04.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సద్గురువు యొక్క ప్రథమ వరదానం - మన్మనా భవ.

సద్గురువు శివబాబా గురు తన మనువలతో మాట్లాడుతున్నారు -

ఈరోజు జ్ఞానసాగరుడైన బాబా సాగరతీరాన జ్ఞానరత్నాలను గ్రహించే హోలీహంసలను కలుసుకునేటందుకు వచ్చారు. ప్రతి ఒక్క హోలీహంస జ్ఞానరత్నాలను గ్రహించి ఎంతో సంతోషంతో నాట్యం చేస్తుంది, హంసల నాట్యం చూస్తున్నారు. ఈ అలౌకిక సంతోషం యొక్క ఆత్మిక నాట్యం ఎంతో ప్రియమైనది మరియు మొత్తం కల్పంలో అతీతమైనది. సాగరుని రకరకాలైన అలలను చూసి ప్రతి ఒక హంస ఎంతో సంతోషిస్తుంది! అయితే ఈరోజు బాప్ దాదా ఏమి చూడడానికి వచ్చారు? హంసల నాట్యం చూడడానికి వచ్చారు? నాట్యం చేయడంలో అయితే ప్రవీణులు కదా? ప్రతి ఒక్కరి మనస్సు యొక్క, సంతోషం యొక్క పాటను కూడా వింటున్నారు. పాట లేకుండా నాట్యం ఉండదు కదా! కనుక పాట కూడా వస్తుంది మరియు నాట్యం కూడా చేస్తున్నారు. మీరందరు కూడా సంతోషం యొక్క పాట వింటున్నారా? ఈ పాట చెవులతో వినే పాట కాదు. మనస్సు యొక్క పాట మనస్సుతోనే వినగలరు. మన్మనాభవగా అవ్వగానే పాట పాడటం లేదా వినటం ప్రారంభం అవుతుంది. మన్మనాభవ అనే మంత్రం యొక్క వరదానిగా అయితే అందరు అయ్యారు. సద్గురువు వారిగా అయ్యారు అంటే సద్గురువు ద్వారా మొట్టమొదట ఏ వరదానం లభించింది? మన్మనాభవ. సద్గురువు రూపంలో వరదాని పిల్లలను చూస్తున్నారు. అందరు మహామంత్ర ధారులు, మహాదాని, వరదాని, సద్గురువు యొక్క పిల్లలు మాస్టర్ సద్గురువులు లేదా గురువు యొక్క మనువలుగా అయ్యారు. మనువలకి హక్కు ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మ యొక్క పిల్లలు అంటే మనువలు కూడా అయ్యారు. పిల్లలు కూడా మరియు మనవలు కూడా! ఎంత బాబా యొక్క సంబంధమో అంతగా మీకు సంబంధం ఉంటుంది. సర్వ సంబంధాలలో అధికారి ఆత్మలు. భోళానాధ్ బాబా నుండి అన్నీ తీసుకోవటంలో తెలివైనవారు. మంచి వ్యాపారులు కూడా! వ్యాపారం చేసారు కదా? భగవంతునితో వ్యాపారం చేస్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా? మరియు వ్యాపారంలో మీరు తీసుకున్నది ఏమిటి? వ్యాపారంలో లభించింది ఏమిటి? (ముక్తి-జీవన్ముక్తి) కేవలం ముక్తి, జీవన్ముక్తియే లభించిందా? వ్యాపారులతో పాటు గారడి చేసేవారు కూడా! వ్యాపారం ఎంత ఉన్నతంగా చేసారంటే ఇక ఏ వ్యాపారం చేయవలసిన అవసరమే లేదు, ఏ వస్తువు యొక్క వ్యాపారం చేయలేదు కానీ వస్తువులను ఇచ్చే దాతతో వ్యాపారం చేసారు. దానిలోనే అన్నీ వచ్చేసాయి కదా! దాతనే మీ వారిగా చేసేసుకున్నారు. మంచిది.