12.03.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


చైతన్య పుష్పాలలో రంగు, రూపము, సుగంధములకు ఆధారం.

ఈరోజు తోటమాలి అయిన బాబా తమ చైతన్య పూతోటలోని వెరైటీ పుష్పాలను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పూతోట బాప్ దాదాకు కూడా కల్పములో ఒకేసారి లభిస్తుంది, ఇటువంటి ఆత్మిక పూతోట, ఆత్మిక సుగంధమయమైన పుష్పాల శోభ ఇంకే సమయములోనూ లభించజాలదు. ఎంత ప్రసిద్ధమైన పూతోట ఉన్నాకాని ఈ పూతోట ముందు అవి ఏలా అనుభవమవుతాయి! ఇది వజ్రతుల్యమైతే అది గవ్వతుల్యమైనది. ఇటువంటి చైతన్య ఈశ్వరీయ పూతోటలో నేను ఆత్మిక పుష్పమును అన్న నషా ఉందా? ఏ విధంగా బాప్ దాదా ప్రతి ఒక్క పుష్పములో రంగు, రూపము మరియు సుగంధము మూడింటిని చూస్తారో అలా మీ రంగు, రూపము మరియు సుగంధములను గూర్చి మీకు తెలుసా?

రంగుకు ఆధారము జ్ఞానము యొక్క సబ్జెక్ట్. ఎంతెంతగా జ్ఞాన స్వరూపులుగా ఉంటారో అంతగా రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. స్థూల పుష్పాల రంగును చూస్తారు కదా! అందులో భిన్న భిన్న రంగులు ఉన్నా కాని కొన్ని రంగులు విశేషంగా దూరం నుండే ఆకర్షిస్తాయి, చూడడంతోనే ఎంత సుందరమైన పుష్పాలు అని నోటి నుండి వాటి మహిమ వెలువడుతుంది, వాటిని అలా చూస్తూనే ఉండిపోవాలని మనసుకు అనిపిస్తుంది. అలాగే జ్ఞానమనే రంగులో రంగరింపబడిన పుష్పాలు ఎంత సుందరముగా అనిపిస్తాయి! అలాగే రూపం మరియు సుగంధమునకు ఆధారము - స్మృతి మరియు దివ్య గుణమూర్త స్థితి. కేవలం రంగు ఉంటూ రూపం లేకుండా ఉన్నట్లయితే ఆకర్షణ ఉండదు మరియు రంగు, రూపము ఉంటూ సుగంధం లేకపోతే కూడా ఆకర్షించదు. ఇది అసలైనది, ఇది నకలు అని అంటారు కదా! కేవలం రంగు మరియు రూపం గల పుష్పాలు అలంకరణకు ఎక్కువగా ఉపయోగపడతాయి కాని సుగంధమయమైన పుష్పాలను మనుష్యులు తమ సమీపముగా ఉంచుకుంటారు. సుగంధమయమైన పుష్పాలు సదా స్వతహాగానే సేవా స్వరూపులు. కావున నేను ఎటువంటి పుష్పమును అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి, ఎక్కడ ఉన్నాకాని స్వతహాగా సేవ జరుగుతూ ఉంటుంది, అనగా ఆత్మిక వాయుమండలమును తయారు చేసేందుకు నిమిత్తముగా అవుతారు. సమీపముగా రావడం ద్వారా అనగా సంపర్కములోకి రావడంతోనే సుగంధము చేరుకుంటుందా లేక దూరం నుండే సుగంధమును వ్యాపింపచేస్తారా? కేవలం జ్ఞానాన్ని విని యోగమును జోడించే అభ్యాసకులుగా అయిపోయి, జ్ఞాన స్వరూపము లేక యోగి జీవితము గల ప్రత్యక్ష దివ్య గుణమూర్తులుగా అవ్వకపోతే కేవలం అలంకరణ మాత్రముగా అనగా ప్రజలుగా అయిపోతారు... రాజుకు ప్రజలు అలంకరణే, కావున అలా పూదోటలోని పుష్పముగా అయితే అయిపోయారు కాని ఏ పుష్పముగా అయ్యారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పూతోట కూడా ఒక్కటే, తోటమాలి కూడా ఒక్కరే, కాని పుష్పాలలో వెరైటీ ఉంది. డబల్ విదేశీయులు స్వయమును ఎలా భావించుకుంటున్నారు? మీరు రాజ్య అధికారులా లేదా రాజ్యము చేసేవారిని చూసేవారా? ఈరోజు బాప్ దాదాను కలుసుకునేందుకు పూతోటలోకి వచ్చారు, అందరి మనసులలో ఆత్మిక సంభాషణ చేసే సంకల్పము ఉంటుంది, కావున ఈరోజు ఆత్మిక సంభాషణ జరిపేందుకు వచ్చారు, విశేషంగా రెండు గ్రూప్ లు ఉన్నాయి కదా!

బాప్ దాదాకైతే దేశ విదేశాలు రెండు వైపుల ఉన్న పిల్లలు అతి ప్రియమైనవారే, కర్నాటక వారు మరియు డబల్ విదేశీయులు కూడా సదా సంతోషములో ఉయలలూగుతూ ఉంటారు. మధువనానికి వచ్చి మయాజీత్ లుగా అయ్యే అనుభవజ్ఞులుగా అయిపోయారా? లేక మధువనంలోకి కూడా మాయ వస్తుందా? మాయాజీత్ స్థితిని అనుభవం చేసుకునేందుకే మధువనానికి వస్తారు. కావున ఇక్కడ మాయ యుద్ధము చేయడం కాదు మాయ ఓడిపోయి వెళ్తుంది, ఎందుకంటే మధువనములో విశేషముగా తమ సంపాదనను జమ చేసుకునేందుకు వస్తారు. డబల్ విదేశీయులు డబల్ లాక్ వేసుకోవాలి.

మధువనములోకి వచ్చి విశేషముగా తమలో ఏ విశేషతలను ధారణ చేసారు? (బాబా విదేశీయులను మరియు కర్నాటక వారిని అడుగుతున్నారు) ఏ విధంగా సహజ యోగులుగా అయ్యే విశేషతను చూసారో అలా ఇంకేమి చూసారు? ప్రేమ కూడా లభించింది, శాంతి కూడా లభించింది, ప్రకాశము కూడా లభించింది, అన్నీ లభించాయి! ఎంతగా స్వయమునకు ప్రాప్తి లభిస్తుందో అంతగా ప్రాప్తి కలవారు సేవ చెయ్యకుండా ఉండలేరు, కావున ప్రాప్తి స్వరూపుల నుండి సేవ స్వరూపులుగా స్వతహాగానే ఉంటారు.

కర్నాటక వారు కూడా మంచి వృద్ధిని పొందారు మరియు విదేశంలో కూడా మంచి వృద్ధి జరిగింది, విదేశం వారు సేవా కేంద్రాలను మరియు సేవాధారులను కూడా మంచిగా తయారు చేసారు. బాప్ దాదా కూడా పిల్లల ధైర్యం, ఉల్లాస ఉత్సాహాలను చూసి హర్షితులౌతున్నారు. దేశంలోనైనా, విదేశములోనైనా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలను పిల్లలలో చూసి బాబా సంతోషిస్తున్నారు. అచ్ఛా! ఎవరైతే సేవా కేంద్రాలలో ఉంటారో, సేవలో ఉపస్థితులై ఉన్నారో, దేశంలోనైనా విదేశములోనైనా అందరూ అమృతవేళ శక్తిశాలిగా ఉంటున్నారా? ఈ గ్రూప్ చాలా బాగుంది, కాని మంచి, మంచి పిల్లలను కూడా మాయ మంచిగా చూస్తూ ఉంటుంది, వారు మాయకు కూడా మంచిగా అనిపిస్తారు. కావున మాయాజీతులుగా అవ్వాలి, ఎందుకంటే మీరు నిమిత్త ఆత్మలు కదా! కావున విశేష అటెన్షన్ ఉంచాలి. నిమిత్తముగా అయి ఉన్న ఆత్మలు ఎంత శక్తిశాలిగా ఉంటే అంతగా వాయుమండలమును శక్తిశాలిగా తయారుచేయగలుగుతారు. లేకపోతే వాయుమండలము బలహీనమైపోతుంది, సమస్యలు ఎన్నో వస్తాయి, శక్తిశాలీ వాయుమండలము ఉన్న కారణముగా స్వయం కూడా విఘ్నవినాశకులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా విఘ్నవినాశకులుగా చేసేందుకు నిమిత్తులుగా అవుతారు... ఏ విధంగా సూర్యుడు స్వయం ప్రకాశవంతమైన కారణముగా అంధకారమును అంతం చేసి ఇతరులకు ప్రకాశమును ఇస్తాడో మరియు చెత్తను భస్మము చేస్తాడో అలా నిమిత్తముగా అయి ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు శక్తి స్వరూపమైన విఘ్నవినాశక స్థితిలో స్థితులై ఉండే అటెన్షన్ ను ఉంచండి, కేవలం స్వయము పట్ల కాదు స్టాక్ కూడా జమ అవ్వాలి, ఇతరులను కూడా విఘ్నవినాశకులుగా చేయగలగాలి. కావున ఈ మెజారిటీ గ్రూపు మాస్టర్ జ్ఞానసూర్యులు... ఇప్పుడు సదా నేను మాస్టర్ జ్ఞానసూర్యుడను అన్న ఇదే స్మృతి స్వరూపముగా అయి ఉండాలి, స్వయం కూడా ప్రకాశ స్వరూపముగా ఉండాలి మరియు ఇతరుల అంధకారమును కూడా అంతం చెయ్యాలి. అచ్ఛా!
మధువనము వారు కూడా బాప్ దాదాకు గుర్తున్నారు, మధువన నివాసులు కూడా బ్రాహ్మణ పరివారపు దృష్టిలో ఉన్నారు. మధువన మహిమను చేయడంతోనే మధువన నివాసులు ముందుకు వస్తారు. మధువన మహిమను గూర్చిన పూర్తి వ్యాసమే తయారై ఉంది. మధువన మహిమ ఏదైతే ఉందో దానిని మధువన నివాసులు ప్రతి ఒక్కరూ తమ మహిమగా అనుభవం చేసుకుంటున్నారా! అచ్చా!

సదా సర్వ విశేషతా సంపన్నులైన విశేష ఆత్మలకు, సదా స్వయము యొక్క స్వరూపము ద్వారా సేవకు నిమిత్తముగా అయిన సేవాధారి ఆత్మలకు, సదా రంగు, రూపము మరియు సుగంధముగల పుష్పాలకు తోటమాలియైన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

డబల్ విదేశీయులైన పిల్లలకు ఒక ప్రశ్న ఉంటుంది - మాకు డబల్ సేవ (ఈశ్వరీయ సేవ మరియు ఉద్యోగము) రెండింటిని చేయ్యమని ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబుగా బాప్ దాదా ఇలా అన్నారు -

సమయం తక్కువగా ఉంది, కానీ అందరి కన్నా ఎక్కువగా ప్రాప్తిని పొందాలనుకుంటారు. ఈ కారణముగా తనువు కూడా వినియోగపడాలి, మనస్సు, ధనము కూడా వినియోగపడాలి. కావున మూడు సేవలను చెయ్యవలసి ఉంటుంది. కొద్ది సమయములో మీకు మూడు రకాల లాభము జమ అవుతుంది. ఎందుకంటే ధనమునకు కూడా మార్కులు ఉన్నాయి, ఆ మార్కులు జమ అయిన కారణముగా నెంబరును ముందు తీసుకుంటారు. కావున మీ లాభము కొరకే మీ ధనమును వినియోగించండి అని చెప్పబడుతుంది. కావున ధనము యొక్క సబ్జెక్టులో కూడా ఒకటికి పదమరెట్లుగా లభిస్తుంది. అన్నివైపుల నుండి ఒకే సమయములో లాభము కలుగగలిగినప్పుడు ఎందుకు చెయ్యకూడదు! నిమిత్తమై ఉన్న ఆత్మలు, వీరికి అసలు సమయమే లేదని, వీరికి ఖాళీయే లేదని, తినే సమయము కూడా దొరకడం లేదు, వీరు అంతగా బిజీ అయిపోయారు అని గమనించినప్పుడు వారంతంట వారే ఫ్రీ చేసేస్తారు, కాని ఎప్పటివరకైతే అంతగా బిజీ అయిపోరో అప్పటి వరకు ఇది అవసరం, ఇది వ్యర్ధంగా పోదు దీని మార్కులు కూడా జమ అవుతున్నాయి, బిజీ అయిపోయినట్లయితే డ్రామా మిమ్మల్ని పని చేయనివ్వదు. ఏదో ఒక కారణం ఎలా వస్తుందంటే... దానితో మీరు చెయ్యాలి అనుకున్నా చెయ్యలేరు... కావున ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అందులోనే కళ్యాణము ఉంది. మేము సమర్పణ అవ్వలేదు అని భావించకండి. మీరు సమర్పణులే, డైరెక్షన్ అనుసారంగానే చేస్తున్నారు, మీ మనసుతో చేస్తే సరండర్ అయినట్లు కాదు, ఇందులో నేను ఇదే చేస్తాను అంటూ మీ మనసును నడిపిస్తే అది ఇంకా మన్మతమవుతుంది. కావున స్వయమును చాలా తేలికగా ఉంచుకోండి, నిమిత్తముగా అయి ఉన్న ఆత్మలు అంటున్నారంటే అందులో మన కళ్యాణము ఉంది అని భావిచండి, ఇందులో మీరు నిశ్చింతగా ఉండండి. నా పాత్ర లేదేమో, నాకు ఎందుకు చెప్పడం లేదు... ఇలా ఎక్కువగా ఆలోచిస్తే అది వ్యర్ధమే... అర్థమైందా?

టీచర్లతో :- టీచర్ల కొరకు సేవా స్థానము ఏమి? టీచర్లు సదా విశ్వ రంగస్థలముపై ఉన్నారు విశ్వ స్టేజీ మీ సేవా స్థానంగా ఉంది. కావున స్టేజిపై ఉన్నాము అని భావించడం ద్వారా ప్రతి కర్మను అటెన్షన్ తో చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాన్ని చేసేటప్పుడు స్టేజిపై కూర్చొనే సమయంలో ఎంత అటెన్షన్ ఉంటుంది! నిర్లక్ష్యులుగా ఉండరు, కావున టీచర్ గా అవ్వడము అనగా విశ్వం యొక్క స్టేజిపై ఉండడము. సెంటర్లలో ఇద్దరు అక్కయ్యలు ఉంటారు. కాని మీరు ఇద్దరి ముందు కాదు, విశ్వం ముందు ఉన్నారు... అచ్చా ఓంశాంతి.