28.12.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా ఏకరసముగా సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారలుగా అవ్వండి.

బాప్ దాదా పిల్లలందరినీ చూస్తూ పిల్లలందరి యొక్క వర్తమానములో లగ్నములో మగనమయ్యే స్థితి మరియు భవిష్య ప్రాప్తిని చూసి హర్షితులవుతున్నారు. ఎలా ఉండేవారు మరియు ఎలా అయిపోయారు మరియు భవిష్యతులో కూడా ఎలా అవ్వనున్నారు! పిల్లలు ప్రతి ఒక్కరూ విశ్వం ముందు విశేష ఆత్మలు. ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్యసితార ప్రకాశిస్తోంది, ఇటువంటి అభ్యాసమే ఉండాలి. సదా ప్రకాశిస్తున్న సితారను చూస్తూ ఉండాలి. ఇదే అభ్యాసమును సదా పెంచుతూ ముందుకువెళ్ళండి. ఎక్కడ చూసినా, ఎప్పుడు ఎవ్వరిని చూసినా ఎటువంటి నేచురల్ అభ్యాసముండాలంటే శరీరమును చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. సదా దృష్టి ప్రకాశిస్తున్న సితారవైపుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మిక దృష్టి సదా నేచురల్ రూపంలో ఏర్పడుతుందో అప్పుడు విశ్వం యొక్క దృష్టి ప్రకాశిస్తున్న ఈ ధరిత్రి సితారలైన మీవైపుకు వెళుతుంది. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలు వెదుకుతున్నాయి. ఏదో శక్తి కార్యమును చేస్తోంది అన్న ఇటువంటి అనుభూతి, ఇటువంటి టచింగ్ ఇప్పుడు వస్తోంది కాని ఎక్కడ ఉన్నారు, వారు ఎవరు అన్నది వెదుకుతూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. భారతదేశం ద్వారానే ఆధ్యాత్మిక ప్రకాశము లభిస్తుంది అన్నది కూడా మెల్ల మెల్లగా స్పష్టమవుతూ ఉంది. కావున ఈ కారణంగా విశ్వం నలువైపుల నుండి దృష్టి మరలి భారతదేశంవైపుకు వచ్చింది. కాని భారతదేశంలో ఎటువైపు మరియు ఎవరు ఈ అధ్యాత్మిక ప్రకాశమును ఇచ్చేందుకు నిమిత్తులయ్యారు అన్నది ఇప్పుడు ఇంకా స్పష్టమవ్వాలి. భారతదేశంలో ఆధ్యాత్మిక ఆత్మలుగా పిలువబడేవారు అనేకమంది ఉన్నారు, వారందరిలోను ధర్మాత్మలు ఎవరు మరియు పరమాత్మ ఎవరు అని అందరి లోపల ఇప్పుడు ఈ అన్వేషణ ఉంది. వీరైతే కాదు కదా, వీరైతే కాదు కదా అన్న ఇదే ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. 'అది వీరే' అన్న నిర్ణయానికి ఇప్పటి వరకు చేరుకోలేకపోయారు. ఇటువంటి భ్రమిస్తున్న ఆత్మలకు సరైన లక్ష్యాన్ని, యథార్థ ఆధారాన్ని అందించేవారు ఎవరు? అది మేమే అని డబుల్ విదేశీయులు భావిస్తున్నారా? పాపం వారిని అంతగా ఎందుకు భ్రమింపజేస్తున్నారు. సదా ప్రకాశిస్తున్న సితారలను చూడగలిగే ఇటువంటి స్థితిని సదాకాలికంగా తయారుచేయండి. దూరం నుండే మీ ప్రకాశిస్తున్న లైట్ కనిపించాలి. ఇప్పటి వరకు ఎవరైతే సన్ముఖంగా వస్తారో, సమీపంగా వస్తారో వారికి అనుభవమవుతోంది. కాని దూర దూరాల వరకు ఈ టచింగ్ అనుభవమవ్వాలి, ఈ వైబ్రేషన్లు వ్యాపించాలి. ఈ విషయంలో ఇంకా అభ్యాసం యొక్క అవసరం ఉంది. ఇప్పుడు మీరు రండి, మీరు వచ్చి అనుభవం చేసుకోండి అని ఆహ్వానమును ఇవ్వవలసి వస్తోంది. కాని ఎప్పుడైతే ప్రకాశిస్తున్న సితారలు సూర్యుని, చంద్రుని సమానంగా తమ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏమవుతుంది? ఏ విధంగా స్థూలమైన ప్రకాశమువైపుకు దీపపు పురుగులు స్వతహాగానే వస్తాయో, వాటిని పిలిచేందుకు దీపము వెళ్ళదో, దాహంగా ఉన్న దీపపు పురుగులు ఎక్కడినుండైనా అక్కడికి వచ్చి చేరుకుంటాయో, అలా ప్రకాశిస్తున్న సితారలైన మీపై భ్రమిస్తున్న ఆత్మలు, వెదుకుతున్న ఆత్మలు స్వతహాగానే మిమ్మల్ని పొందేందుకు, కలుసుకునేందుకు ఇటువంటి వేగవంతమైన గతితో వస్తాయి. బాబా ద్వారా ముక్తీ జీవన్ముక్తుల యొక్క అధికారమును క్షణంలో ఇచ్చేందుకు మీరందరూ తీవ్రగతితో సేవ చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మాస్టర్ దాత యొక్క పాత్రను అభినయిస్తున్నారు. మాస్టర్ శిక్షకుల పాత్ర కొనసాగుతోంది. కాని ఇప్పుడు ఇక సద్గురుని పిల్లలుగా అయి గతి, సద్గతులను ఇచ్చే వరదాత యొక్క పాత్రను అభినయించాలి. మాస్టర్ సద్గురువు యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడైతే తండ్రి పాత్ర, తండ్రి మరియు శిక్షకుని పాత్ర విశేష రూపంలో కొనసాగుతోంది. కావున పిల్లల రూపంలో అప్పుడప్పుడు బాబా కూడా వయ్యారాలు చూడవలసి వస్తుంది. శిక్షకుని రూపంలో పదే పదే ఒకే పాఠమును గుర్తు చేయిస్తూ ఉంటారు. సద్గురుని రూపంలో గతి, సద్గతి యొక్క సర్టిఫికేట్, ఫైనల్ వరదానము క్షణంలో లభిస్తుంది. మాస్టర్ సద్గురు స్వరూపము అనగా సంపూర్ణంగా ఫాలో చేసేవారు. సద్గురుని వచనాలపై సదా సంపూర్ణ రీతిలో నడిచేవారు. ఇలాంటి స్వరూపంగా ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో బాబా స్వరూపమును మరియు మీ స్వరూపమును అనుభవం చేసుకుంటారు. సద్గురుని స్వరూపము అనగా సంపన్నంగా, సమానంగా తయారుచేసి తోడుగా తీసుకువెళ్ళేవారు. సద్గురుని స్వరూపంలో మాస్టర్ సద్గురువు కూడా దృష్టి ద్వారా అతీతంగా చేస్తారు. మతమునివ్వగానే గతి లభించాలి. కావుననే గురుమంత్రము ఎంతో ప్రసిద్ధమైనది. క్షణంలో మంత్రమును తీసుకోగానే గతి లభించింది అని భావిస్తారు. మంత్రము అనగా శ్రేష్ఠ మతము. ఎటువంటి శక్తిశాలీ స్థితిలో శ్రీమతమునిస్తారంటే తమకు గతి, సద్గతుల ఆధారము లభించిందని ఆత్మలు భావిస్తారు. ఇటువంటి శక్తిశాలీ స్థితిని ఇప్పటి నుండే ధారణ చేయండి. అందరూ సితారలే కాని ఇప్పుడు సదా ఏకరసముగా, సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారను అని స్వయమును ప్రత్యక్షం చేయండి. ఏం చేయాలో అర్థమైందా? డబుల్ విదేశీయులు తీవ్రగతి కలవారే కదా! లేక ఆగుతూ నడుస్తూ ఉంటారా! అప్పుడప్పుడు మేఘాల మధ్య దాగి ఉండడంలేదు కదా! మేఘాలు వస్తున్నాయా! ఈ విధంగా సంపూర్ణంగా ప్రకాశిస్తున్న సితారగా మళ్ళీ ఇప్పుడిప్పుడే మేఘాలలో దాగిపోతే విశ్వంలోని ఆత్మలు స్పష్టంగా అనుభవం చేసుకోలేరు. కావున ఏకరసముగా ఉండే, సదా సూర్యుని సమానంగా ప్రకాశిస్తూ ఉండే సంకల్పమును చేయండి. అచ్ఛా!

డబుల్ విదేశీయులైన పిల్లలందరికీ మరియు నలువైపులా ఉన్న సేవాధారీ పిల్లలకు, సదా బాబా సమానంగా మనస్సు, వాణి, కర్మలలో అనుసరించే సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు, మాస్టర్ హృదయాభిరాములు, సదా భ్రమిస్తున్న ఆత్మలకు దారిని చూపించే లైట్ హౌస్ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:-

నైరోబి పార్టీతో:- అందరూ రేసులో నెంబర్ వన్నే కదా! నెంబర్ వన్ కి గుర్తు- ప్రతి విషయంలోను విజయమును పొందేవారు అనగా మొదటి నెంబర్లోకి వచ్చేవారు. ఏ విషయంలోను ఓటమి లభించకూడదు సదా విజయులు. కావున నైరోబి నివాసులు సదా విజయులే కదా! ఎప్పుడూ నడుస్తూ నడుస్తూ ఆగిపోవడంలేదు కదా! ఆగిపోయేందుకు కారణం ఏమి? తప్పకుండా ఏదో ఒక మర్యాదలో లేక నియమములో కొద్దిగా అయినా పైకీ క్రిందికీ అయితే బండి ఆగిపోతుంది. కాని ఈ సంగమ యుగము మర్యాదా పురుషోత్తములుగా అయ్యే యుగము. పురుషులూ కాదు, స్త్రీలూ కాదు పురుషోత్తములుగా అయ్యే యుగము. ఇదే స్మృతిలో సదా ఉండండి. పురుషులలో ఉత్తమ పురుషునిగా ప్రజాపిత బ్రహ్మ కొనియాడబడతారు. కావున బ్రహ్మాకుమారీ కుమారులైన మీరందరూ పురుషోత్తములుగా అయిపోయారు కదా! ఈ స్థితిలో ఉండడం ద్వారా సదా ఎగిరే కళలోకి వెళుతూ ఉంటారు, క్రింద ఆగరు. నడవడంకన్నా పైన ఎగురుతూ ఉంటారు ఎందుకంటే సంగమ యుగము ఎగిరే కళ యొక్క యుగము. ఇంకే యుగములోను ఇలా ఎగిరే కళ ఉండదు. కావున ఇది ఎగిరే కళ యొక్క యుగము అని స్మృతిలో ఉంచుకోండి. బ్రాహ్మణుల కర్తవ్యము కూడా ఎగరడము మరియు ఎగిరించడము. వాస్తవిక స్థితి కూడా ఎగిరే కళదే. ఎగిరే కళలో ఉన్నవారు క్షణంలో సర్వ సమస్యలను దాటివేస్తారు. అసలు ఏమీ జరగనట్లుగానే దాటివేస్తారు. క్రింద వస్తువేదీ వ్యాకులపరచదు, అవరోధాన్ని కలిగించదు. విమానంలో వెళ్ళేటప్పుడు హిమాలయ పర్వతం కూడా అవరోధాన్ని కలిగించదు. పర్వతాన్ని కూడా మనోరంజకంగా దాటివేస్తారు. అలాగే ఎగిరే కళలో ఉన్నవారికి పెద్ద పెద్ద సమస్యలు కూడా సహజమైపోతాయి.

నైరోబివారు తమ నెంబరును ముందు తీసుకుంటున్నారు కదా! ఇప్పుడు వి.ఐ.పి సేవలో ముందు నెంబరును తీసుకోవాలి. సంఖ్య అయితే బాగుంది ఇప్పుడు కాన్ఫరెన్స్ లో వి.ఐ.పి.లను ఎవరెవరు తీసుకువస్తారో చూద్దాము. ఇప్పుడు ఇందులో నెంబర్ తీసుకోవాలి. అందరికన్నా నెంబర్ వన్ వి.ఐ.పి.లను ఎవరు తీసుకువస్తారో ఇప్పుడు ఈ రేసును బాప్ దాదా చూస్తారు.

క్రొత్త హాలుకొరకు చిత్రాలను తయారుచేసే చిత్రకారులకు బాప్ దాదాల ప్రేరణలు:-

చిత్రకారులుగా అయి చిత్రాలను తయారుచేస్తున్నారా లేక స్వయం ఆ స్థితిలో స్థితులై చిత్రాలను తయారుచేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇంకెక్కడైనా చిత్రాలను తయారుచేస్తే ఆ చిత్రకారులు సాధారణ రీతిలో చిత్రాలను తయారుచేసేస్తారు. కాని, ఇక్కడ చిత్రాలను తయారుచేసే లక్ష్యము ఏమి? ఏ విధంగా బాబా చిత్రమును తయారుచేసినప్పుడు అందులో ఏ విశేషత ఉండాలి? చిత్రము చైతన్యమును ప్రత్యక్షము చేయాలి. చిత్రము ముందుకు వెళ్ళడంతోనే చిత్రమును చూడడంలేదు, చైతన్యంగా చూస్తున్నాము అని భావించాలి. చిత్రము జడముగా ఉన్నా చైతన్యముగా అనుభవమవ్వాలి, చిత్రము యొక్క విశేషత, దానికే ప్రైజ్ లభిస్తుంది. వాటిలో భావము ఇంకో విధంగా ఉంటుంది. కాని, ఆత్మిక చిత్రం యొక్క లక్ష్యము- చిత్రము ఆత్మను ప్రత్యక్షం చేయాలి, ఆత్మికతను అనుభవం చేయించాలి. ఇటువంటి అలౌకిక చిత్రకారులుగా ఉండాలి, లౌకికంగా కాదు. లౌకిక చిత్రకారులు లౌకిక విషయాలను, నయనాలను, రూపాన్ని చూస్తారు. కాని, ఇక్కడ ఆత్మికత అనుభవమవ్వాలి, ఇటువంటి చిత్రాన్ని తయారుచేయాలి. (ఆశీర్వాదాలు కావాలి). ఆశీర్వాదాలు ఆశీర్వాదాల గనిపైకి చేరుకున్నారు, అడుగవలసిన అవసరమే లేదు. అధికారమును తీసుకునే స్థానమిది. ఎప్పుడైతే వారసత్వ రూపంలో ప్రాప్తమవ్వగలదో అప్పుడిక కొద్ది ఆశీర్వాదాలే ఎందుకు? గనిపైకి వెళ్ళి రెండు పిడికిళ్ళు మాత్రమే తెచ్చుకుంటే దానిని ఏమంటారు? ఏ విధంగా బాబా స్వయం సాగరులో అలా పిల్లలను కూడా మాస్టర్ సాగరులుగా తయారుచేస్తారు కదా! సాగరంలో ఎటువంటి లోటూ ఉండదు, సదా నిండుగా ఉంటుంది. అచ్ఛా!

స్వీడన్ పార్టీతో:- ''సదా నిశ్చయబుద్ధి విజయీరత్నాలము'' అన్న ఇదే నషాలో సదా ఉండండి. నిశ్చయమురూపీ పునాది సదా పక్కాగా ఉందా? స్వయముపై నిశ్చయము, బాబాపై నిశ్చయము మరియు డ్రామాపై నిశ్చయం యొక్క ఆధారంపై ముందుకువెళుతూ ఉండండి. ఇప్పుడు ఏ విశేషతలైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచుకోండి, బలహీనతలను కాదు. కావున మీపైన మీకు విశ్వాసం ఉంటుంది. బలహీనతలతో కూడిన విషయాలను ఎక్కువగా ఆలోచించకండి అప్పుడు సంతోషంగా ముందుకువెళుతూ ఉంటారు. బాబా తోడును తీసుకునేవారు సదా ముందుకువెళతారు అన్న ఈ నిశ్చయమును ఉంచండి. బాబా సర్వశక్తివంతుడైనప్పుడు వారి చేయి పట్టుకునేవారు గమ్యస్థానాన్ని తప్పక చేరుకుంటారు. వారు స్వయం బలహీనంగా ఉన్నాకాని తోటివారైతే దృఢంగా ఉన్నారు కదా! కావున తప్పకుండా ఆవలి తీరానికి చేరుకుంటారు. సదా నిశ్చయబుద్ధి విజయీరత్నాలము అన్న స్మృతిలోనే ఉండండి. గతించింది ఏదో గతించిపోయింది, దానికి బిందువు పెట్టి ముందుకు వెళ్ళండి.

(పూనా నుండి వచ్చిన హరదేవి అక్కయ్య విదేశం వెళ్ళేందుకు బాప్ దాదా నుండి సెలవు తీసుకుంటున్నారు)

విశేష విధి ఏమి? మీరు ఏ పాలననైతే తీసుకున్నారో అదే పాలనను అందరికీ ఇవ్వండి. ప్రేమ మరియు శాంతి ఈ రెండు విషయాల ద్వారా అందరి పాలనను చేయండి. ప్రేమ అందరికీ కావాలి మరియు శాంతి కూడా అందరికీ కావాలి. ఈ రెండు కానుకలను అందరి కొరకు తీసుకొని వెళ్ళండి. కేవలం ప్రేమతో దృష్టిని ఇచ్చి, రెండు విషయాలు మాట్లాడితే వారు స్వతహాగానే సమీపంగా వస్తూ ఉంటారు. ఏవిధంగా పాలనను తీసుకున్నారో, పాలన యొక్క అనుభవీమూర్తులుగా ఎంతగానో ఉన్నారు కదా! అదే పాలన యొక్క అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించండి. టాపికుపై భాషణ చేయకపోయినా అన్నిటి కన్నా ఉన్నతోన్నతమైనది ప్రేమ మరియు శాంతి యొక్క అనుభూతి. కావున ఈ ఉన్నతోన్నతమైన దానిని ఇచ్చేయండి, తద్వారా ఇటువంటి ప్రేమ మాకు ఎప్పుడూ లభించనే లేదు, ఎప్పుడూ చూడనే లేదు అని ప్రతి ఆత్మ అనుభవం చేసుకోవాలి. ప్రేమ ఎటువంటిదంటే ఆ ప్రేమ అనుభవం వెనుక స్వతహాగానే ఆకర్షింపబడి వస్తారు. చాలా బాగుంది, ఆది మహావీరులు వెళుతున్నారు. సతి మరియు కుంజ్ కూడా వెళ్ళారు కదా! పాలనా స్వరూపులు వెళుతున్నారు. చాలా బాగుంది, వీరి ద్వారా సాకారునితో సహజముగా సంబంధము జోడింపబడుతుంది. ఎందుకంటే వీరి రోమ రోమములో బాబా పాలన ఇమిడి ఉంది. కావున నడుస్తూ తిరుగుతూ లోపల ఎవరైతే ఇమిడి ఉన్నారో వారే కనిపిస్తారు. మీ ద్వారా బాబా పాలన యొక్క అనుభూతి కలుగుతుంది, సంతోషంగా వెళ్ళండి. పిల్లలు వెళ్ళడము బాప్ దాదాకు కూడా సంతోషము ఎందుకంటే విహారయాత్రలకైతే వెళ్ళడంలేదు, యజ్ఞములో ఎముకలు సైతం స్వాహా చేసే సేవాధారులు, వారి ఒక్కొక్క అడుగులో సేవ ఇమిడి ఉంటుంది. కావున పిల్లలు చక్రవర్తులుగా అవ్వడం బాప్ దాదాకు సంతోషమే.

బాప్ దాదా పిల్లలందరిపట్ల ప్రియస్మృతులను ప్రేమలో నింపారు. లగ్నములో మగనమయ్యే పిల్లలందరికీ ప్రియస్మృతులతోపాటు బాప్ దాదా పిల్లలందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి సదా హర్షితులవుతారు. పిల్లలందరి ప్రియస్మృతులు మరియు పురుషార్థం యొక్క ఉల్లాస ఉత్సాహాలు మరియు విఘ్నవినాశకులుగా అయ్యే పత్రాలు బాప్ దాదా ముందుకు వచ్చాయి మరియు బాప్ దాదా విఘ్నవినాశకులైన పిల్లలందరికీ ప్రియస్మృతులు తెలుపుతున్నారు మరియు సదా మాయాజీతులుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా, స్మృతి యొక్క సీటుపై స్థితులై డబుల్ లైటుగా అయి ఎగురుతూ మరియు ఎగిరిస్తూ ఉండండి. కావున నలువైపులా ఉన్న కేవలం విదేశీయులే కాదు హృదయ సింహాసనాధికారులైన పిల్లలందరికీ హృదయభిరాముడైన బాబా తరఫున చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.