06.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగీ బ్రాహ్మణ జీవితంలో పవిత్రత యొక్క గాప్పతనం.

పవిత్రతా సాగరుడు, సదా పూజ్యుడైన శివబాబా మాట్లాడుతున్నారు-

ఈ రోజు బాప్ దాదా విశేషంగా పిల్లల యొక్క పవిత్రతా రేఖను చూస్తున్నారు. సంగమయుగంలో విశేషంగా బాబా నుండి రెండు వరదానాలు పిల్లలందరికీ లభిస్తున్నాయి. ఒకటి సహజయోగి భవ! రెండు పవిత్ర భవ! ఈ రెండు వరదానాలు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ పురుషార్ధం అనుసరించి జీవితంలో ధారణ చేస్తుంది. ఈ విధమైన ధారణా స్వరూప ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక పిల్లవాని మస్తకం మరియు నయనాల ద్వారా పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుంది. సంగమయుగీ బ్రాహ్మణుల గొప్ప జీవితం యొక్క గొప్పతనం - పవిత్రత. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ అలంకరణ. ఏవిధంగా అయితే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస అవసరమో, శ్వాస లేకపోతే జీవితం లేదు. అదేవిధంగా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస - పవిత్రత. 21 జన్మల ప్రాప్తికి ఆధారం అంటే పునాది - పవిత్రత. ఆత్మ అంటే పిల్లలు, తండ్రిని కలుసుకోవడానికి ఆధారం - పవిత్రబుద్ధి. సంగమయుగీ సర్వ ప్రాప్తులకు ఆధారం - పవిత్రత. పవిత్రత పూజ్యపదవి పొందడానికి ఆధారం. ఈ గొప్ప వరదానాన్ని సహజంగా పొందారా? వరదాన రూపంలో అనుభవం చేసుకుంటున్నారా లేక శ్రమతో పొందుతున్నారా? వరదానంలో శ్రమ ఉండదు. కానీ వరదానాన్ని సదా జీవితంలో పొందడానికి కేవలం ఒక విషయం యొక్క ధ్యాస ఉండాలి - వరదాత మరియు వరదాని. ఇద్దరి సంబంధం సమీపంగా మరియు స్నేహంతో నిరంతరం ఉండాలి. వరదాత మరియు వరదాని ఆత్మ, ఇద్దరు కంబైండ్ రూపంలో ఉంటే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగా ఉంటుంది. ఎక్కడ సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో, అక్కడ అపవిత్రత అనేది కలలో కూడా రాలేదు. సదా బాబా మరియు మీరు దంపతుల రూపంలో ఉండండి. సింగిల్ గా కాదు, యుగల్ గా ఉండండి. సింగిల్ గా అయిపోతే పవిత్రత యొక్క సౌభాగ్యం పోతుంది. కంబైండ్ గా ఉంటే పవిత్రత యొక్క సౌభాగ్యం మరియు శ్రేష్టభాగ్యం మీ వెంట ఉంటాయి. కనుక బాబాని వెంట ఉంచుకోవటం అంటే మీ యొక్క సౌభాగ్యాన్ని మరియు భాగ్యాన్ని వెంట ఉంచుకోవటం. కనుక అందరు సదా బాబాని వెంట ఉంచుకునే అభ్యాసీలే కదా? విశేషంగా డబుల్ విదేశీ పిల్లలకు ఒంటరిగా ఉండే జీవితం ఇష్టం కాదు కదా? సదా తోడు కావాలి కదా! కనుక బాబాని తోడుగా చేసుకున్నారు అంటే సదాకాలిక పవిత్రతను ధారణ చేశారు. ఈ విధమైన దంపతులకు పవిత్రత చాలా సహజం. పవిత్రతయే స్వతహా జీవితంగా అవుతుంది. పవిత్రంగా ఉందాం, పవిత్రంగా అవుదాం... అనే ప్రశ్నే ఉండదు. బ్రాహ్మణుల జీవితమే - పవిత్రత. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానమే - పవిత్రత. ఆది, అనాది స్వరూపమే - పవిత్రత, ఎప్పుడైతే నేను ఆది, అనాది పవిత్ర ఆత్మను అని స్మృతి వచ్చిందో, అలా స్మృతి రావటం అంటే పవిత్రత యొక్క సమర్ధత రావటం. స్మృతి స్వరూప, సమర్ధ ఆత్మల నిజసంస్కారం - పవిత్రత. సాంగత్యదోషం యొక్క సంస్కారం - అపవిత్రత. అయితే నిజసంస్కారాన్ని ప్రత్యక్షం చేయటం సహజమా లేక సాంగత్యదోషం యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షం చేయటం సహజమా? బ్రాహ్మణజీవితం అంటే సహయోగి మరియు సదాకాలికంగా పావనజీవితం. పవిత్రత - బ్రాహ్మణ జీవితం యొక్క విశేష జన్మ యొక్క విశేషత. పవిత్ర సంకల్పాలు - బ్రాహ్మణుల బుద్ధికి భోజనం. పవిత్ర దృష్టి - బ్రాహ్మణుల కంటి వెలుగు. పవిత్ర కర్మ - బ్రాహ్మణజీవితం యొక్క విశేష వ్యాపారం. పవిత్ర సంబంధం మరియు సంప్రదింపులు - బ్రాహ్మణజీవితం యొక్క మర్యాద.

అయితే ఆలోచించండి - బ్రాహ్మణజీవితం యొక్క గొప్పతనం ఏమిటి? పవిత్రత కదా! ఇటువంటి గొప్ప స్థితిని తయారుచేసుకోవడానికి శ్రమ చేయకండి, హఠంతో తీసుకురాకండి. శ్రమ మరియు హఠంతో చేసేది నిరంతరం ఉండలేదు. కానీ పవిత్రత అనేది బ్రాహ్మణజీవితం యొక్క వరదానం. కనుక దీనిలో శ్రమ మరియు హఠం ఎందుకు? మీ స్థితిని మీదిగా చేసుకోవటంలో శ్రమ ఎందుకు? పరాయి వస్తువుని మీదిగా చేసుకోవటంలో శ్రమ అనిపిస్తుంది. పరాయి వస్తువు అపవిత్రత, పవిత్రత కాదు. రావణుడు పరాయివాడు, మీవాడు కాదు. బాబా మీ వారు, రావణుడు పరాయివాడు. కనుక బాబా యొక్క వరదానం - పవిత్రత మరియు రావణుని శాపం - అపవిత్రత. అయితే రావణుని పరాయి వస్తువుని మీదిగా ఎందుకు చేసుకుంటున్నారు? పరాయి వస్తువు మంచిగా అనిపిస్తుందా? మీ వస్తువు వలన మీకు నషా ఉంటుంది కదా! కనుక సదా స్వ స్వరూపం - పవిత్రత, స్వధర్మం - పవిత్రత అంటే ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత. స్వదేశం -పవిత్రదేశం. స్వరాజ్యం - పవిత్ర రాజ్యం. స్వయం యొక్క స్మృతిచిహ్నం - పరమ పవిత్రపూజ్యులు. 5 కర్మేంద్రియాల యొక్క అనాది స్వభావం - సుకర్మ. వీటిని స్మృతి ఉంచుకుంటే శ్రమ మరియు హఠం నుండి ముక్తులు అవుతారు. పిల్లలు శ్రమ చేయటం బాప్ దాదా చూడలేరు. అందువలనే చెప్తున్నారు మీరందరు పవిత్ర ఆత్మలు, ఈ స్వమానంలో స్థితులై ఉండండి. స్వమానం ఏమిటి? నేను పరమ పవిత్ర ఆత్మను. సదా మీ ఈ స్వమానం యొక్క ఆసనం పై స్థితులై ప్రతి కర్మ చేయండి. అప్పుడు సహజంగా వరదానిగా అయిపోతారు. ఇదే సహజమైన ఆసనం. కనుక సదా పవిత్రత యొక్క మెరుపు మరియు నిశ్చయంలో ఉండండి. స్వమానం ముందు దేహాభిమానం రాలేదు. అర్ధమైందా!

డబుల్ విదేశీయులు దీనిలో పాస్ అయిపోయారు కదా? హఠయోగులు కాదు కదా? శ్రమ చేసే యోగులు కాదు కదా? ప్రేమలో ఉంటే శ్రమ సమాప్తి అయిపోతుంది. లవలీన ఆత్మగా అవ్వండి. సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు ఇదే స్వతహా పవిత్రత. ఈ పాట పాడటం రావడం లేదా? ఈ పాట పాడటమే సహజ పవిత్ర ఆత్మగా అవ్వటం.

ఈవిధంగా సదా స్వ ఆసనం యొక్క అధికారి ఆత్మలకు, సదా బ్రాహ్మణ జీవితం యొక్క గొప్పతనాన్ని మరియు విశేషతలను జీవితంలో ధారణ చేసే ఆది, అనాది పవిత్ర ఆత్మలకు, స్వ స్వరూపము, స్వ ధర్మం, సుకర్మలో స్థితులయ్యే శ్రేష్ట ఆత్మలకు మరియు పరమపవిత్ర పూజ్య ఆత్మలకు పవిత్రత యొక్క వరదానాన్ని పొందిన మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.