14.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కర్మేంద్రియాజీతులే విశ్వరాజ్యాధికారులు.

రాజఋషి ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ధ్వనిలోకి రావడానికి లేదా ధ్వని వినడానికి ఎన్ని సాధనాలను ఉపయోగిస్తున్నారు? ధ్వనిలోకి వచ్చేటందుకు బాప్ దాదా కూడా శరీరం అనే సాధనాన్ని ఉపయోగించవలసి వస్తుంది. కానీ, ధ్వనికి అతీతంగా వెళ్ళేటందుకు ఈ సాధనాల యొక్క ప్రపంచానికి అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. సాధనాలు ఈ ప్రపంచంలోనే ఉంటాయి. బాప్ దాదాల సూక్ష్మవతనం లేదా మూల వతనంలో ఏ సాధనాల యొక్క అవసరం ఉండదు. సేవార్థం ధ్వనిలోకి రావడానికి ఎన్ని సాధనాలను ఉపయోగిస్తున్నారు? కానీ ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితులయ్యే అభ్యాసం ఉన్నవారు సెకనులో వీటన్నింటి నుండి అతీతం అయిపోతారు. అటువంటి అభ్యాసిగా అయ్యారా? ఇప్పుడిప్పుడే ధ్వనిలోకి రావాలి. ఇప్పుడిప్పుడే ధ్వనికి అతీతంగా అయిపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ మీలో అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు సంకల్పం చేయాలి, విస్తారంలోకి రావాలి, తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు విస్తారాన్ని బిందువులోకి ఇముడ్చుకోవాలి. స్టార్ట్ చేసే (ప్రారంభించే) మరియు స్టాప్ చేసే (నిలిపివేసే) రెండు శక్తులు సమానంగా ఉన్నాయా?

కర్మేంద్రియాల యొక్క ఓ రాజ్యాధికారులూ! మీ యొక్క రాజ్యశక్తిని అనుభవం చేసుకుంటున్నారా? రాజ్యశక్తి శ్రేష్టంగా ఉందా లేక కర్మేంద్రియాలు అనే ప్రజాశక్తి శ్రేష్టంగా ఉందా? ప్రజాపతి అయ్యారా? ఏమి అనుభవం చేసుకుంటున్నారు? స్టాప్ అనగానే స్టాప్ అయిపోతున్నాయా? మీరు స్టాప్ అంటే, అవి స్టార్ట్ అవ్వటం లేదు కదా! ప్రతీ కర్మేంద్రియం అనే శక్తిని కేవలం మీ కనుసైగల ద్వారా ఎలా కావాలంటే అలా నడిపించాలి. ఇలా కర్మేంద్రియాజీత్ గా అయ్యి తిరిగి ప్రకృతిజీత్ గా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసనధారి నుండి విశ్వరాజ్యాధికారిగా అవ్వండి. మిమ్మల్ని మీరు అడగండి - మొదట కర్మేంద్రియాజీత్ గా అయ్యానా? ప్రతీ కర్మేంద్రియం - చిత్తం... చిత్తం!... అంటూ నడుస్తున్నాయా? రాజ్యాధికారులైన మీకు సదా స్వాగతం చెప్తున్నాయా? నమస్కారం చేస్తున్నాయా? రాజుకి ప్రజలందరూ తలవంచి నమస్కారం చేస్తారు కదా!

ఓ రాజ్యాధికారులూ! మీ అందరి రాజ్య వ్యవహారం ఏవిధంగా ఉంది? మంత్రి లేదా ఉపమంత్రి ఒక్కొక్కసారి మోసగించటం లేదు కదా? మీ రాజ్య వ్యవహారాన్ని పరిశీలించుకుంటున్నారా? రాజ్యసభ రోజూ పెట్టుకుంటున్నారా లేక అప్పుడప్పుడు పెట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇక్కడి రాజ్యాధికారం యొక్క సంస్కారం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వర్తమాన సమయంలో ఆత్మనైన నాలో రాజవంశం యొక్క సంస్కారాలు ఉన్నాయా అని పరిశీలించుకుంటున్నారా లేక ప్రజా సంస్కారం ఉందా లేక దేశ రాజ్యాధికారి అయ్యే సంస్కారం ఉందా? అంటే హద్దులోని రాజ్యాధికారం యొక్క సంస్కారం ఉందా? లేక బేహద్ విశ్వరాజ్యాధికారం యొక్క సంస్కారం ఉందా? లేక అన్నింటికంటే చివరి పదవి దాసదాసీల యొక్క సంస్కారం ఉందా? సాకారంగా కూడా చెప్పేవారు - దాసదాసీల యొక్క సంస్కారం ఏవిధంగా ఉంటుందో? వారు ఏదో ఒక సమస్యకి లేదా సంస్కారానికి ఆధీనం అయ్యి ఉదాసీనంగా ఉంటారు. దాసదాసీలుగా అయ్యే వారి గుర్తు - ఉదాసీనంగా ఉండటం. అయితే నేనెవరు? అని మీకు మీరే పరిశీలించుకోండి. ఎక్కడైనా, ఎప్పుడైనా ఉదాసీనత యొక్క అల రావటం లేదు కదా! ఉదాసీనంగా ఉంటే అలాంటి వారిని రాజ్యాధికారి అని ఎలా అంటారు?

ఇదేవిధంగా షాహుకారులైన (ధనవంతులు) ప్రజలు కూడా ఉంటారు. ఇక్కడ కూడా కొందరు రాజులుగా అవ్వరు, కానీ షాహుకారులు అవుతారు. ఎందుకంటే జ్ఞానరత్నాల యొక్క ఖజానా చాలా ఉంటుంది. సేవ చేసి చాలా పుణ్యఖాతాను జమ చేసుకుంటారు. కానీ, సమయానుసారంగా స్వయానికి అధికారిగా అయ్యి సఫలతా మూర్తులుగా అయ్యే కంట్రోలింగ్ పవర్ లేదా రూలింగ్ పవర్ ఉండదు. అంటే జ్ఞానసాగరులే కానీ శక్తిశాలి కాదు. శస్త్రధారులే కానీ సమయానుసారంగా కార్యంలో ఉపయోగించలేరు. స్టాకు ఉంటుంది కానీ సమయానుసారం స్వయం కొరకు ఉపయోగించలేరు మరియు ఇతరుల ద్వారా కూడా చేయించలేరు. విధానం వస్తుంది. కానీ విధి రాదు. ఇటువంటి సంస్కారం కల్గిన ఆత్మలు షాహుకారులు. వీరు రాజ్యాధికారులకి సదా సమీప తోడుగా తప్పక ఉంటారు. కానీ స్వయం అధికారిగా కాలేరు. అర్థమైందా! ఇప్పుడు మీరు ఆలోచించుకోండి - ఇంతవరకు నేను ఏవిధంగా అయ్యాను అని. ఇప్పుడు కూడా పరివర్తన అవ్వవచ్చు. అంతిమ సీట్ నిర్ణయం అయ్యింది అనే ఈల ఇప్పుడు ఇంకా మ్రోగలేదు. పూర్తీ అవకాశం ఉంది, మీరు ఇతరులకి కూడా ఏమి చెప్తారు? ఇప్పుడు లేకున్నను మరెప్పుడూ లేదు. ఎందుకంటే ముందుగా కొద్ది సమయం యొక్క సంస్కారం కావాలి. అంతిమ సమయంలో కాదు. అందువలన డబల్ విదేశీ గ్రూప్ స్వర్ణిమ అవకాశాన్ని పొందే అదృష్టవంతమైన గ్రూపుగా అవ్వండి. అందరూ ఏ గ్రూప్? మంచిది!

కర్మేంద్రియాజీత్, ప్రకృతిజీత్, సూక్ష్మ సంస్కారజీత్ అంటే మాయాజీతులకు, రాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారిగా అయ్యే రాజవంశీ, రాజఋషి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.