12.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆధారమూర్తి ఆత్మల ద్వారానే విశ్వ ఉద్దరణ జరగవలసి ఉంది..... 12-01-1982

అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా విశ్వం యొక్క ఆధారమూర్తి పిల్లలను చూస్తున్నారు. విశ్వానికి ఆధారమూర్తులైన సర్వ శ్రేష్ట ఆత్మలు మీరు. శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క ఎగిరేకళ మరియు ఎక్కే కథ ద్వారానే విశ్వం యొక్క ఉద్దరణకి నిమిత్తం అవుతున్నారు. సర్వ ఆత్మల జన్మజన్మాంతర ఆశలు మరియు ముక్తి - జీవన్ముక్తి పొందే కోరికలు అన్నీ సహజంగా ప్రాప్తిస్తాయి. శ్రేష్ట ఆత్మలైన మీరు ముక్తి ద్వారాలు అంటే మీ ఇంటి యొక్క ద్వారం తెరవడానికి నిమిత్తం అవుతున్నారు. అప్పుడే సర్వ ఆత్మలకు స్వీట్ హోమ్ యొక్క గమ్యం లభిస్తుంది. వారి యొక్క చాలా సమయం యొక్క దు:ఖం మరియు అశాంతి సమాప్తి అయిపోతున్నాయి ఎందుకంటే శాంతిధామనివాసులుగా అయిపో తున్నారు. 'జీవన్ముక్తి యొక్క వారసత్వం నుండి వంచితం అయిన ఆత్మలకు ముక్తి వారసత్వం లభిస్తుంది. దీని కొరకు ఆధారమూర్తి శ్రేష్ట ఆత్మలైన మిమ్మల్నే బాబా నిమిత్తంగా చేస్తున్నారు. బాప్ దాదా సదా అంటారు - మొదట పిల్లలు తర్వాత మేము. ముందు పిల్లలు వెనుక తండ్రి. ఈ విధంగానే సదా నడిపించుకుంటూ వచ్చారు. ఈ విధంగా, మిమ్మల్ని మీరు విశ్వానికి ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా? బీజంతో పాటుగా, వృక్షం యొక్క వ్రేళ్ళలో ఆధారమూర్తి శ్రేష్ట ఆత్మలైన మీరు ఉన్నారు. అయితే బాప్ దాదా ఇటువంటి శ్రేష్ట ఆత్మలను కలుసుకునేటందుకు వస్తున్నారు. ఎంత శ్రేష్ట ఆత్మలంటే నిరాకారుడిని, ఆకారుడుని కూడా సాకారంలోకి తీసుకువస్తున్నారు. అయితే ఎంత శ్రేష్టంగా అయ్యారు! ఇలా మిమ్మల్ని మీరు భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? ఈ సమయంలో స్మృతి స్వరూపం ద్వారా సమర్థస్వరూపంగా అయిపోతారు. ఈ ఒక్క ధ్యాస, స్వతహాగానే హద్దు యొక్క అలజడులను సమాప్తి చేస్తుంది. ఈ ధ్యాస ముందు ఏవిధమైన అలజడి అయినా ధ్యాసలోకి మారిపోతుంది మరియు ఈ స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన స్వతహాగా అయిపోతుంది. ఈ ధ్యాస గారడీ ఎలా చేస్తుందంటే - అనేక రకాలైన భయాల నుండి తొలగించి బాబా వైపు ధ్యాసను ఇప్పిస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే నలువైపుల ఉన్న మురికి, చెత్తనంతటినీ తనవైపుకి లాక్కునే విజ్ఞాన సాధనాలు ఈ రోజుల్లో ఉన్నాయి కదా! నలువైపులకి వెళ్ళలవసిన అవసరం ఉండదు. కానీ ఆ సాధనం యొక్క శక్తి, ద్వారా మురికి స్వతహాగానే వచ్చేస్తుంది. అదేవిధంగా శాంతిశక్తి ద్వారా, ఈ ధ్యాస యొక్క సమర్థ స్వరూపం ద్వారా అనేక ఆత్మల యొక్క భయాన్ని (టెంక్షన్స్) సమాప్తి చేయగలరు, అప్పుడు ఆ ఆత్మలు, మా యొక్క అనేక రకాలైన భయాలు చాలా సమయం నుండి అలజడి చేస్తున్నాయి, అవి ఎలా సమాప్తి అయిపోయాయి మరియు ఎవరు సమాప్తి చేసారు అనే అనుభూతిని పొంది, దాని ద్వారా శివశక్తి కంబైండ్ స్వరూపంపై ధ్యాస వస్తుంది. అంటే భయం అనేది ధ్యాసలోకి మారిపోతుంది కదా! ఇప్పుడైతే మాటిమాటికి, బాబాని స్మృతి చేయండి, స్మతి చేయండి అని ధ్యాస ఇప్పిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆధారమూర్తులు శక్తిశాలి స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు దూరంగా కూర్చుని కూడా అనేకుల యొక్క భయాన్ని తొలగించే మరియు సహజ ధ్యాసను ఇప్పించే సత్య తీర్థస్థానంగా అవుతారు. ఇప్పుడైతే మీరు వెతుకుతూ వెళ్తున్నారు, వెతకడానికి ఎన్నో సాధనాలను తయారుచేస్తున్నారు. కానీ తర్వాత వారు మిమ్మల్ని వెతుకుతారు. లేక సదా మీరే వెతుకుతూ ఉంటారా?

శ్రేష్ట ఆత్మలైన మీ కార్యంలో విజ్ఞానం కూడా సహయోగి అవుతుంది. కొద్దిగా అలజడి జరగనివ్వండి మరియు మిమ్మల్ని మీరు అచంచలంగా తయారుచేస్కోండి. అప్పుడు చూడండి మీరు ఆత్మిక అయస్కాంతంగా అయ్యి అనేక ఆత్మలను ఏవిధంగా సహజంగా ఆకర్షిస్తారో. ఎందుకంటే రోజు రోజుకి ఆత్మలు నిర్బలంగా అయిపోతారు, తమ పురుషార్థం అనే పాదం ద్వారా నడిచే యోగ్యంగా కూడా ఉండరు. అటువంటి నిర్భల ఆత్మలకు, శక్తిస్వరూప ఆత్మలైన మీ యొక్క శక్తి అనే పాదం ఇచ్చి నడిపిస్తారు. అంటే బాబావైపు ఆకర్షితం చేస్తారు.
అనేక ఆత్మలను దు:ఖం, అశాంతి యొక్క స్మృతి నుండి ఎగిరింపజేసి గమ్యానికి చేర్చాలి. సదా అటువంటి ఎగిరేకళ యొక్క అనుభవిగా అవ్వండి. మీ రెక్కలతో ఎగరవలసి ఉంటుంది. మొదట స్వయం సమర్ధ స్వరూపంగా అవ్వాలి. అప్పుడు సత్యమైన తీర్ధంగా అయ్యి అనేక ఆత్మలను పావనంగా చేసి, ముక్తి అంటే స్వీట్‌ హోమ్ యొక్క ప్రాప్తిని ఇవ్వగలరు. మీరు ఈవిధమైన ఆధారమూర్తులు.

ఈరోజు బాప్ దాదా ఇటువంటి ఆధారమూర్తి పిల్లలను చూస్తున్నారు. ఒకవేళ ఆధారమే చలిస్తూ ఉంటే ఇతరులకు ఎలా ఆధారంగా కాగలరు? అందువలన మీరు అచంచలంగా అయితే, విశ్వంలో అలజడి ప్రారంభం అవుతుంది. మరియు కొద్దిగా అలజడి జరిగినా అనేక ఆత్మలను సహజంగా బాబా వైపు ఆకర్షితం అవుతారు. ఒకవైపు కుంభకర్ణులు మేల్కొంటారు, రెండవవైపు కొంతమంది ఆత్మలు ఎవరైతే సంబంధ, సంప్రదింపుల్లోకి వచ్చారు కానీ, ఇప్పుడు సోమరితనం యొక్క నిద్రలో ఉన్నారో వారు కూడా మేల్కొంటారు. కానీ మేల్కొల్పేవారు ఎవరు? అచంచలమూర్తి ఆత్మలైన మీరే కదా! అర్ధమైందా! సేవ యొక్క రూపం ఈ విధంగా మారనున్నది. దీని కొరకు శివశక్తి స్వరూపంగా అవ్వాలి. మంచిది..

ఈవిధంగా సదా శాంతి మరియు శక్తి స్వరూప ఆత్మలకు, తమ యొక్క సమర్థస్థితి ద్వారా అనేకులకి స్మృతి ఇప్పించేవారికి, భయాన్ని సమాప్తి చేసి ధ్యాస ఇప్పించేవారికి, ఈ విధమైన ఆధారమూర్తి విశ్వపరివర్తకులు అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.