02.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగీ బ్రాహ్మణులపై విశ్వ పరివర్తన యొక్క బాధ్యత.

సదా జాగృతి జ్యోతి శివబాబా తన యొక్క చైతన్య దీపాలతో మాట్లాడుతున్నారు -

బాప్ దాదా తన యొక్క బ్రాహ్మణ కుల దీపాలను కలుసుకునేటందుకు వచ్చారు. చైతన్య దీపమాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క దీపం విశ్వానికి వెలుగునిచ్చే చైతన్యదీపం. అన్ని దీపాల సంబంధం ఒకే జాగృతి జ్యోతితో ఉంది. ప్రతి ఒక్క దీపం యొక్క వెలుగు ద్వారా విశ్వంలోని అంధకారం తొలగి వెలుగు యొక్క మెరుపు వస్తుంది. ప్రతి దీపం యొక్క కిరణాలు వ్యాపిస్తూ, ఈ కిరణాలు విశ్వంపై ప్రకాశ ఛత్రఛాయగా తయారవుతున్నాయి, దీపాల యొక్క ఈ సుందరదృశ్యాన్ని బాప్ దాదా చూస్తున్నారు. మీరందరు కూడా దీపాలన్నింటి వలన పరుచుకునే వెలుగు యొక్క ఛత్రఛాయను చూస్తున్నారా? లైట్ - మైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారా? స్వ స్వరూపం మరియు సేవా స్వరూపాన్ని కూడా వెనువెంట అనుభవం చేసుకుంటున్నారా? ఇదే స్వరూపంలో స్థితులై ఉండండి. ఇది ఎంతో శక్తిశాలి స్వరూపం! వెలుగుతున్న దీపాలైన మీ వైపు విశ్వంలోని ఆత్మలు ఎంతో స్నేహంతో చూస్తున్నారు. కొద్దిపాటి వెలుగు కోసం ఎంతమంది ఆత్మలు అంధకారంలో భ్రమిస్తున్నారు? వెలుగు కోసం తపిస్తున్నారో అనుభవం చేసుకోండి.. తపించే ఆ ఆత్మలు కనిపిస్తున్నారా? దీపాలైన మీ వెలుగు ఒకవేళ కదులుతూ ఉంటే, అంటే ఇప్పుడిప్పుడే వెలగటం, ఇప్పుడిప్పుడే ఆరిపోవటం.....ఇలా ఉంటే భ్రమించే ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది? చీకటిగా ఉన్నప్పుడు అందరికీ వెలుగు గురించి కోరిక ఉంటుంది. వెలుగుతూ, ఆరిపోతూ ఉండే లైట్ ఎవరికీ ఇష్టం అనిపించదు. అదేవిధంగా వెలిగి ఉన్న దీపాలైన మీ ప్రతి ఒక్కరిపై విశ్వం యొక్క అంధకారాన్ని తొలగించే బాధ్యత ఉంది. ఇంత పెద్ద బాధ్యత కలిగిన వారిగా అనుభవం చేసుకుంటున్నారా?

డ్రామా యొక్క రహస్యం అనుసరించి ఈరోజు బ్రాహ్మణులు మేల్కొంటే అందరు మేల్కొంటారు. బ్రాహ్మణులు మేల్కొంటే పగలు లేదా వెలుగు వస్తుంది మరియు బ్రాహ్మణుల యొక్క జ్యోతి ఆరిపోతే విశ్వంలో అంధకారం లేదా రాత్రి వస్తుంది. రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేసేది చైతన్య దీపాలైన మీరే. ఇంత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బాప్ దాదా ప్రతి ఒక్కరి చార్ట్ చూస్తున్నారు - ప్రతి ఒక్కరు తమని తాము ఎంత బాద్యతాధారిగా భావిస్తున్నారు. విశ్వపరివర్తన యొక్క భాద్యతాకిరీటాన్ని ధరించారా? లేదా? దీనిలో కూడా నెంబర్ వారీ కిరీటధారులు కూర్చున్నారు. మీ కిరీటాన్ని చూసుకుంటున్నారా? సదా ధరిస్తున్నారా లేక అప్పుడప్పుడు ధరిస్తున్నారా? సోమరిగా అయితే అవ్వటం లేదు కదా? పెద్దవారిది బాధ్యత అని భావించడం లేదు కదా? విశ్వం యొక్క కిరీటం పెద్దవారికి ఇస్తారా లేక మీరు తీసుకుంటారా? మిమ్మల్ని మీరు విశ్వరాజ్యాధికారిగా భావిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీరు ప్రజలే అవ్వండి అని అంటే ఇష్టపడతారా? అందరూ విశ్వమహారాజులుగా అవ్వటానికి వచ్చారు కదా! లేక ప్రజలుగా అవ్వటం కూడా ఇష్టమేనా? ఎలా అవుతారు? ప్రజలుగా అవ్వడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా? అందరు లక్ష్మీ, నారాయణులుగా అవ్వడానికి చేతులు ఎత్తుతున్నారు. అయితే ఆ రాజ్య కిరీటం ధరించాలంటే ఆ కిరీటానికి ఆధారం అయిన సేవ అనే బాధ్యతాకిరీటాన్ని ధరించాలి. కనుక ఏమి చేయవలసి ఉంటుంది? ఇప్పటినుండి కిరీటధారిగా అయ్యే సంస్కారాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. ఏ కిరీటం ధారణ చేయాలి? బాధ్యతా కిరీటాన్ని ధారణ చేయాలి.

ఈరోజు బాప్ దాదా అందరి యొక్క కిరీటాన్ని చూస్తున్నారు. కనుక ఇది ఏ సభ అయ్యింది? కిరీటధారుల యొక్క సభను చూస్తున్నారు. అందరూ ఈ పట్టాభిషేకాన్ని జరుపుకున్నారా? జరుపుకున్నారా లేక ఇప్పుడు జరుపుకోవాలా? మీ యొక్క స్మృతిచిహ్న చిత్రంలో శ్రీకృష్ణుడిని బాల్యం నుండే కిరీటధారిగా చూపిస్తారు. పెద్ద అయిన తర్వాత అయితే తప్పకుండా ఉంటుంది. కానీ చిన్నతనం నుండే చూపిస్తారు. మీ చిత్రం చూసారా? డబుల్ విదేశీయులు మీ చిత్రం చూసారా? ఇది ఎవరి చిత్రం? కేవలం ఒక బ్రహ్మ యొక్క చిత్రమేనా లేక మీ అందరి చిత్రమా? ఏవిధంగా అయితే శ్రీకృష్ణుని యొక్క చిత్రంలో చిన్నతనం నుండి కిరీటం చూపించారో అదేవిధంగా శ్రేష్ట ఆత్మలైన మీరు కూడా మరజీవగా అయ్యారు. బ్రాహ్మణులుగా అయ్యారు మరియు బాధ్యతా కిరీటాన్ని ధారణ చేసారు అంటే జన్మతోనే కిరీటధారిగా అవుతున్నారు. అందువలనే స్మృతిచిహ్నంలో కూడా జన్మ నుండే కిరీటాన్ని చూపించారు.

బ్రాహ్మణులుగా అవ్వటం అంటే పట్టాభిషేకాన్ని జరుపుకోవటం. అందరూ జరుపుకున్నారు కదా? విశ్వ సేవ యొక్క బాధ్యతాకిరీటధారిగా అయ్యి సదా సేవలోనే నిమగ్నమై ఉంటున్నారా అనేది ఇప్పుడు చూడవలసి ఉంది. అయితే అలా చూస్తే ఏమి కనిపించింది? అందరు కిరీటధారులుగా కనిపిస్తున్నారు. కానీ కొందరికి దృఢసంకల్పంతో అమరిక మంచిగా ఉంది, కొంతమందికి వదులుగా ఉంది. వదులుగా ఉన్న కారణంగా అప్పుడప్పుడు తీసేస్తున్నారు, అప్పుడప్పుడు పెట్టుకుంటున్నారు. సదా ధృఢసంకల్పం ద్వారా ఈ కిరీటాన్ని సదాకాలికంగా అమర్చుకోండి. ఏమి చేయాలో అర్ధమైందా? బ్రహ్మాబాబా పిల్లలలను చూసి ఎంతో సంతోషిస్తున్నారు! బ్రహ్మాబాబా కూడా సదా పాట పాడుతూ ఉంటారు, ఏ పాట పాడుతున్నారు? ఓహో! నా పిల్లలూ ఓహో!! అలాగే పిల్లలు ఏ పాట పాడుతున్నారు? (ఓహో బాబా ..... ఓహో!!) ఇది సహజమైన పాట. అందువలనే పాడుతున్నారు. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? అందరికంటే ఎక్కువ బ్రహ్మాబాబాకి సంతోషంగా ఉంటుంది. ఎందుకు? పిల్లలందరు తమని తాము ఏమని పిలుచుకుంటున్నారు? బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారీ అని. శివకుమార్, శివకుమారీ అనటంలేదు. కనుక బ్రహ్మాబాబా రచయిత కనుక తన యొక్క రచనను చూసి సంతోషిస్తున్నారు. బ్రహ్మముఖ వంశావళి కదా! తన యొక్క వంశావళిని చూసి బ్రహ్మాబాబా సంతోషిస్తున్నారు.

అవ్యక్తరూపధారి అయినప్పటికీ మధువనంలో వ్యక్తరూపధారిగా అంటే చైతన్య సాకార రూపం యొక్క అనుభూతి చేయిస్తున్నారు. మధువనం వచ్చి బ్రాహ్మణ పిల్లలు అందరూ బ్రహ్మ యొక్క, సాకారరూపం యొక్క, సాకార చరిత్ర యొక్క అనుభవం చేసుకుంటున్నారు కదా! సాకార రూపం యొక్క అనుభూతి చేయించే విశేష వరదానం మధువన భూమికి ఉంది. ఈ విధమైన అనుభూతి చేసుకుంటున్నారు కదా! ఆకారధారి బ్రహ్మయా లేక సాకారధారియా? ఏ అనుభవం చేసుకుంటున్నారు? ఆత్మిక సంబాషణ చేస్తున్నారా? మంచిది!

ఈరోజు వతనంలో బాప్ దాదాలకు ఇదే ఆత్మిక సంభాషణ నడిచింది. - డబుల్ విదేశీ పిల్లలు తమ సమీప సంబంధం యొక్క స్నేహం ద్వారా నిరాకారి మరియు ఆకారిని, సాకార రూపధారిగా చేయటంలో తెలివైనవారిగా ఉన్నారు. పిల్లల స్నేహం యొక్క గారడీతో ఆకారి కూడా సాకారిగా అవుతున్నారు. స్నేహంతో గారడీ చేసే పిల్లలు. స్నేహం స్వరూపాన్ని మార్చేస్తుంది. బ్రహ్మాబాబా కూడా ఈ విధంగానే అనుభవం చేసుకుంటున్నారు - ప్రతి ఒక్క స్నేహి పిల్లలతో సాకారరూపధారిగా అయ్యి కలుసుకుంటున్నట్లు అంటే పిల్లల యొక్క స్నేహానికి జవాబు ఇస్తున్నారు. స్నేహం అనే త్రాడుతో మీతోపాటు బాప్ దాదాని సదాకాలికంగా బంధిస్తున్నారు. ఈ స్నేహం యొక్క త్రాడు ఎంత గట్టిదంటే దీనిని ఎవరూ తెంచలేరు. 21 జన్మలు బ్రహ్మాబాబాతో రకరకాల సంబంధాలలో బంధించబడే ఉంటారు, వేరు అవ్వరు. ఇలా త్రాడుతో బంధించారు కదా! దీనినే మధురమైన బంధన అంటారు. 21 జన్మల వరకు నిశ్చితం అయి ఉంది. ఈ విధమైన బంధనలో బంధించారు కదా! గారడీ చేసే పిల్లలు కదా! అయితే ఈ రోజు వతనంలో ఏమి ఆత్మిక సంభాషణ నడిచిందో విన్నారు కదా! బ్రహ్మాబాబా ఒక్కొక్క పిల్లవానిలో విశేషత అనే మెరిసే మణిని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి విశేషత మణి వలె మెరుస్తుంది. మీ మెరిసే మణిని చూసారా! మంచిది.

డబుల్ విదేశీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చాను. ఈరోజు వాణీ చెప్పటం లేదు. బాబా యొక్క అద్భుతం కానీ పిల్లల యొక్క అద్భుతం కూడా తక్కువ కాదు. మీరు పరస్పరంతో మేము ఆత్మిక సంభాషణ చేసుకుంటాం అని భావిస్తారు. కానీ, బాప్ దాదా కూడా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మంచిది!

ఈ విధంగా సదా విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటధారులకు, సదా స్నేహం యొక్క బంధనలో బాప్ దాదాను తమ తోడుగా చేసుకునే వారికి, 21 జన్మలకు అవినాశి సంబంధంలోకి వచ్చే వారికి, సదా వెలుగుతూ ఉండే దీపాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.