03.04.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మొట్టమొదటిది త్యాగము - దేహభానము యొక్క త్యాగము

బాప్ దాదా తన త్యాగమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ త్యాగ స్వరూపులు - కానీ, బాబా పిల్లలుగా అయినా కూడా, ఒకేరకమైన భాగ్యముయొక్క వారసత్వము లభించినా, సంభాళించుకోవటము మరియు పెంచుకోవటము ఆధారముపై నంబర్ తయారవుతుంది అని భాగ్యము గురించి వినిపించాము కదా, అలా త్యాగమూర్తులుగా అయితే అందరూ అయ్యారు, వీరిలో కూడా నంబర్వారీగా ఉన్నారు. త్యాగము చేసారు మరియు బ్రాహ్మణులుగా అయ్యారు కానీ త్యాగముయొక్క నిర్వచనము చాలా గుహ్యమైనది. తనువు-మనసు-ధనము, సంబంధాలు అన్నిటినీ త్యాగము చేసాము అని అనటమైతే అందరూ అంటారు, కానీ తనువుయొక్క త్యాగము అనగా దేహభానముయొక్క త్యాగము. మరి దేహభానపు త్యాగులుగా అయుపోయారా లేక అవుతూ ఉన్నారా? ఏ వస్తువునైనా లేక ఏ విషయమునైనా వదిలెయ్యటము, నాది అన్న భావము నుండి దూరమైపోవటము, దానిపై తమ అధికారము సమాప్తమవ్వటము. ఎవరికొరకైతే త్యాగము చేసారో ఆ వస్తువు వారిదైపోయింది. ఏ విషయన్నైతే త్యాగము చేసారో దానిని గురించి మరల ఆలోచించను కూడా ఆలోచించలేరు ఎందుకంటే త్యాగము చేసేసిన విషయము, సంకల్పము ద్వారా ప్రతిజ్ఞ చేసిన విషయమును మరల తిరిగి తీసుకోలేరు. ఏవిధంగా, హద్దు సన్యాసులు తమ ఇంటిని, సంబంధాలను త్యాగము చేసి వెళ్తారు, కాని మరల ఒకవేళ తిరిగి వచ్చేసినట్లయితే వారిని ఏమటారు! నియమప్రమాణంగా తిరిగి రాకూడదు. అలా బ్రాహ్మణులైన మీరు అనంతమైన సన్యాసులు, అనంతమైన త్యాగులు. త్యాగమూర్తులైన మీరు ఈ పాత ఇంటిని అనగా పాత శరీరమును, పాత దేహముయొక్క భానమును త్యాగము చేసారు, మరల ఎప్పుడూ ఈ పాత ఇంటిపై ఆకర్షితులవ్వము అని బుద్ధిద్వారా సంకల్పము చేసారు. సంకల్పములో కూడా మళ్ళీ తిరిగి రారు. మొట్టమొదటగా ఈ త్యాగము చేసారు కనుకనే దేహ సహితంగా దేహ సంబంధాల త్యాగము అని అంటారు. దేహ భానముయొక్క త్యాగము. మరి త్యాగము చేసిన పాత ఇంటికి మళ్ళీ తిరిగి రారు కదా! ఏమని ప్రమాణము చేసారు? తనువు కూడా మీదే అని అన్నారా లేక కేవలము మనసే మీది అని అన్నారా? మొదటి మాటగా ''తనువు'' అన్నది వస్తుంది. తనువు-మనసు-ధనము అన్నట్లుగా, దేహము మరియు దేహ సంబంధాలు అని అంటారు. మరి మొదటి త్యాగము ఏదైంది? ఈ పాత దేహ భానమునుండి విస్మృతి అనగా దూరమైపోవటము. త్యాగమునకు ఇది మొదటి అడుగు. ఇంటిలో ఏవిధంగా ఇంటి సామాన్లు ఉంటాయో అలా ఈ దేహరూపీ ఇంటిలో ఉన్న భిన్న-భిన్న కర్మేంద్రియాలే సామానులు. మరి ఇంటిని త్యాగము చెయ్యటము అనగా అన్నిటినీ త్యాగము చెయ్యటము. ఇంటిని వదిలారు కానీ ఏదైనా ఒక వస్తువుపై మమత ఉండిపోయినట్లయితే దానిని త్యాగమని అంటారా? ఇలా ఏ కర్మేంద్రియమైనా ఒకవేళ తనవైపు ఆకర్షితము చేసినట్లయితే మరి దానిని సంపూర్ణ త్యాగమని అంటారా? ఈవిధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మిగిలిన అన్నిటినీ వదిలేసాము, కాకపోతే ఏదో ఒక్క కర్మేంద్రియమే విచలితమవుతుంది, అది కూడా సమయము వచ్చినప్పుడు సరైపోతుందిలే ఇని ఇలా నిర్లకక్ష్యులుగా అవ్వకండి. కానీ ఏదైనా ఒక్క కర్మేంద్రియమునకు చెందిన ఆకర్షణ ఉన్నాకూడా అది ఒక్క బాబాకు చెందినవానిగా అవ్వనివ్వదు. ఏకరస స్థితిలో స్థితులవ్వనివ్వదు. నంబర్వన్లోకి పోనివ్వదు. ఒకవేళ వజ్రాలు, నగలు, మహళ్ళు అన్నిటినీ వదిలినా కేవలము పగిలిపోయిన మ్టిపాత్రపైనైనా కూడా మోహము ఉండిపోయినట్లయితే ఏమవుతుంది? ఏవిధంగా వజ్రము తనవైపుకు ఆకర్షితము చేస్తుందో అలా పగిలిపోయిన మ్టిపాత్రకూడా దానికంటే ఎక్కువగా తనవైపుకు పదే-పదే ఆకర్షితము చేస్తుంది. అనుకోకపోయినాకూడా బుద్ధి పదే-పదే అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలా ఒకవేళ ఏ కర్మేంద్రియముయొక్క ఆకర్షణ అయినా ఉండిపోయినట్లయితే శ్రేష్ఠ పదవిని పొందటమునుండి పదే-పదే కిందకు తీసుకువచ్చేస్తుంది. కనుక పాత ఇల్లు మరియు పాత సామగ్రి అన్నిటినీ త్యాగము చెయ్యాలి. ఇదైతే కొంచెమే కదా అని అనుకోకండి, కానీ ఈ కొంచెమే చాలా ఎక్కువ పోగొట్టేదిగా అవుతుంది, సంపూర్ణ త్యాగము కావాలి. ఈ పాత దేహమును బాప్దాదాద్వారా లభించిన తాకట్టు వస్తువుగా భావించండి. సేవ కొరకు కార్యములో వినియోగించాలి. ఇది నా దేహము కాదు కానీ సేవ కొరకు లభించిన తాకట్టు వస్తువు. అతిథిగా అయ్యి దేహములో ఉంటూ ఉన్నారు. బాప్దాదా కొద్ది సమయము కొరకు కార్యము కొరకు ఈ తనువును ఇచ్చారు. మరి మీరు ఎవరయ్యారు? అతిథి! నాది అనేదాని త్యాగము, అతిథిగా భావించి మహా కార్యములో దానిని వినియోగించండి. అతిథికి ఏం గుర్తుంటుంది? అసలైన తన ఇల్లు గుర్తుంటుందా లేక అందులోనే ఇరుక్కుపోతారా! మరి మీ అందరి ఈ శరీరరూపీ ఇల్లుకూడా ఫరిస్తా స్వరూపము, మరల దేవతా స్వరూపము. దానిని గుర్తు చెయ్యండి. ఈ పాత శరీరములో ఎలా నివాసముండాలంటే, బాప్దాదా పాత శరీరమును ఆధారముగా తీసుకుంటారు కానీ ఆ శరీరములో ఇరుక్కుపోరు, అలా ఉండాలి. కర్మ కొరకు ఆధారమును తీసుకున్నారు, మరల మీ ఫరిస్తా స్వరూపములో స్థితులైపోండి. మీ నిరాకారీ స్వరూపములో స్థితులైపోండి. అతీతత్వమునకు పైన ఉన్న ఉన్నత స్థితినుండి కిందకు సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసేందుకు రండి, వీరినే మెహమాన్(అతిథి) అని అంటారు అనగా మహానులు. ఇలా ఉంటారా? త్యాగముయొక్క మొదటి అడుగును పూర్తిచేసారా?

వర్తమాన సమయములో ఎవరూ తమను తక్కువగా భావించరు అని బాప్దాదా ఇటువంటి తమాషా అయిన విషయాన్ని వింటారు. ఇద్దరిలో ఒకరు చిన్నవారిగా, ఒకరు పెద్దవారిగా అయినట్లయితే ఏం చేస్తారు! మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తారా? అని ఒకవేళ ఎవరికైనా చెప్పినట్లయితే, ఎందుకు, ఏమిటి అనే శస్త్రాలను తీసుకుని ఉల్టా (తల్లక్రిందులుగా) శక్తి స్వరూపాన్ని చూపిస్తారు. ఈ అలంకారముకూడా తక్కువైనదేమీ కాదు. సర్వ శక్తుల అలంకారములు ఏవిధంగా ఉన్నాయో, అలా మాయ లేక రావణుని భుజాలుకూడా తక్కువైనవారేమీ కారు. శక్తులను భుజధారులుగా చూపించారు. అష్ట భుజాలు, 16 భుజాలు(చేతులు) కలవారిగా కూడా చూపిస్తారు కానీ రావణుని తలను ఎక్కువగా చూపిస్తారు, ఎందుకని? ఎందుకంటే మాయ శక్తి అయిన రావణుడు మొదటగా బుద్ధినే అలజడిలోకి తీసుకువస్తాడు. ఏ మాయ అయినా వచ్చిన సమయములో క్షణములో దానికి ఎన్ని రూపాలు వచ్చేస్తాయి? ఏమిటి, ఎందుకు, ఇలా, అలా, లాంటి ఎన్ని ప్రశ్నలు బుర్రలోకి వస్తాయి! ఒకదాన్ని కత్తిరిస్తే ఇంకొకటి వస్తుంది. ఒకే సమయములో 10 విషయాలు బుద్ధిలోకి వెంబడే వచ్చేస్తాయి. మరి ఒక విషయానికి పది తలలు వచ్చేసాయి కదా! ఈ విషయాలలో అయితే అనుభవీలు కదా? మరల ఒక్కొక్క తల తన రూపాన్ని చూపిస్తుంది. ఇదే 10 తలలు కల శస్త్రధారిగా అవుతుంది.

శక్తి అనగా సహయోగము. అభిమానమనే తల కల శక్తి కాదు కానీ సర్వ భుజధారి అనగా అన్ని పరిస్థితులలో సహయోగి. రావణుని 10 తలలు కలిగిన ఆత్మలు ప్రతి చిన్న పరిస్థితిలో కూడా ఎప్పుడూ సహయోగిగా అవ్వరు. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న తలద్వారా తమ తప్పుడు అభిమానమును ప్రత్యక్షము చేస్తూ ఉంటారు. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చినట్లయితే మరల ఎలా అన్న తల పైకొస్తుంది అనగా ఒక విషయాన్ని పరిష్కరిస్తే మరొక విషయాన్ని మొదలుపెడ్తారు. రెండో విషయాన్నికూడా పరిష్కరిస్తే మూడవ తల మొలుస్తుంది. ఈ విషయమైతే కరెక్టే కానీ ఇలా ఎందుకు? అదేంటి? అని పదే పదే అంటుంటారు. ఒక విషయానికి 10 తలలను తగిలించుకునే శక్తి అని ఇటువంటివారినే అంటారు. సహయోగులుగా ఎప్పుడూ అవ్వరు, ఎప్పుడూ ప్రతి విషయములో అపోజిషన్ చేస్తారు. కనుక అపోజిషన్ చేసే రావణ సంప్రదాయులుగా అయ్యారు కదా. బ్రాహ్మణులుగా అయినాగానీ ఆ సమయములో అసురీ శక్తియొక్క ప్రభావము ఉంటుంది, వశీభూతులైపోతారు. శక్తి స్వరూపులు ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో సదా సహయోగులుగా ఉంటారు. సహయోగమునకు గుర్తు భుజాలు, కనుక ఎప్పుడైనా ఏదైనా సంగఠిత కార్యమున్నప్పుడు ఏ మాట అంటారు? మీ-మీ వ్రేలిని ఇవ్వండి అని అంటారు. మరి ఇది సహయోగమును ఇవ్వటమైంది కదా. వ్రేలు కూడా చేతిలోనే ఉంది కదా. కనుక భుజాలు సహయోగమునకు గుర్తు. మరి శక్తుల భుజాలు మరియు రావణుని తల అంటే ఏమిటో అర్థమైందా? కనుక మిమ్మల్ని మీరు - సదా సహయోగమూర్తిగా అయ్యానా? త్యాగమూర్తిగా అయ్యేందుకు మొదటి అడుగును ఫాలో ఫాదర్ సమానంగా వేసానా? అని చూసుకోండి. బ్రహ్మాబాబాను చూసారు, వారి గురించి విన్నారు - సంకల్పములో, మాటలలో ఎల్లప్పుడూ ఏముండింది? ఇది బాబా రథము. మరి మీ రథము ఎవరిది? కేవలము బ్రహ్మానే రథమును ఇచ్చారా లేక మీరుకూడా రథమును ఇచ్చారా? బ్రహ్మాయొక్క ప్రవేశతా పాత్ర వేరు కానీ మీరందరుకూడా ఈ తనువు మీదే అన్నారే కానీ తనువు నాది అని అనలేదు. ఎలా నడిపిస్తే అలా నడుస్తాము, ఎక్కడ కూర్చోబెడ్తే అక్కడ కూర్చుటాంము...... అన్నది మీ అందరి ప్రమాణము కూడా కదా? లేక కండ్లను నేను నడిపిస్తాను, మిగిలినవాటిని బాబా నడిపించాలి అనా? కొంచెము మన్మతముపై నడుస్తాము, కొంచెము శ్రీమతముపై నడుస్తాము, ఇటువంటి ప్రమాణము కాదు కదా? కనుక ఏ కర్మేంద్రియమునకైనా వశమవ్వటము - ఇది శ్రీమతమా లేక మన్మతమా? మరి త్యాగముయొక్క నిర్వచనము ఎంత గుహ్యమైనదో అర్థమైందా? కనుకనే నంబర్ తయారైంది. ఇప్పుడైతే కేవలము దేహత్యాగమునకు చెందిన విషయమును వినిపించాము. ముందు ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే త్యాగముయొక్క మెట్లు కూడా చాలా ఉన్నాయి, మొదటి మెట్టు గురించి మాట్లాడుకుంటున్నాము. త్యాగము చెయ్యటము కష్టమనిపించటం లేదు కదా? అన్నిటినీ వదలవలసి ఉంటుంది. ఒకవేళ పాతదానికి బదులుగా క్రొత్తది లభిస్తే అప్పుడు కష్టమనిపిస్తుందా! ఇప్పటికిప్పుడే లభిస్తుంది. భవిష్యత్తులో లభించటమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ ఇప్పటికిప్పుడే పాత భానమును వదలండి, ఫరిస్తా స్వరూపాన్ని తీసుకోండి. ఎప్పుడైతే పాత ప్రపంచమునకు చెందిన దేహభానమును వదలుతారో అప్పుడు ఎలా అవుతారు? డబల్ లైట్. ఇప్పుడే అవుతారు. కానీ ఒకవేళ ఇక్కడివారుగానూ కాక, అక్కడివారుగానూ కాకపోతే కష్టమనిపిస్తుంది. పూర్తిగా వదలనూ వదలకపోతే, పూర్తిగా తీసుకోనూ తీసుకోకపోతే సగం మరణించినవారుగా అయిపోతారు, కనుక పదే-పదే దీర్ఘ శ్వాసను తీసుకుంటుటాంరు. ఏదైనా విషయము కష్టమనిపిస్తే దీర్ఘ శ్వాసను తీసుకుంటారు. మరణించటంలో అయితే మజా ఉంది కానీ అది పూర్తిగా మరణించినట్లయితేనే. తీసుకునేటప్పుడైతే పూర్తిగా తీసుకుటాంము అని అంటారు కానీ వదిలేటప్పుడు మాత్రం మ్టటిపాత్రను కూడా వదలరు కనుకనే కష్టమైపోతుంది. మామూలుగా, ఎవరైనా మ్టిపాత్రను ఉంచుకున్నట్లయితే బాప్దాదా ఉంచుకోనిస్తారు, బాబాకేముంది, ఉంచుకోండి అని అంటారు కానీ స్వయమే వ్యాకులతలోకి వచ్చేస్తారు కనుకనే వదలండి అని బాప్దాదా అంటారు. ఒకవేళ ఏదైనా పాత వస్తువును ఉంచుకున్నట్లయితే ఏ రిజల్టు ఉంటుంది? పదే-పదే బుద్ధి కూడా వాటి పైకే భ్రమిస్తూ ఉంటుంది. ఫరిస్తాలుగా అవ్వలేరు కనుక బాప్దాదా అయితే ఇంకా వేలాది మ్టటిపాత్రలను ఇవ్వగలరు, ఎన్నింటినైనా సమకూర్చుకోండి కానీ ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడ ఏం పెరుగుతాయి? దోమలు. దోమలు ఎవరిని కుట్తాయి? కనుక పాతవి వదలండి అని బాప్దాదా పిల్లల కల్యాణము కొరకే చెప్తారు. సగం చనిపోయినవారిగా అవ్వకండి. మరణించేది ఉంటే పూర్తిగా మరణించండి లేదంటే పూర్తిగా జీవించి ఉండండి. ఇందులో కష్టమేమీ లేదు కానీ కష్టంగా చేసుకుంటారు. అప్పుడప్పుడు కష్టమైపోతుంది. రావణుని తల వచ్చినప్పుడు కష్టమనిపిస్తుంది. భుజధారి శక్తిగా అయినప్పుడు సహజమైపోతుంది. కేవలము ఒక్క అడుగు సహయోగమును ఇవ్వటము మరియు కోటానుకోట్ల అడుగుల సహయోగము లభించటముగా అయిపోతుంది. కానీ మొదటైతే ఒక అడుగును ఇవ్వవలసివస్తుంది, కానీ ఇలా ఇచ్చేందుకు గాభరా పడిపోతారు. లభించటమును మర్చిపోతారు, ఇవ్వటము గుర్తువస్తుంది కనుక కష్టము అనుభవమవుతుంది. అచ్ఛా-

ఇలా సదా సహయోగమూర్తులు, సదా త్యాగముద్వారా శ్రేష్ఠ భాగ్యమును అనుభవము చేసేవారు, అడుగడుగులో ఫాలో ఫాదర్ చేసేవారు, సదాకాలమునకు అతిథిగా భావించేవారు అనగా మహనాత్మగా భావించేవారు అయిన ఇటువంటి అనంతమైన సన్యాసమును చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనము

1. పరిస్థితిరూపీ పర్వతమును స్వస్థితితో దాటేయండి -

స్వయమును సదా సమర్థ ఆత్మలుగా భావిస్తారా? సమర్థ ఆత్మ అనగా సదా మాయను ఛాలెంజ్ చేసి విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారు. సదా సమర్థ బాబా సాంగత్యములో ఉండేవారు. బాబా ఏవిధంగా సర్వ శక్తివంతులో అలా మేము కూడా మాస్టర్ సర్వ శక్తివంతులము. సర్వ శక్తులు శస్త్రాలు, అలంకారాలు, ఇలా అలంకారధారి ఆత్మగా భావిస్తారా? ఎవరైతే సదా సమర్ధులో వారు ఎప్పుడూ పరిస్థితులలో క్రిందమీద అవ్వరు. పరిస్థితులను దాటివేయగలరు. విమానములో ఎగిరేటప్పుడు ఎన్ని పర్వతాలు, ఎన్ని సముద్రాలను దాటుతారు, ఎందుకంటే పైన ఎగురుతారు కనుక ఉన్నతమైన స్థితిలో క్షణములో దాటివేస్తారు. పర్వతాన్ని లేక సముద్రాన్ని కూడా జంప్ చేసాము అన్నట్లుగా అనిపిస్తుంది. కష్టముయొక్క అనుభవమవ్వదు.

2. అధికారదర్పమును త్యాగము చేసి ఆత్మిక నషాయొక్క శక్తిని ధారణ చేసే సత్యమైన సేవాధారులుగా అవ్వండి.

కుమారులందరూ ఎల్లప్పుడూ ఆత్మికతలో ఉంటారా, అధికారదర్పములోకైతే రారు కదా? యువతకు త్వరగా అధికారదర్పము వచ్చేస్తుంది. మాకన్నీ తెలుసు, మేము అన్నిటినీ చెయ్యగలము అని అనుకుంటారు. యవ్వనులకు ఉత్సాహము ఉంటుంది. కానీ ఆత్మిక యువత అనగా సదా ఆత్మిక నషాయొక్క శక్తిలో ఉండేవారు. సదా నమ్రచిత్తులు ఎందుకంటే ఎంతగా నమ్రచిత్తులుగా అవుతారో అంతగా నిర్మాణము చేస్తారు. ఎక్కడ నిర్మాణము ఉంటుందో అక్కడ అధికార దర్పము ఉండదు, ఆత్మికత ఉంటుంది. బాబా ఎంత నమ్రచిత్తులై వస్తారు, అలా ఫాలో ఫాదర్. ఒకవేళ సేవలో ఏ కొంచెమైనా దర్పము వచ్చినట్లయితే ఆ సేవ సమాప్తమైపోతుంది. అచ్ఛా - ఓం శాంతి.