27.03.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బీజరూపస్థితి మరియు అలౌకిక అనుభూతులు

బీజరూపీ శివబాబా బిందుస్వరూప ఆత్మలతో మాట్లాడుతున్నారు,

ధ్వనికి అతీతంగా ఉండే బాబా, ధ్వని యొక్క ప్రపంచంలో ధ్వని ద్వారా సర్వులను ధ్వనికి అతీతంగా తీసుకెళ్తున్నారు. బాప్ దాదా వచ్చేదే వెంట తీసుకెళ్లడానికి. అయితే అందరు వెంట వెళ్ళడానికి ఎవరెడీగా ఉన్నారా లేక తయారవ్వడానికి ఇప్పుడు ఇంకా సమయం కావాలా? వెంట వెళ్ళడానికి బిందువుగా అవ్వాలి. మరియు బిందువుగా అవ్వడానికి అన్ని రకాలుగా ఉన్న విస్తారాన్ని అంటే అనేక శాఖల యొక్క వృక్షాన్ని బీజంలో ఇమడ్చాలి. బీజరూపస్థితి అంటే బిందువులో అన్నింటిని ఇమడ్చాలి. లౌకికంలో కూడా పెద్ద లెక్క చేస్తున్నపుడు మొత్తం సమాప్తి చేసి చివర్లో ఏమంటారు? శివా! అని అంటూ సున్న పెడతారు, అదేవిధంగా సృష్టిచక్రం లేదా కల్పవృక్షంలో ఆది నుండి అంతిమం వరకు ఎన్ని రకాలైన కర్మల ఖాతాల యొక్క లెక్కలలోకి వచ్చారు? మీ యొక్క లెక్కల ఖాతాల యొక్క శాఖలు లేదా విస్తారం యొక్క వృక్షము గురించి తెలుసు కదా? దేహం యొక్క శాఖ, దేహసంబంధీకుల యొక్క శాఖలు, దేహం యొక్క భిన్న భిన్న పదార్థాల యొక్క బంధనలో బందింపబడిన ఆత్మగా అయ్యే శాఖ, భక్తి మార్గం మరియు గురువుల బంధనాల యొక్క విస్తారం యొక్క శాఖలు, రకరకాలైన వికర్మల యొక్క బంధనాల యొక్క శాఖలు, కర్మభోగం యొక్క శాఖలు .... ఇలా ఎంత విస్తారం అయ్యింది. ఇప్పుడు ఈ విస్తారాలన్నింటికీ బిందురూపంగా అయ్యి బిందువు పెట్టగలుగుతున్నారా? విస్తారం అంతటినీ బీజంలో ఇమిడ్చేశారా లేక ఇప్పుడు కూడా విస్తారం ఉందా? శిధిలావస్థలో ఉన్న వృక్షం యొక్క ఏ శాఖ మిగిలిపోలేదు కదా? సంగమయుగమే పాత వృక్షం సమాప్తి అయ్యే యుగం. కనుక ఓ సంగమయుగీ బ్రాహ్మణులూ! పాత వృక్షాన్ని సమాప్తి చేసారా? ఆకుఆకుకి నీరు వేయలేం కానీ బీజానికి వేస్తే ఆకు - ఆకుకి లభిస్తుంది. అదేవిధంగా ఇన్ని రకాలైన 84 జన్మల యొక్క రకరకాల ఖాతాల యొక్క వృక్షాన్ని సమాప్తి చేయాలి. ఒక్కొక్క శాఖను సమాప్తి చేయటం కాదు. ఈ రోజు దేహస్మృతి యొక్క శాఖను సమాప్తి చేయటం, రేపు సంబంధాల యొక్క శాఖలను సమాప్తి చేయటం ఇలా ఒక్కొక్క శాఖలను సమాప్తి చేయటం ద్వారా సమాప్తి అవ్వవు. బీజమైన బాబాతో సంలగ్నత జోడించడం ద్వారా, సంలగ్నత అనే అగ్ని ద్వారా సహజంగా అన్నీ సమాప్తి అయిపోతాయి. తెంచడం కూడా కాదు. కానీ భస్మం చేయాలి. ఈరోజు కట్ చేస్తారు మరలా కొంచెం సమయం తర్వాత బయటికి వస్తాయి. ఎందుకంటే వాయుమండలం ద్వారా వృక్షానికి సహజంగానే నీరు లభిస్తూ ఉంటుంది. వృక్షం పెద్దదిగా అయినప్పుడు విశేషంగా నీరు ఇవ్వవలసిన అవసరం ఉండదు. సహజ వాయుమండలం ద్వారా వృక్షం పెరుగుతూనే ఉంటుంది మరియు నిలబడే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు విస్తారం పొందిన శిధిలావస్థ యొక్క వృక్షానికి కూడా నీరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది స్వతహాగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఈ రోజు పురుషార్ధం ద్వారా దేహసంబంధాలు స్మృతి రూపీ వృక్షాన్ని సమాప్తి చేసుకున్నాము అని భావిస్తారు. కానీ భస్మం చేయకపోతే మరలా కొమ్మలు వచ్చేస్తాయి. మరలా స్వయానికి స్వయం అనుకుంటారు మరియు బాబా ముందు చెప్తారు. మేము ఇది సమాప్తి చేసేసుకున్నాము మరలా ఎలా వచ్చింది అని. మొదట్లో ఉండేది కానీ మరలా ఎలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? దానిని త్రెంచారు కానీ భస్మం చేయలేదు. అగ్నిలో పడిన బీజం మరలా ఎప్పుడు ఫలం ఇవ్వదు. కనుక ఈ కర్మలఖాతాల విస్తారం అనే వృక్షాన్ని సంలగ్నత అనే అగ్నిలో సమాప్తి చేయండి. అప్పుడు ఏమి మిగిలి ఉంటుంది? దేహం, దేహసంబంధాలు మరియు పదార్ధాల యొక్క విస్తారం సమాప్తి అయిపోయింది. ఇక మిగిలేది బిందువు అంటే బీజమైన ఆత్మ ఉంటుంది. ఇలా బిందువు మరియు బీజరూపంగా అయిపోండి. అప్పుడు ధ్వనికి అతీతంగా, బీజరూపి అయిన బాబాతో వెళ్ళగలరు. అందువలనే, ధ్వనికి అతీతంగా వెళ్ళడానికి తయారుగా ఉన్నారా? అని అడిగాను. విస్తారాన్ని సమాప్తి చేసేసారా? బీజరూపి బాబా బీజరూపి ఆత్మలనే తీసుకువెళ్తారు. బీజస్వరూపంగా అయ్యారా? ఎవరైతే ఎవరెడీగా అవుతారో వారికి ఇప్పటినుండే అలౌకిక అనుభూతులు అవుతూ ఉంటాయి. ఏ అనుభూతులు అవుతాయి? నడుస్తూ, తిరుగుతూ, కూర్చుంటూ, మాట్లాడుతూ అయ్యే మొదటి అనుభూతి - ఈ శరీరం కర్మలఖాతా యొక్క వృక్షానికి మూల కాండం దీని ద్వారానే కొమ్మలు వస్తాయి. ఈ దేహం మరియు ఆత్మ రూపీ బీజం రెండు పూర్తిగా వేరు. ఇలా ఆత్మ అతీతం అనే స్థితిని నడుస్తూ, తిరుగుతూ అనుభవం చేసుకుంటారు. కేవలం శరీరం మరియు ఆత్మ వేర్వేరు అని జ్ఞానం ఆధారంగా తెలుసుకోవటం కాదు. కానీ శరీరం నుండి వేరు అయిన నేను ఆత్మని అని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. ఏవిధంగా అయితే ఈ స్థూల శరీరం యొక్క వస్త్రం మరియు వస్త్రాన్ని ధరించే శరీరం వేరుగా అనుభవం అవుతుందో అదేవిధంగా ఆత్మనైన నాకు ఈ శరీరం ఒక వస్త్రం, ఆ వస్త్రాన్ని ధరించిన ఆత్మను నేను అని ఇలా స్పష్టంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దేహరూపీ వస్త్రాన్ని ధారణ చేయాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాభిమానానికి అతీతమైన స్థితిలో స్థితులైపోవాలి. ఈ విధమైన అతీత స్థితి అనుభవం అవుతుందా? నేను వస్త్రాన్ని ధారణ చేస్తున్నానా లేక వస్త్రం నన్ను ధారణ చేస్తుందా? చైతన్యం ఎవరు? యజమాని ఎవరు? అయితే మొదటి గుర్తు - అతీత స్థితి యొక్క అనుభూతి. వేరు అవ్వటం కాదు, పూర్తిగా నేను వేరు అని అనుభవం అవ్వాలి. రెండవ గుర్తు లేదా అనుభూతి - ఏవిధంగా అయితే భక్తులకు లేదా ఆత్మ జ్ఞానులకు లేదా కొంతమంది పరమాత్మ జ్ఞానులకు దివ్యదృష్టి ద్వారా జ్యోతి బిందువు అయిన ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ సాక్షాత్కారం అనేది అల్పకాలిక విషయం. సాక్షాత్కారం అనేది తమ అభ్యాసం యొక్క ఫలం కాదు. ఇది డ్రామాలో పాత్ర లేదా వరదానం. కానీ ఎవరెడీ అంటే వెంట వెళ్ళడానికి సమానంగా అయిన ఆత్మ, సాక్షాత్కారం ద్వారా ఆత్మని చూడదు కానీ బుద్ధియోగం ద్వారా స్వయాన్ని సాక్షాత్ జ్యోతిబిందు ఆత్మగా అనుభవం చేసుకుంటుంది. సాక్షాత్కారం అనేది అల్పకాలికం మరియు సాక్షాత్ స్వరూపంగా అవ్వటం అనేది సదాకాలికమైనది. సాక్షాత్ స్వరూపాన్ని అనుభవం చేసుకున్న ఆత్మ, నాకు ఆత్మ యొక్క సాక్షాత్కారం కాలేదు అనే మాట అనదు. చూడలేదు అని అనరు. కానీ అనుభవం ద్వారా సాక్షాత్ రూపం యొక్క స్థితిలో స్థితి అవుతుంది. ఎక్కడ సాక్షాత్తు స్వరూపం ఉంటుందో అక్కడ సాక్షాత్కారం యొక్క అవసరం ఉండదు. ఈ విధంగా సాక్షాత్తుగా ఆత్మ స్వరూపం యొక్క అనుభూతి చేసుకున్నవారు అధికారంతో, నిశ్చయంతో చెప్తారు-నేను ఆత్మను చూడటం ఏమిటి, ఆత్మను అనుభవం చేసుకున్నాను అని. ఎందుకంటే చూసిన తర్వాత కూడా అనుభవం చేసుకోకపోతే, చూసి మాత్రం లాభమేమిటి? ఈ విధంగా సాక్షాత్తు ఆత్మ యొక్క అనుభవీలు నడుస్తూ, తిరుగుతూ తమ జ్యోతిస్వరూపం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు.

మూడవ అనుభూతి - ఈవిధమైన సమాన ఆత్మ అంటే ఎవరెడీ ఆత్మ - సాకార ప్రపంచం మరియు సాకార శరీరంలో ఉంటూ కూడా బుద్ధియోగం ద్వారా - నేను ఆత్మను సూక్ష్మవతనంలో లేదా మూలవతనంలో అక్కడే బాబాతో పాటూ ఉన్నాను అని అనుభవం చేసుకుంటుంది. సెకనులో సూక్ష్మవతనవాసిగా, సెకనులో మూలవతనవాసిగా, సెకనులో సాకారవతనవాసిగా అయ్యి, కర్మయోగిగా అయ్యి కర్మ యొక్క పాత్ర అభినయిస్తున్నాను అని అనుభవం చేసుకుంటుంది కానీ అనేక సార్లు బాబా వెంట సూక్ష్మవతనంలో, మూలవతనంలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. తీరిక లభించగానే సూక్ష్మవతనం లేదా మూలవతనం వెళ్ళిపోతారు. ఈ విధంగా సూక్ష్మవతనవాసిగా, మూలవతనవాసిగా అనుభవం చేసుకుంటారు. పని అయిపోయి తీరిక దొరికితే ఇంటికి ఎలా వెళ్ళిపోతారో అదేవిధంగా సూక్ష్మవతనవాసిగా, మూలవతనవాసిగా అనుభవం చేసుకుంటారు. ఆఫీసులో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారా లేక ఆఫీసులోనే కూర్చుండిపోతారా? అదేవిధంగా ఎవరెడీ ఆత్మ మాటిమాటికి తనని తాను తన ఇంటి యొక్క నివాసిగా అనుభవం చేసుకుంటుంది. ఇల్లు ఎదురుగానే ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు...

మరో అనుభూతి - ఈ విధమైన సమాన ఆత్మ, బంధనముక్తంగా అయిన కారణంగా ఎగిరే పక్షిగా అయ్యి ఉన్నతంగా ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది మరియు ఉన్నతస్థితి రూపి స్థానంలో స్థితులైన కారణంగా ఇవన్నీ క్రింద ఉన్నట్లు అనుభవం చేసుకుంటుంది. నేను అందరి కంటే పైన ఉన్నాను అని అనుభవం చేసుకుంటుంది. ఏవిధంగా అయితే విజ్ఞానశక్తి ద్వారా ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ క్రిందే ఉండి పోతుంది. కనుక వారు స్వయం అందరికంటే ఉన్నతంగా అనుభవం చేసుకుంటారు మరియు తేలికగా అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా శాంతిశక్తి ద్వారా స్వయాన్ని వికారాల యొక్క ఆకర్షణ నుండి, ప్రకృతి యొక్క ఆకర్షణకి అతీతంగా ఎగిరేస్థితిని అంటే సదా డబల్ లైట్ రూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఎగిరే అనుభూతి సర్వ ఆకర్షణలకు అతీతమైనది, ఉన్నతమైనది. సర్వ బంధనాల నుండి ముక్తి చేసేది. ఈ స్థితి యొక్క అనుభూతి అవ్వటం అంటే ఉన్నతమైన ఎగిరేకళ అనుభవం అవ్వటం. నడుస్తూ, తిరుగుతూ వెళ్ళిపోతున్నాము, ఎగిరిపోతున్నాము, బాబా కూడా బిందువు, నేను కూడా బిందువు ఇద్దరం కలిసి వెనువెంట వెళ్తున్నాము అనే అనుభూతి చేసుకుంటారు. సమాన స్థితి కల్గిన ఆత్మకి ఈ అనుభూతి ఎంత స్పష్టంగా అవుతుంది అంటే అది చూస్తున్నట్లే అనుభవం అవుతుంది. అనుభూతి అనే నేత్రం ద్వారా చూడటం అనేది దివ్యదృష్టి ద్వారా చూడటం కంటే స్పష్టంగా అనుభవం అవుతుంది. అర్ధమైందా! విస్తారం చాలా ఉంది కానీ సారంలో కొన్ని గుర్తులు చెప్పాను. ఇలా ఎవరెడీగా అంటే అనుభవీ స్వరూపంగా అయ్యారా? వెంట వెళ్ళడానికి తయారుగా ఉన్నారా లేక ఇప్పుడు ఇంకా ఇది మిగిలిపోయింది అంటారా? ఇటువంటి అనుభూతి అవుతుందా లేక సేవలో బిజీ అయిపోయి ఇంటినే మర్చిపోయారా! ఆత్మలకి ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికే సేవ కూడా చేస్తున్నారు కదా!
సేవలో కూడా బాబా వెంట వెళ్ళాలి అనే స్మృతి ఉండాలి. అయితే సేవలో సదా అచంచలస్థితి ఉంటుందా? సేవ యొక్క విస్తారంలో సారరూపి బీజం యొక్క అనుభూతిని మర్చిపోకండి. విస్తారంలో లీనమైపోకండి. విస్తారంలోకి వస్తూ స్వయం సారరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా సారస్వరూపం యొక్క అనుభూతి చేయించండి.

ఈవిధంగా సాక్షాత్తు ఆత్మ స్వరూపం యొక్క అనుభూతి చేసుకునే ఆత్మలకు, సదా అన్ని కర్మలఖాతా యొక్క వృక్షాన్ని సమాప్తి చేసుకుని బిందువు పెట్టి బిందురూప స్థితిలో స్థితులై బిందువైన బాబా వెంట సదా ఉండేవారికి, ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే సూక్ష్మవతనవాసి, ఇప్పుడిప్పుడే మూలవతనవాసిగా అయ్యే అభ్యాసి ఆత్మలకు, సదా ఎగిరేకళ యొక్క అనుభవం చేసుకునే ఆత్మలకు, సదా బాబా సమానమైన ఎవరెడీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.