28.04.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వస్వ త్యాగుల లక్షణాలు.

బాప్ దాదా నలువైపుల ఉన్న మహాత్యాగులు, సర్వస్వ త్యాగులైన పిల్లలందరినీ చూస్తున్నారు. ఎలాంటి పిల్లలు ఈ మహా భాగ్యమును ప్రాప్తి చేసుకుంటున్నారు మరియు సమీపంగా చేరుకున్నారు - ఇటువంటి సమీప అనగా సమానమైన, శ్రేష్ఠమైన సర్వస్వ త్యాగీ పిల్లలను చూసి బాప్ దాదా హర్షితులవుతారు. సర్వస్వ త్యాగీ పిల్లల విశేషత ఏమిటి, ఏ విశేషతల ఆధారంగా సమీపంగా మరియు సమానంగా అవుతారు? సాకార తనువు ద్వారా కూడా చివరి మాటలుగా మూడు విశేషతలను వినిపించారు.

1. సంకల్పములలో సదా నిరాకారుల నుండి సాకారీలు, సదా అతీతులు మరియు బాబాకు ప్రియమైన ఆత్మలు.

2. వాణిలో సదా నిరహంకారులు అనగా సదా ఆత్మిక మధురత మరియు నిర్మాణత.

3. కర్మలో ప్రతి కర్మేంద్రియముద్వారా నిర్వికారులు అనగా పవిత్రతా పర్సనాలిటీ కలిగినవారు.

కనుక ప్రతి కర్మేంద్రియము ద్వారా మహాదానులు మరియు వరదానులు. మస్తకము ద్వారా సర్వులకు స్వ స్వరూపము యొక్క స్మృతిని కలిగించే వరదానులు మరియు మహాదానులు. నయనాలతో ఆత్మిక దృష్టి ద్వారా సర్వులకు స్వదేశమును అనగా ముక్తిధామము మరియు స్వరాజ్యము అనగా జీవన్ముక్తిని, తమ రాజ్య దర్శనమును చేయించటము మరియు దృష్టి ద్వారా దారిని చూపించే సూచనను ఇవ్వటము. ఇదే మా అసలైన ఇల్లు మరియు రాజ్యము, ఇంటి దారి, రాజ్యమును పొందే దారి లభించింది అని ఆత్మలు అనుభూతి చెందాలి, ఇటువంటి అనుభవమును చేయించే వరదానమును ఇవ్వాలి. ఇటువంటి మహాదానము లేక వరదానమును పొంది సదా హర్షితులైపోవాలి. నోటిద్వారా రచయిత మరియు రచనల విస్తారమును స్పష్టముగా తెలుసుకుని స్వయము రచయితకు రచన, శ్రేష్ఠ బ్రాహ్మణులనుండి దేవతగా అయ్యే వరదానమును పొందాలి. అలాగే చేతుల ద్వారా సదా సహజయోగి, కర్మయోగిగా అయ్యే వరదానము ఇచ్చే శ్రేష్ఠ కర్మధారీ శ్రేష్ఠ ఫలమును ప్రాప్తి చేసుకునే వరదానులుగా చేసేవారు. చరణ కమలాల ద్వారా ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసి, ప్రతి అడుగులో పదమాల(అపారమైన) సంపాదనను జమ చేసుకునే వరదానులు. ఇలా ప్రతి కర్మేంద్రియుము ద్వారా విశేష అనుభూతిని చేయించే వరదానులు అనగా నిర్వికారీ జీవితముకలవారు. సర్వస్వ త్యాగుల ఈ మూడు విశేషతలు సదా స్పష్టంగా కనిపిస్తాయి. సర్వస్వ త్యాగీ ఆత్మ ఏ వికారము యొక్క అంశమునకు కూడా వశీభూతమై ఎటువంటి కర్మ చేయదు. వికారాల రాయల్ అంశ స్వరూపము గురించి గతంలో కూడా వినిపించాము - స్థూల రూపములో వికారాలు సమాప్తమై రాయల్ రూపములో అంశమాత్ర రూపములో మిగిలిపోతాయి. అది గుర్తుంది కదా! బ్రాహ్మణుల భాష కూడా రాయల్ గా అయిపోయింది. ఇప్పుడు ఆ విస్తారమైతే చాలా ఎక్కువైపోయింది. నేనే యథార్థము లేక నాదే రైట్ - ఇలా తమను నిరూపించుకునే రాయల్ భాషకు చెందిన మాటలు కూడా చాలానే ఉన్నాయి. తమ బలహీనతను దాచిపెట్టుకుని ఇతరుల బలహీనతను నిరూపించే లేక స్పష్టము చేసే విస్తారమును చెయ్యటము, దీనికి కూడా చాలా రాయల్ మాటలు మాట్లాడతారు. ఇది కూడా పెద్ద డిక్షనరీ. అక్కడ వాస్తవికత ఉండదు కానీ స్వయమును ఋజువు చేసుకునేందుకు లేక స్వయములోని లోపాలనుండి కాపాడుకోవానికి మన్మతమునకు చెందిన మాటలు ఉంటాయి. ఆ విస్తారమైౖతే అందరికీ మంచిరీతిగా తెలుసు. సర్వస్వ త్యాగుల భాషలో ఏ వికారమూ అంశమాత్రము కూడా ఉండదు. కనుక మనసా-వాచ-కర్మణ, సంబంధ-సంపర్కములలో సదా వికారాల అంశమాత్రము నుండి కూడా దూరముగా ఉంటారు- వీరినే సర్వస్వ త్యాగులు అని అంటారు. అంశమాత్రములన్నీ త్యాగము.

సర్వస్వ త్యాగులు సదా విశ్వ కళ్యాణకారీ విశేషత కలిగినవారుగా ఉంటారు. దాత పిల్లలు సదా దాతలుగా అయ్యి సర్వులకు ఇచ్చే భావన ద్వారా నిండుగా ఉంటారు. వీళ్ళు చెయ్యాలి లేక ఇటువంటి పరిస్థితి ఉండాలి, వాయుమండలము ఉండాలి, అప్పుడే నేను చేస్తాను అని అనుకోరు. ఇతరుల సహయోగము తీసుకుని తమ కళ్యాణము కొరకు శ్రేష్ఠ కర్మను చేసేవారు అనగా తీసుకుని మరల ఇచ్చేవారు, సహయోగమును తీసుకున్నారు తరువాత ఇచ్చారు, కనుక తీసుకోవటము మరియు ఇవ్వటము రెండూ తోడుతోడుగా ఉన్నాయి. కానీ సర్వస్వ త్యాగులు స్వయం మాస్టర్ దాతగా అయ్యి పరిస్థితిని కూడా పరివర్తన చేసే, బలహీనున్ని శక్తిశాలిగా చేసే, వాయుమండలము మరియు వృత్తిని తమ శక్తులద్వారా పరివర్తన చేసే, సదా స్వయమును కళ్యాణార్థము బాధ్యత కల ఆత్మగా భావించి ప్రతి విషయములో సహయోగము మరియు శక్తి యొక్క మహాదానమును, వరదానమును ఇచ్చే సంకల్పము చేస్తారు. ఇది ఉంటే ఇది చేస్తాను, అని అనుకోరు. మాస్టర్ దాతయై పరివర్తన చేసే శుభ భావనతో శక్తులను కార్యములో వినియోగిస్తూ అనగా ఇచ్చే కార్యమును చేస్తూ ఉంటారు. నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను మారాలి, నేను నిర్మాణంగా అవ్వాలి. ఇలా ''జో ఉఠె సో అర్జున్'' (బాధ్యత తీసుకునేవారు) అనగా దాతతనపు విశేషత ఉంటుంది.

సర్వస్వ త్యాగులు అనగా సదా గుణమూర్తులు. గుణమూర్తులకు కల అర్థము గుణవంతులుగా అవ్వటము మరియు సర్వులలో గుణాలను చూడటము. ఒకవేళ స్వయం గుణమూర్తులైతే వారి దృష్టి మరియు వృత్తి ఎంత గుణ సంపన్నమైపోతుందంటే వారి దృష్టి-వృత్తి ద్వారా సర్వులలో ఏ గుణాలు ఉంటాయో అవే కనిపిస్తాయి. అవగుణాలను చూసినా, అర్థం చేసుకున్నాకూడా ఏ అవగుణమునూ బుద్ధి ద్వారా గ్రహించరు అనగా బుద్ధిలో ధారణ చెయ్యరు. అటువంటి హోలీహంసలుగా ఉంటారు. రాళ్ళని తెలుసుకోవటంతోనే స్వీకరించరు. పైగా ఆ ఆత్మలోని అవగుణాన్ని తొలగించేందుకు స్వయములో ప్రాప్తించిన గుణాల శక్తిద్వారా ఆ ఆత్మను కూడా గుణవంతునిగా తయారవ్వటంలో సహయోగిగా ఉంటారు ఎందుకంటే మాస్టర్ దాత సంస్కారము ఉంది.

సర్వస్వ త్యాగి సదా స్వయమును ప్రతి శ్రేష్ఠ కార్యము యొక్క సేవ సఫలతా కార్యములో, బ్రాహ్మణ ఆత్మల ఉన్నతి కార్యములో, బలహీనమైన లేక వ్యర్థ వాతావరణమును మార్చే కార్యములో బాధ్యత కల ఆత్మగా భావిస్తాడు. సేవలో విఘ్నంగా అయిన కారణంగా లేక సంబంధ-సంపర్కములో ఎవరైనా నంబర్ వారీ ఆత్మల కారణంగా ఏ కొంచెమైనా అలజడి జరిగినా ఆ సమయములో సర్వస్వ త్యాగి అనంతమైన ఆధారమూర్తిగా భావించుకుని నలువైపుల కల అలజడిని తగ్గించి అచలంగా చేసే బాధ్యత కలవానిగా భావిస్తాడు. ఇటువంటి అనంతమైన ఉన్నతికి ఆధారమూర్తిని అని సదా స్వయమును అనుభవము చేసుకుంటాడు. ఇదైతే ఈ స్థానానికి సంబంధించిన విషయము కదా లేక ఈ అక్కయ్య, ఈ అన్నయ్యకు సంబంధించిన విషయము కదా అని అనుకోరు. నా పరివారము. నేను కళ్యాణకారీ నిమిత్త ఆత్మను. విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ లభించిందే కానీ కేవలము స్వ కళ్యాణకారి లేక తమ సెంటరు కళ్యాణకారి అని కాదు. ఇతరుల బలహీనత అనగా తమ పరివారపు బలహీనత అని భావిస్తారు, ఇలా స్వయమును అనంతమైన నిమిత్త ఆత్మగా భావిస్తారు. మై-పన్(నేను అనే భావన) ఉండదు, నిమిత్తమాత్రము అనగా విశ్వ కళ్యాణమునకు ఆధారమూర్తి, అనంతమైన కార్యమునకు ఆధారమూర్తి.సర్వస్వ త్యాగులు సదా ఏకరసంగా, ఒకే మతంగా, ఒకే పరివారము యొక్క ఒకటే కార్యము - సదా ఇలా ఒకటే స్మృతిలో ఒకే నంబర్ ఆత్మలుగా ఉంటారు.

సర్వస్వ త్యాగులు సదా స్వయమును ప్రత్యక్ష ఫలము ప్రాప్తించిన ఫలస్వరూప ఆత్మగా అనుభవము చేసుకుటాంరు అనగా సర్వస్వ త్యాగి ఆత్మ సదా సర్వ ప్రత్యక్ష ఫలాలతో సంపన్నంగా ఉన్న అవినాశీ వృక్షము సమానంగా ఉంటుంది. సదా ఫలస్వరూపునిగా ఉంటుంది. కనుక హద్దు కర్మల, హద్దు ఫలాలను పొందాలన్న అల్పకాలికమైన కోరిక నుండి కూడా ఇచ్ఛా మాత్రం అవిద్య(కోరిక అంటే ఏమిటో తెలియనివారి)గాఉంటారు. సదా ప్రత్యక్షఫలమును తినే ఆరోగ్యకరమైన మనసు కలవారిగా ఎల్లప్పుడూ ఉంటారు. సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి మానసిక అనారోగ్యము ఉండదు. సదా మన్మనాభవగా ఉంటారు. మరి అటువంటి సర్వస్వ త్యాగిగా అయ్యారా? మూడు విశేషతలను ఎదురుగా ఉంచుకుని స్వయాన్ని ఇలా ప్రశ్నించుకోండి - నేను ఎటువంటి త్యాగిని! ఎక్కడివరకు చేరుకున్నాను? ఎన్ని మెట్లు ఎక్కి బాబా సమానమనే లక్ష్యమునకు చేరుకున్నాను? పూర్తిగా అన్ని మెట్ల వరకు చేరుకున్నానా లేక ఇప్పుడు కొన్ని మెట్ల వరకే చేరుకున్నానా? 7 కోర్సులలో ఎన్ని కోర్సులు చేసాను? 7 వ పాఠము చివర్లో భోగ్ పెడ్తారు కానీ బాప్ దాదా అయితే మహాభోగ్ పెడ్తారు. మీరైతే ప్రతి గురువారము భోగ్ పెడ్తారు, కానీ బాప్ దాదా మహాభోగ్ పెడ్తారు కదా! సందేశీలు పైన వతనమునకు భోగ్ తీసుకునిపోతారు - మరి బాప్ దాదాకూడా ఎక్కడకు తీసుకుపోతారు! మొదట స్వయమును భోగ్ లో సమర్పించుకోండి. భోగ్ ను కూడా బాబా ముందు సమర్పిస్తారు కదా! ఇప్పుడు స్వయమును సదా ప్రత్యక్ష ఫల స్వరూపునిగా చేసుకుని సమర్పణ చెయ్యండి, అప్పుడు మహాభోగ్ అవుతుంది. మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకుని ఆఫర్ చెయ్యండి. కేవలము స్థూల భోగ్ ని ఆఫర్ చెయ్యకండి. సంపన్న ఆత్మగా అయ్యి స్వయమును ఆఫర్ చెయ్యండి. అర్థమైందా - ఇంకా ఏం చెయ్యాలి అన్న విషయం అర్థమైందా?

అచ్ఛా! ఇంక ఒకసారి కలవటము మిగిలి ఉంది. మామూలుగా అయితే సాకారము ద్వారా మిలనమేళకు, ఈ రూపురేఖలతో మిలనము చేసేందుకు ఇది అంతిమ సమయము. ప్రోగ్రాం అనుసారంగా అయితే ఈరోజు సాకార మేళకు సమాప్తి సమారోహము, తరువాత విషయము తరువాత చూద్దాము. ఖచ్చితంగా ఇంకొకటి కూడా లభించొచ్చు, కానీ స్వయము కొరకు ఈ అన్ని మిలనమేళల సారంగా ఏం తీసుకున్నారు? కేవలము విన్నారా లేక లోపల ఉంచుకుని స్వరూపములోకి తీసుకువచ్చారా? ఈ మిలనమేళ యొక్క సీజన్ విశేషంగా ఏ సీజనుని తీసుకువస్తుంది? ఈ సీజన్ ఫలంగా ఏం వెలువడుతుంది? సీజనులోని ఫలాలకు మహత్వము ఉంటుంది కదా! మరి ఈ సీజన్ ఫలంగా ఏం వచ్చింది! బాప్ దాదా లభించారు అన్నదైతే జరిగింది కానీ కలవటము అనగా సమానంగా అవ్వటము. కనుక సదా బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పపు ఫలాన్ని బాప్ దాదాకు చూపిస్తారు కదా! ఇటువంటి ఫలాన్ని తయారుచేసారా? స్వయమును తయారుచేసుకున్నారా? లేక ఇప్పుడు కేవలము విన్నారు, తరువాత తయారయ్యేది ఉందా? కేవలము మిలనము జరుపుకోవాలా లేక తయారవ్వాలా? మిలనము చేసుకునేందుకు చాలా ఉల్లాస-ఉత్సాహాలతో పరిగెత్తుకుని పరిగెత్తుకుని చేరుకున్నారు, అలాగే తయారవ్వటంలో కూడా ఎగరాలి, ఎగురుతున్నారా! రావటం-పోవటంలో సాధనాలకు చెందిన ఇబ్బందులను కూడా భరిస్తారు. కానీ ఎగిరేకళలో వెళ్ళేందుకు ఎటువంటి కష్టము లేదు. హద్దు కొమ్మలను తయారుచేసుకుని కొమ్మలను పట్టుకుని కూర్చునిపోయారు, ఇప్పుడు ఎగిరే పక్షులూ, కొమ్మలను వదలండి. బంగారు కొమ్మలను కూడా వదలండి. సీతను బంగారులేడి శోకవాటికకు పంపించింది. ఈ మేరా, మేరా (నావి-నావి) అన్నవి, నా పేరు, నా గౌరవము, నా ప్రతిష్ట, నా సెంటరు - ఇవన్నీ బంగారు కొమ్మలు. అనంతమైన అధికారాన్ని వదిలి హద్దు అధికారాన్ని తీసుకోవటంలోకి వచ్చేస్తారు. ఇది నా అధికారము, ఇది నా పని - వీటన్నింటి నుండి ఎగిరే పక్షిగా అవ్వండి. ఈ హద్దు ఆధారాలను వదలండి. వదిలించండి అని అరుస్తూ ఉండే చిలకలైతే కారు కదా - స్వయమే కొమ్మలను వదలరు, కానీ వదిలించండి అని మళ్ళీ అరుస్తుంటారు. అటువంటి చిలుకలలా అవ్వకూడదు. వదలండి మరియు ఎగరండి. వదిల్తే వదులుతుంది కదా. బాప్ దాదా అయితే రెక్కలను ఇచ్చారు - రెక్కల పని ఎగరటమా లేక కూర్చునిపోవటమా? కనుక ఎగిరే పక్షిగా అవ్వండి అనగా ఎగిరే కళలో సదా ఎగురుతూ ఉండండి. అర్థమైందా - సీజన్ ఫలాన్ని ఇవ్వటము అని దీనినే అంటారు. అచ్ఛా!

ఇలా సదా ప్రత్యక్ష ఫల సంపన్నులు, సంపూర్ణ శ్రేష్ఠ ఆత్మలు, సదా బాబా సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, సదా ప్రతి కర్మలో వికారాల ఏ అంశమునూ స్పర్శించనివారు అయిన ఇటువంటి సర్వస్వ త్యాగులు, సదా ఎగిరే కళలో ఎగిరే పక్షులు అయిన ఇటువంటి బాబా సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.