ఉండాలి. కనుక ఈ
లక్ష్యం అనుసరించి వేగం ఏవిధంగా ఉంది? అందరి వేగం సెకను వరకు చేరిపోతే ఏమౌతుంది?
మీ ఇల్లు మరియు మీ రాజ్యం అంటే ఇంటి నుండి తిరిగి మీ రాజ్యంలోకి వస్తారు. కనుక
క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఉత్సాహము, ప్రతి సంకల్పం మరియు సెకనులో, ప్రతి
కర్మలో ప్రాప్తి యొక్క సిద్ధి అనేది నవీనత అనుభవం అవ్వాలి. రేపటి నుండి ఏమి
ప్రారంభం అవుతుంది? క్రొత్త సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది ఇంకా ఏమంటారు?
క్రొత్త సంవత్సరం ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది? లౌకికంలో కూడా వన్, వన్ నుండి
ప్రారంభం అవుతుంది. మీరు ఏమి ప్రారంభిస్తారు? సంవత్సరం అయితే వన్ నుండి ప్రారంభం
అవుతుంది కానీ మీ స్థితి ఎలా ఉంటుంది? వన్ మరియు విన్. ప్రతి సంకల్పంలో విన్
అంటే విజయీగా ఉంటారు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు మీ మస్తకంలో ఏ తిలకం పెట్టుకుంటారు?
విజయీ తిలకం. ఏ స్లోగన్ స్మృతి ఉంచుకుంటారు? మేము విజయీ రత్నాలం! కల్పకల్పం
విజయీ ఆత్మలం! విజయాలుగా ఉండేవారం, విజయీగా అవుతాము మరియు విజయీగానే ఉంటాము. ఏ
కిరీటాన్ని ధరిస్తారు? లైట్ మరియు మైట్ అనే డబుల్ కిరీటాన్ని ధరించాలి. ఎందుకంటే
లైట్ మరియు మైట్ తక్కువ అయితే సదా సిద్ధిస్వరూపంగా కాలేరు. లైట్ తో పాటు మైట్
గా అయినప్పుడే సదా విజయీ అవుతారు. కనుక లైట్ మరియు మైట్ యొక్క డబుల్
కిరీటధారులుగా అవ్వాలి.
ఏ కంకణం ధరిస్తారు? కంకణం కూడా తప్పనిసరిగా ఉండాలి కదా?
ఏ కంకణం ఇష్టం? పవిత్రత యొక్క కంకణం అయితే ఉంది. కానీ ఈ సంవత్సరంలో విశేషంగా ఏ
క్రొత్త కంకణం ధరిస్తారు? (కొందరు సహయోగం యొక్క కంకణం, కొందరు సంస్కారాల కలయిక
యొక్క కంకణం ఇలా అనేక జవాబులు చెప్పారు) ఇలా అయితే చేయి అంతా కంకణాలతో
నిండిపోతుంది.
ఈ సంవత్సరం ఇదే విశేషమైన కంకణం ధారణ చేయాలి - సదా
ఉత్సాహంలో ఉండాలి మరియు ఉత్సాహంలో సర్వులను ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి.
స్వయంలో ఉత్సాహం తక్కువ చేసుకోకూడదు, ఇతరుల యొక్క ఉత్సాహం తక్కువ చేయకూడదు. ఈ
కంకణాన్ని బిగువుగా ఉంచుకునేటందుకు ఒక విషయం సదా స్మృతి ఉంచుకోవాలి - ప్రతి
విషయంలో స్వయంపట్ల అయినా, ఇతరుల పట్ల అయినా, ముందుకు వెళ్ళడానికి, ముందుకు
తీసుకు వెళ్ళడానికి అయినా మలచుకోవడమే నిజమైన బంగారంగా అవ్వటం. మంచిది - కంకణం
ధారణ చేసారు. ఇప్పుడు విశేషంగా సేవ యొక్క లక్ష్యం ఏమి పెట్టుకున్నారు? ఏవిధంగా
అయితే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం విశేషకార్యం తయారుచేస్తుంది.
మీరు ఏమి చేస్తారు? నిర్బల ఆత్మలకి బలం ఇచ్చేవారు అని
బాబా యొక్క మహిమ చేస్తారు కదా! స్థూలంగా అయితే నిర్బల ఆత్మలను సైన్స్ సాధనాల
ద్వారా బలవాన్‌గా చేస్తున్నాయి. కుంటుతూ నడిచేవారికి కూడా నడవగలిగే
శక్తినిచ్చేస్తున్నారు. అదేవిధంగా మీరందరు బ్రాహ్మణ పరివారంలో లేదా విశ్వ
ఆత్మలలో నిర్బల ఆత్మలకి బలం ఇచ్చే మహాబలవంతులుగా అవ్వండి, ఎలా అయితే వారు -
పేదరికాన్ని నిర్మూలించండి అనే సూక్తులు పెడతారో అదేవిధంగా నిర్బలతను తొలగించండి.
నిమిత్తంగా అయ్యి బాబా ద్వారా ధైర్యం మరియు సహాయం ఇవ్వండి. కనుక ఈ సంవత్సరం
యొక్క విశేష సూక్తి ఏమిటి? సదా ఉత్సాహాన్నే ఇవ్వండి అనే సూక్తి ఏదైతే లభించిందో
దానిని ప్రత్యక్షంలోకి తీసుకురాగలరు. అయితే క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలో
అర్ధమైందా?
డబుల్ విదేశీయులకు క్రొత్త సంవత్సరం యొక్క గొప్పతనం
ఎక్కువగా ఉంటుంది. ఈ మహానత ద్వారా క్రొత్త సంవత్సరం యొక్క గొప్పతనం సదా ఉంటుంది.
82వ సంవత్సరం గొప్పగా జరుపుకోండి మరలా 83వ సంవత్సరంలో ఏమి చేస్తారు? 83వ
సంవత్సరంలో ఈ మహానత ద్వారా సిద్ధిస్వరూపంగా, సిద్ధి పొందేవారిగా, సర్వ కార్యాలు
సిద్ధి అయ్యే విధంగా, సర్వులకు సిద్ధి ఇచ్చే సెకను యొక్క విధి చెప్పాలి. ఈ
విధమైన సిద్ధి సంవత్సరం జరుపుకోండి. కార్యం కూడా సిద్ధించాలి, సంకల్పం కూడా
సిద్ధించాలి మరియు స్వరూపం కూడా సదా సిద్ధిస్వరూపంగా ఉండాలి. అప్పుడే
ప్రత్యక్షత మరియు జై - జై కారాలు వస్తాయి. సైన్స్ సదా సిద్ధిస్వరూపంగా ఉండదు
కానీ మీరు సదా సిద్ధిస్వరూపులు. (ఈరోజు కరెంట్ మధ్య - మధ్యలో వస్తూ, పోతూ ఉంది)
మీ రాజ్యంలో ఈ గొడవ ఉంటుందా? మీ స్వీట్ హోమ్ లో అయితే దీని యొక్క అవసరమే ఉండదు.
కనుక ఇప్పుడు మీ స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజధాని సమీపంగా తీసుకురండి అంటే
స్వయం సమీపంగా వెళ్ళండి. ఏమి చేయాలో అర్ధమైందా?
ఈవిధంగా సదా ఒకని స్మృతిలో ఉండేవారికి, ఒకనితో
సర్వసంబంధాలు జోడించేవారికి, సదా ఏక రసస్థితిలో ఉండే వారికి, ఈ విధంగా బాబా
సమానమైన వారికి, స్వయం ద్వారా మరియు సేవ ద్వారా బాప్ దాదాని ప్రత్యక్షం చేసే
వారికి, ప్రత్యక్ష ఫల స్వరూపులకు, అతి స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.