08.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


లండన్ గ్రూపుతో అవ్యక్త బాప్ దాదా యొక్క సంభాషణ.

అతి మధురమైన, అతి ప్రియమైన బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు విశేషంగా లండన్ నివాసి పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. బాప్ దాదాకి అందరూ ప్రియమైనవార. అందరికీ విశేషంగా కలుసుకునే అవకాశం లభించింది కానీ ఈరోజు విశేషంగా లండన్ నివాసీయులను కలుసుకుంటున్నారు. లండన్ నివాసీ ల పిల్లలు సేవలో, హృదయం లేదా, ప్రాణంతో, దయ లేదా ప్రేమతో తమ యొక్క సహయోగం ఇచ్చారు మరియు ఇస్తూనే ఉంటారు. స్వయం యొక్క ఎగిరేకళలో కూడా మంచి ధ్యాస ఉంది. ఎక్కడైనా కానీ నెంబరు వారీగా అయితే ఉంటారు. అయినప్పటికీ పురుషార్ధం యొక్క వేగం అయితే మంచిగా ఉంది. (ఒక పక్షి ఎగురుతూ క్లాసులోకి వచ్చింది) ఎగరటం చూసి అందరూ సంతోషిస్తున్నారు కదా! అదేవిధంగా స్వయం యొక్క ఎగిరేకళ కూడా ఎంత ప్రియంగా ఉంటుంది! ఎప్పుడైతే ఫ్రీగా, స్వతంత్రంగా ఉంటారో అప్పుడు ఎగరగలరు, కానీ పైన ఎగరడానికి బదులు క్రిందకి వచ్చేస్తే బంధనలోకి వచ్చేస్తారు. ఎగిరేకళ అంటే బంధనముక్తులుగా, యోగయుక్తులుగా ఉండటం. కనుక లండన్ నివాసులు ఏమని భావిస్తున్నారు? ఎగిరేకళలో ఉన్నారా? క్రిందకి రావటం లేదు కదా? ఒకవేళ క్రిందకి వస్తున్నా , క్రింద ఉన్నవారిని పైకి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. కానీ మమూలుగా రావడం లేదు కదా? క్రింద స్థితిలో ఉన్నవారికి ధైర్యం మరియు ఉల్లాసం ఇచ్చి ఎగిరింప చేయడానికి సేవ కోసం క్రిందికి వచ్చారు. మరలా పైకి వెళ్ళిపోవాలి. ఈవిధమైన అభ్యాసం ఉందా? ఏమని భావిస్తున్నారు? లండన్ నివాసి గ్రూప్ సదా దేహం మరియు దేహం యొక్క ఆకర్షణకి అతీతంగా బాబాకి ప్రియంగా ఉండాలి. దీనినే కమలపుష్ప సమానస్థితి అంటారు. సేవార్ధం ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కనుక అతీతంగా, ప్రియంగా ఉండే గ్రూప్ కదా? లండనుతో మొత్తం విదేశీ సేవా కేంద్రాల అన్నింటి సంబంధం ఉంది. లండన్ నివాసులు సేవ అనే వృక్షానికి పునాది అయ్యారు. పునాది బలహీనంగా ఉంటే వృక్షం అంతా బలహీనంగా ఉంటుంది. అందువలన పునాది అయిన మీపై సదా మీ యొక్క భాధ్యతా సహితంగా ధ్యాస ఉంచుకోవాలి. తమ యొక్క మరియు విశ్వసేవ యొక్క భాధ్యత అనేది ప్రతి ఒక్కరిపై అయితే ఉంది. అందరు బాధ్యతా కిరీటధారులు అని చెప్పాను కదా! ఈ రోజు లండన్ నివాసి పిల్లలకు విశేషంగా ధ్యాస ఇప్పిస్తున్నారు. ఈ బాధ్యతాకిరీటం సదాకాలికంగా డబుల్ లైట్ గా చేస్తుంది. బరువైన కిరీటం కాదు, అన్నిరకాల బరువులను తొలగించేది. అనుభవం కూడా ఉంది కదా - ఎప్పుడైతే తనువు, మనస్సు, ధనం, మనసా, వాచా, కర్మణా అన్ని రూపాలతో సేవలో బిజీగా ఉంటారో సహజంగానే మాయాజీత్ గా, జగత్ జీత్ గా అయిపోతారు. దేహాభిమానం కూడా స్వతహాగా మరియు సహజంగా పోతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. దీని అనుభవం ఉంది కదా! సేవా సమయంలో బాబా మరియు సేవ తప్ప ఇంకేది ఆకర్షించదు. సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. అంటే ఈ బాధ్యతాకిరీటం తేలికే కదా? అంటే తేలికగా చేసేది. అందువలనే బాప్ దాదా పిల్లలందరికీ ఆత్మిక సేవాధారి అనే టైటిల్ ని విశేషంగా స్మృతి ఇప్పిస్తారు. బాప్ దాదా కూడా ఆత్మిక సేవాధారి అయ్యి వస్తున్నారు. బాబా యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క స్వరూపం. డబుల్ విదేశీయులందరు కిరీటధారులే కదా? బాబా సమానంగా సదా ఆత్మిక సేవాధారులుగా ఉండాలి. కళ్ళు తెరిచారు, కలయిక జరుపుకున్నారు మరియు సేవా క్షేత్రంలో ఉపస్థితులవ్వాలి. గుడ్ మార్నింగ్ తో సేవ మొదలవుతుంది. తిరిగి గుడ్ నైట్ వరకు సేవయే సేవ. ఏవిధంగా అయితే నిరంతరయోగిగా అవుతున్నారో అదేవిధంగా నిరంతర సేవాధారిగా అవ్వాలి. కర్మణా సేవ చేస్తున్నా కానీ కర్మణా ద్వారా కూడా ఆత్మలకు ఆత్మీయత యొక్క శక్తి నింపుతున్నారు. ఎందుకంటే కర్మణాతో పాటు వెనువెంట మనసాసేవ కూడా చేస్తున్నారు.

కనుక కర్మణా సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంది. భోజనం తయారు చేస్తున్నారు. ఆ భోజనంలో ఆత్మీయత యొక్క బలం నింపుతున్నారు. అందువలన ఆ భోజనం బ్రహ్మాభోజనం అవుతుంది. శుద్ధ అన్నం అవుతుంది. ప్రసాదం సమానంగా అవుతుంది. కనుక స్థూల సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంది. ఈ విధంగా నిరంతర సేవాధారులుగా, నిరంతర మాయాజీత్ గా అవుతున్నారు. విఘ్నవినాశకులుగా అవుతున్నారు. లండన్ నివాసులు ఎవరు? నిరంతరం సేవాధారులు. లండన్లో మాయ రావటం లేదు కదా లేక మాయకి కూడా లండన్ అంటే ఇష్టమా? మంచిది.

లండన్ నివాసులు ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు? లండన్లో మంచి మంచి రత్నాలు ఉన్నారు. ప్రతి స్థానానికి వెళ్ళారు. విదేశం యొక్క సేవాకేంద్రాలన్నీ ఒకటి నుండి రెండు, రెండు నుండి మూడు ఇలా తెరవబడుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని సేవాకేంద్రాలు ఉన్నాయి? 50 అయితే 50 ప్రాంతాలకు పునాది - లండన్. కనుక వృక్షం సుందరంగా అయ్యింది కదా! కాండం నుండి 50 కొమ్మలు వస్తే ఆ వృక్షం ఎంత సుందరంగా అయ్యింది? విదేశి వృక్షం కూడా విస్తారం అయ్యి ఫలీభూతం అయ్యింది. బాప్ దాదా పిల్లలందరి యొక్క అంటే కేవలం లండన్ నివాసులే కాదు, పిల్లలందరి సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలను చూసి సంతోషిస్తున్నారు. విదేశం వారిలో సంలగ్నత మంచిగా ఉంది. స్మతి మరియు సేవ రెండింటి యొక్క సంలగ్నత బావుంది. కేవలం ఒక విషయం ఉంది - మాయ యొక్క చిన్న రూపానికి కూడా తొందరగా భయపడిపోతున్నారు. ఏవిధంగా అయితే ఇండియాలో కొంతమంది బ్రాహ్మణపిల్లలు చిన్న ఎలుకకి కూడా భయపడిపోతారు, బొద్దింకకి కూడా భయపడిపోతారు. అదేవిధంగా విదేశీయులు కూడా వీటికి భయపడిపోతున్నారు. చిన్నదానిని పెద్దగా భావిస్తున్నారు. కానీ ఉన్నది ఏమీ లేదు. కాగితపు పులిని నిజమైన పులిగా భావిస్తున్నారు. ఎంత సంలగ్నత ఉన్నా, అంతగా భయపడే సంస్కారం ఉన్న కారణంగా మైదానంలోకి రావలసి వస్తుంది. కనుక విదేశీ పిల్లలు మాయతో భయపడకూడదు, ఆడుకోవాలి. కాగితపు పులితో ఆడుకుంటారా లేక భయపడతారా? మాయ ఆటబొమ్మ అయిపోయింది కదా? అటబొమ్మని చూసి భయపడేవారిని ఏమంటారు? ఎంతగా శ్రమ చేస్తున్నారో ఆ లెక్కతో చూస్తే డబల్ విదేశీయులు అందరు నెంబర్ వన్ సీట్ తీసుకోగలరు. ఎందుకంటే ఇతర ధర్మం యొక్క పరదాలో ఉండి, డబల్ ధర్మం యొక్క పరదాలో ఉన్నా బాబాని గ్రహించారు. 1.సాధారణ స్వరూపం యొక్క పరదా, 2. ధర్మం యొక్క పరదా, భారతవాసీయులు అయితే ఒకే పరదాలో ఉంటూ తెలుసుకోవలసి ఉంటుంది. కానీ విదేశీయులు రెండు పరదాలలో ఉంటూ తెలుసుకున్నారు. చాలామంది ధైర్యంతో ఉన్నారు, అసంభవాన్ని కూడా సంభవం చేసారు. ఎందుకంటే క్రిష్టియన్ ధర్మంవారు లేక ఇతర ధర్మాల వారు, మా ధర్మం వారు బ్రాహ్మణులుగా ఎలా అవుతారు, అసంభవం అంటారు. కానీ అసంభవాన్ని సంభవం చేసారు. తెలుసుకోవటంలో కూడా తెలివైనవారు మరియు అంగీకరించడంలో కూడా తెలివైనవారు. రెండింటిలో నెంబర్‌ వన్‌గా అయ్యారు. నడుస్తూ కూడా చిన్న ఎలుక వస్తే భయపడిపోతున్నారు. మార్గం సహజమైనదే కానీ స్వయం యొక్క వ్యర్ధసంకల్పాలు కలవటం వలన సహజం కూడా కష్టం అనిపిస్తుంది. కనుక దీనిలో కూడా జంప్ చేయండి. మాయని పరిశీలించే నేత్రాన్ని తీవ్రం చేయండి. వ్యతిరేకంగా అర్ధం చేసుకుంటున్నారు. కాగితాన్ని నిజంగా భావించడం అంటే వ్యతిరేకంగా అర్ధం చేసుకున్నట్టే కదా! లేకపోతే డబల్ విదేశీయులకు చాలా విశేషతలు ఉన్నాయి. కేవలం ఈ బలహీనత ఒకటే ఉంది. అది కాగితపు పులి, నిజం కాదు అని తెలిసినప్పుడు తమలో తాము చాలా నవ్వుకుంటున్నారు. పరిశీలించుకుంటున్నారు మరియు పరివర్తన కూడా అవుతున్నారు. కానీ ఆ సమయంలో భయపడుతున్న కారణంగా క్రిందకి వచ్చేస్తున్నారు లేదా మధ్యలోకి వచ్చేస్తున్నారు. మరలా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజానికి బదులు కష్టంగా అనుభవం అవుతుంది. వాస్తవానికి కొంచెం కూడా శ్రమ లేదు. బాబా వారిగా అయ్యారు. అధికారి ఆత్మగా అయ్యారు, ఖజానాకు, ఇంటికి, రాజ్యానికి యజమానిగా అయ్యారు ఇంకేమి కావాలి? కనుక ఇప్పుడు ఏమి చేస్తారు? భయపడే సంస్కారం ఇక్కడే వదిలి వెళ్ళాలి. అర్థమైందా! బాప్ దాదా కూడా ఆటని చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. పిల్లలు లోతులోకి కూడా వెళ్తున్నారు మరియు అక్కడక్కడ భయపడిపోతున్నారు. లాస్ట్ వచ్చినా ఫాస్ట్ గా వెళ్ళే సంస్కారం కూడా ఉంది. విదేశీయులలో మొదట చిక్కుకునే సంస్కారం ఉండేది, ఇప్పుడు వేగం వెళ్ళే సంస్కారం ఉంది. ఒకరిలో చిక్కుకోవటం లేదు, అనేకమైన వాటిలో చిక్కుకుపోతున్నారు. ఒకే జీవితంలో ఎన్ని పంజరాలు ఉంటాయి? ఒక్క పంజరం నుండి తొలగి రెండవ పంజరంలో చిక్కుకునేవారు, రెండవ దాని నుండి తొలగితే మూడవ దానిలో చిక్కుకుంటారు. చిక్కుకునే సంస్కారం ఎంతగానో ఉండేది ఇప్పుడు అంతగానే వేగంగా వెళ్ళే సంస్కారం ఉంది.

కేవలం ఒక విషయం ఏమిటంటే, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోకండి. పెద్దదానిని చిన్నదిగా చేసుకోండి. ఇలా కూడా జరుగుతుందా? ఇది ఏమయ్యింది? ఇలా కూడా అవుతుందా?.... ఇలాంటి ప్రశ్నలు రాకూడదు. దీనికి బదులు ఏది జరుగుతుందో అది కళ్యాణకారి అని భావించాలి. ప్రశ్నలు సమాప్తి అయిపోవాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. బుద్ధిని దీనిలో ఎక్కువ నడిపించకండి. లేకపోతే శక్తి వ్యర్ధం అయిపోతుంది మరియు తమని తాము శక్తిశాలిగా అనుభవం చేసుకోలేరు. ప్రశ్నార్థకాలు చాలా వస్తాయి. కనుక ఇప్పుడు మధువనం యొక్క వరదాని భూమిలో ప్రశ్నలు సమాప్తి చేసేసి ఫుల్ స్టాప్ పెట్టుకుని వెళ్ళండి. ప్రశ్నార్ధకం అనేది కష్టం. ఫుల్‌స్టాప్ సహజమైనది. అయితే సహజాన్ని వదిలేసి కష్టమైన దానిని ఎందుకు మీదిగా చేసుకుంటున్నారు? దీనిలో శక్తి వ్యర్ధం అవుతుంది. ఫుల్ స్టాప్ పెట్టడంతో జీవితమే బెస్ట్ గా అవుతుంది. ఎక్కడ వేస్ట్, ఎక్కడ బెస్ట్. కనుక ఏమి చేయాలి? ఇప్పుడు వ్యర్థం చేయకూడదు. ప్రతి సంకల్పం బెస్ట్ గా మరియు ప్రతి సెకను బెస్ట్ గా ఉండాలి. మంచిది, లండన్ నివాసులతో ఆత్మికసంభాషణ అయిపోయింది.

లండన్ యొక్క ప్రియమైన పిల్లలందరు బాప్ దాదా యొక్క కోటానుకోట్లరెట్లు ప్రియస్మృతులు స్వీకరించండి. సాకారంగా మధువనానికి రాలేదు కానీ బాప్ దాదా పిల్లలను సదా సన్ముఖంగా చూస్తారు.

సేవాధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకొక్కరి పేరు ఎలా చెప్పను, కనుక సహయోగి ఆత్మలు, అందరు నిశ్చింతాచక్రవర్తులు అయ్యి నషాలో ఉండాలి ఎందుకంటే అందరికీ తోడు స్వయం బాబా. మంచిది - అందరు ప్రియస్మృతులు స్వీకరించండి.