20.01.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రీతి యొక్క విధానాన్ని నిలుపుకునే సహజమైన పద్ధతి.

దీపం అయిన శివబాబా తన యొక్క దీపపు పురుగులతో మాట్లాడుతున్నారు. ఈరోజు దీపం అయిన బాబా తన యొక్క దీపపుపురుగుల యొక్క సభలోకి వచ్చారు. ఈ ఆత్మిక సభ ఎంతో శ్రేష్టమైనది మరియు అలౌకికమైనది. దీపం కూడా అవినాశి మరియు దీపపు పురుగులు కూడా అవినాశి. ఈ ప్రేమను దీపం మరియు దీపపు పురుగులు తప్ప మరెవ్వరు తెలుసుకోలేరు. ఎవరైతే తెలుసుకున్నారో వారే ప్రీతిని నిలుపుకున్నారు మరియు వారే అన్నీ పొందారు. ప్రీతి యొక్క రీతిని నిలుపుకోవటం అంటే అన్ని పొందటం. నిలుపుకోవటం రావటం లేదు కనుక పొందటం కూడా రావటం లేదు. ఈ ప్రీతి యొక్క అనుభవీలకే తెలుసు - ఈ ప్రీతి యొక్క రీతిని నిలుపుకోవటం ఎంత సహజమో! ప్రీతి యొక్క రీతి ఏమిటో తెలుసు కదా! కేవలం రెండు విషయాల యొక్క రీతి ఉంది. మరియు అది కూడా ఎంత సరళమైనది అంటే అందరు తెలుసుకుంటున్నారు కూడా, అందరు చేస్తున్నారు కూడా. ఆ రెండు విషయాలు - పాట పాడటం మరియు నాట్యం చేయటం. దీనిలో అందరూ అనుభవీలే కదా! పాడటం, నాట్యం చేయటం అందరికీ ఇష్టమే కదా? కనుక ఇక్కడ చేయవలసింది కూడా ఏమిటి? అమృతవేళ నుండి పాట పాడటం ప్రారంభిస్తున్నారు. దినచర్యలో మేల్కోవటం కూడా పాటతోనే మేల్కొంటున్నారు. కనుక బాబా యొక్క మరియు మీ శ్రేష్ట జీవితం యొక్క మహిమ యొక్క పాట పాడండి. జ్ఞానం యొక్క పాట పాడండి. సర్వప్రాప్తుల యొక్క పాట పాడండి. ఈ పాటలు పాడటం రావటం లేదా? వస్తుంది కదా! కనుక పాట పాడండి మరియు సంతోషంతో నాట్యం చేయండి. సంతోషంతో నాట్యం చేస్తూ చేస్తూ ప్రతి కర్మ చేయండి. ఏవిధంగా అయితే స్థూలమైన నాట్యం ద్వారా శరీరానికంతటికీ వ్యాయామమో అదేవిధంగా సంతోషం యొక్క నాట్యంలో రకరకాల కర్మల యొక్క ఫోజ్ పెడతారు. అప్పుడప్పుడు చేతులతో నాట్యం చేస్తున్నారు. అప్పుడప్పుడు పాదాలతో నాట్యం చేస్తున్నారు. కనుక కర్మయోగిగా అవ్వటం అంటే రకరకాలైన సంతోషాలతో నాట్యం చేస్తూ ఉండండి. బాప్ దాదాకు కూడా ఇలా నాట్యం చేయటం మరియు పాడటం తెలిసిన దీపపు పురుగులంటేనే ఇష్టం. ఇదే ప్రీతి యొక్క రీతి. ఇదైతే కాదు కదా! ఏమనిపిస్తుంది, కష్టం అనిపిస్తుందా! సహజం అనిపిస్తుందా? ఇప్పుడు మధువనములో అయితే చాలా సహజంగా చేసుకుంటున్నారు. తిరిగి అక్కడికి వెళ్ళి నా కానీ సహజం అంటారు కదా! లేక అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతారా? (ఇక్కడ ఈజీగా ఉన్నాం, అక్కడ బిజీ అయిపోతాం) కానీ ఈ పాడటం మరియు నాట్యం చేయటంలో బిజీగా ఉంటారు కదా!

సదా చెవులతో ఇదే మధురమైన పాట వింటూ ఉండాలి. ఎందుకంటే నాట్యం చేయడానికి పాట కూడా కావాలి కదా! అయితే ఏ పాట వింటూ ఉంటారు? (మురళి) మురళిలో కూడా పాట ఉంటుంది. ఈ రోజు మురళీలో బాప్ దాదా మధురమైన పిల్లలూ! ప్రియమైన పిల్లలూ! గారాబమైన పిల్లలూ! అంటూ ప్రియస్మృతులు ఇస్తారు. బాబా స్నేహం యొక్క పాట సదా చెవులలో వినబడుతూ ఉండాలి. అప్పుడు ఇతర విషయాలు విన్నా కానీ అర్థం కావు అంటే బుద్ధిలోకి కూడా రావు. ఎందుకంటే ఒకే పాట వినటంలో బిజీ అయిపోతే, ఇక రెండవది ఏవిధంగా వింటారు. అదేవిధంగా పాట పాడటంలో సదా బిజీ అయిపోతే ఇతర వ్యర్ధ విషయాలు మాట్లాడే ఖాళీయే ఉండదు. సదా బాబాతో పాటు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటే మూడవవారు ఎవరూ భంగ పరచలేరు. ఇద్దరి మధ్య ఎవరూ రాలేరు. మాయాజీత్ గా అయితే అయిపోయారు కదా! వినకూడదు, మాట్లాడకూడదు, మాయని రానివ్వకూడదు. అయితే ప్రీతి యొక్క రీతి ఏమిటి? పాడటం మరియు నాట్యం చేయటం. ఎప్పుడైతే ఈ రెండింటితో అలసిపోతారో ఇక మూడవ విషయం నిద్రపోవటం. ఇక్కడ నిద్రపోవటం అంటే ఏమిటి? నిద్రపోవటం అంటే కర్మకి అతీతంగా అయిపోవటం. కనుక మీరు కర్మేంద్రియాలతో అతీతం అయిపోండి. అశరీరీగా అవ్వటం అంటే నిద్రపోవటం. స్మృతియే బాప్ దాదా యొక్క ఒడి.

అలసిపోయినప్పుడు అశరీరిగా అయ్యి అశరీరి అయిన బాబా యొక్క స్మృతిలో లీనమైపోండి, అంటే నిద్రపోండి. బాగా పాడినప్పుడు, నాట్యం చేసినప్పుడు శరీరం అలసిపోయి తొందరగా నిద్ర వచ్చేస్తుంది కదా! అదేవిధంగా ఇక్కడ ఆత్మిక పాట పాడుతూ సంతోషంలో నాట్యం చేస్తూ నిద్రపోతారు, అంటే లీనమైపోతారు. కనుక రోజంతా ఏమి చేయాలో అర్థమైందా? డబల్ విదేశీయులకి అయితే ఈ విషయంలో చాలా అభిరుచి ఉంటుంది. ఏ విషయంలో అభిరుచి ఉందో అదే చేయండి అంతే! నిద్ర కూడా అభిరుచితో నిద్రపోతున్నారు. అయితే మూడు విషయాలు చేయటం వస్తుంది. కనుక ప్రీతి యొక్క రీతి నిలుపుకునే సహజమైన విధి అర్థమైందా? మంచిది. ఇప్పుడు డబల్ విదేశీయులు ఒక మాటను వదిలి వెళ్ళాలి. అది ఏమిటి? (అందరూ ఎవరి విషయాలు వారు చెప్పారు. కొంతమంది ఉదాసీనత వదలాలి. కొంతమంది అలసట వదలాలి అని చెప్పారు) మంచిది! ఇప్పుడు చెప్పే విషయాలను బట్టి ఆ విషయాలు ఇప్పటి వరకు ఉన్నాయి అని అర్థం అవుతుంది. మంచిది! చెప్పడం అంటే వదలటం. ఆ ఒక్క మాట - డిప్రెషన్ (అందోళన) అనే మాట ఎప్పుడూ అనకూడదు. రియలైజేషన్ (అనుభూతి) ఉండాలి, కానీ డిప్రెషన్ ఉండకూడదు. ఎవరైతే బాబాకి డైవోర్స్ (విడాకులు) ఇచ్చేస్తారో వారు డిప్రెషన్లోకి వస్తారు. మీరయితే సదా బాబాకి సహయోగులు కదా! కనుక ఆందోళన అనే మాట మీకు శోభించదు. స్వ అనుభూతి అయ్యిందా! అనుభూతి అయిన తర్వాత మరలా ఆందోళన ఎలా వస్తుంది? ద్వాపరయుగం పూర్తి అయ్యి కలియుగం వచ్చిన తర్వాత రావచ్చు. అప్పటి వరకు దానికి వీడ్కోలు ఇచ్చేయండి. మంచిది!

ఈ విధంగా పరివర్తన భూమిలో పరివర్తన అయ్యే వారికి, సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే వారికి, దీపానికి ఇష్టమైన దీపపు పురుగులకు, సదా ఆత్మీయ పాట పాడేవారికి, సంతోషంతో నాట్యం చేసేవారికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా ఒడిలో నిద్రపోయే వారికి, ఇటువంటి ప్రియమైన గారాభమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.