సహజయోగి మరియు ప్రయోగీలను గూర్చిన వ్యాఖ్య.
ఈరోజు బాప్ దాదా తమ ప్రయోగి భుజాలను చూస్తున్నారు. ఏ
విధంగా నా సహయోగి భుజాలు శ్రేష్ఠ కార్యమును సఫలం చేస్తున్నారు అని
గమనిస్తున్నారు. ప్రతి భుజం యొక్క దివ్య అలౌకిక కార్యపు వేగమును చూసి బాప్ దాదా
హర్షితులై ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. కొందరు భుజాలు సదా అలసట లేనివారిగా
మరియు ఒకే శ్రేష్ఠ ఉల్లాస ఉత్సాహాలు కలిగి తీవ్రగతితో సహయోగులుగా ఉండడం,
మరికొందరు కార్యము చేస్తూ ఉంటారు కాని మధ్య మధ్యలో ఉల్లాస ఉత్సాహాల తీవ్రగతిలో
తేడా వచ్చేయడం బాప్ దాదా గమనించారు. కాని సదా అలసట లేకుండా తీవ్రగతిలో ఉండే
భుజాల ఉల్లాస ఉత్సాహాలను చూస్తూ వీరు కూడా తీవ్రగతితో కార్యమును చేయడం
ప్రారంభిస్తారు, పరస్పర సహయోగం ద్వారా వారి వేగమును తీవ్రతరం చేసుకుంటూ ముందుకు
నడుస్తున్నారు.
బాప్ దాదా ఈరోజు మూడు రకాల పిల్లలను చూస్తున్నారు.
ఒకరు సదా సహజ యోగులు, రెండవవారు- విధిని పదే పదే ప్రయోగంలోకి తీసుకువచ్చే
ప్రయోగులు. మూడవవారు- సహయోగులు. ముగ్గురూ యోగులే కాని భిన్న భిన్న స్థితులలో
ఉన్నారు. సహజ యోగులు సమీప సంబంధము మరియు సర్వప్రాప్తులు కలిగి ఉన్న కారణంగా సదా
స్వతహాగా సహజయోగ స్థితిని అనుభవం చేసుకుంటారు. సదా సమర్థ స్వరూపము ఉన్న కారణంగా
నేను ఉన్నదే బాబాకు చెందిన ఆత్మగా అన్న అనుభవపు నషాలో సదా ఉంటారు. నేను ఆత్మను,
నేను బాబా సంతానమును అని గుర్తు చేసుకోవలసిన అవసరం ఉండదు. నేను ఉన్నదే అలా అని
సదా స్వయమును ఈ అనుభవపు నషాలో సహజంగానే ప్రాప్తీ స్వరూపంగా నిశ్చయం చేసుకుంటారు.
సహజ యోగులకు సర్వసిద్ధులు స్వతహాగానే అనుభవమవుతాయి. కావున సహజ యోగులు సదా
శ్రేష్ఠ ఉల్లాస ఉత్సాహాల సంతోషంలో ఏకరసముగా ఉంటారు. సహజ యోగులు సర్వప్రాప్తుల
అధికారీ స్వరూపంలో సదా శక్తిశాలీ స్థితిలో స్థితులై ఉంటారు. ప్రయోగం చేసే
ప్రయోగులు సదా ప్రతి స్వరూపం యొక్క, ప్రతి పాయింట్ యొక్క, ప్రతి ప్రాప్తీ
స్వరూపం యొక్క ప్రయోగమును చేస్తూ ఆ స్థితిని అనుభవం చేసుకుంటారు. కాని కాసేపు
సఫలతను అనుభవం చేసుకుంటారు మరి కాసేపు శ్రమను అనుభవం చేసుకుంటారు. కాని
ప్రయోగులుగా ఉన్న కారణంగా, బుద్ధి అభ్యాసపు ప్రయోగశాలలో బిజీగా ఉన్న కారణంగా 75
శాతం మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కారణమేమిటి? ప్రయోగి ఆత్మలకు క్రొత్త
క్రొత్త, భిన్న భిన్న అనుభవాలను పొంది చూడాలన్న అభిరుచి ఉంటుంది. ఈ అభిరుచిలోనే
ఉన్న కారణంగా ప్రయోగశాలలో మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కాని, ఏకరసముగా ఉండరు.
అప్పుడప్పుడు అనుభవం కలిగిన కారణంగా చాలా ఉల్లాస ఉత్సాహాలలో ఊగుతూ ఉంటారు,
మరికాసేపు విధి ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి తక్కువగా కలిగిన కారణంగా ఉల్లాస
ఉత్సాహాలలో తేడా వచ్చేస్తుంది. ఉల్లాస ఉత్సాహాలు తక్కువగా ఉన్న కారణంగా కష్టం
అనుభవమవుతుంది కావుననే ఒక్కోసారి సహజయోగులుగా, మరోసారి శ్రమించే యోగులుగా
అయిపోతారు. నేను ఉన్నదే అలాగా అని అనేందుకు బదులుగా 'ను, ను' అని అంటూ ఉంటారు.
నేను ఆత్మను, బాబా సంతానమును, మాస్టర్ సర్వశక్తివంతుడను... ఈ స్మృతి ద్వారా
సిద్ధిని పొందేందుకు పదే పదే ప్రయత్నము చేయవలసి వస్తుంది. కావున అప్పుడప్పుడు
సంకల్పించగానే అనుభవమయ్యే స్థితిలో స్థితులవుతారు మరియు అప్పుడప్పుడు పదే పదే
ఆలోచించడం ద్వారా స్వరూపపు అనుభూతిని పొందుతారు. వీరినే ప్రయోగి ఆత్మలు అని
అంటారు. అధికారపు స్వరూపము సహజయోగి స్వరూపము. పదే పదే అధ్యయనము చేసే స్వరూపము
ప్రయోగి ఆత్మా స్వరూపము. కావున ఈరోజు సహజయోగులు ఎవరు మరియు ప్రయోగులు ఎవరు అని
గమనిస్తున్నారు. ప్రయోగులు కూడా అప్పుడప్పుడు సహజయోగులుగా అయిపోతారు కాని సదా
అలా అవ్వరు. ఏ సమయంలో ఏ పొజిషన్ ఏర్పడుతుందో దాని అనుసారంగానే స్థూలమైన
ముఖకవళికలు కూడా మారుతాయి. మనస్సు యొక్క పొజిషన్ ను కూడా చూస్తారు మరియు ఫోజును
కూడా చూస్తారు. రోజంతటిలో ఎన్ని ఫోజులను మారుస్తారు? మీ భిన్న భిన్న ఫోజులను
గూర్చి మీకు తెలుసా? స్వయమును సాక్షిగా అయి చూస్తారా? బాప్ దాదా సదా ఈ బేహద్
ఆటను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తూ ఉంటారు. ఏ విధంగా ఇక్కడ లౌకిక ప్రపంచంలో
ఒక్కరినే భిన్న భిన్న ఫోజులలో నవ్వు పుట్టించే ఆటలలో స్వయమే చూసుకుంటారు కదా!
విదేశాలలో ఈ ఆటలు ఉంటాయా? ఇక్కడ ప్రాక్టికల్ గా ఇటువంటి ఆటలనైతే ఆడరు కదా!
ఇక్కడ కూడా అప్పుడప్పుడు భారము కారణంగా లావుగా అయిపోతారు, మళ్ళీ అప్పుడప్పుడు
ఎక్కువగా ఆలోచించే సంస్కారము కారణంగా అందాజా కన్నా పొడుగ్గా అయిపోతారు, మళ్ళీ
అప్పుడప్పుడు నిరుత్సాహం కారణంగా స్వయమును చాలా చిన్నగా చూస్తారు. ఒక్కోసారి
చిన్నగా అయిపోతారు, ఒక్కోసారి లావుగా అయిపోతారు మరోసారి పొడుగ్గా అయిపోతారు. మరి
ఇటువంటి ఆట మీకు మంచిగా అనిపిస్తుందా?
డబల్ విదేశీయులందరూ సహజ యోగులేనా? ఈరోజు ఈ సహజయోగి
యొక్క చార్ట్ ఉందా? కేవలం ప్రయోగంచేసే ప్రయోగిలుగా మాత్రమే లేరు కదా! డబల్
విదేశీయులు మధువనం నుండి సదాకాలికంగా సహజయోగులుగా ఉండే అనుభవమును తీసుకొని
వెళుతున్నారా? అచ్ఛా- సహయోగులు కూడా యోగులే, దీనిని గూర్చి మరింకెప్పుడైనా
వినిపిద్దాము.
టీచర్లందరూ క్రింద హాలులో మురళి వింటున్నారు.
బాప్ దాదాతో పాటు నిమిత్త సేవాధారులు అనండి, నిమిత్త
శిక్షకులు అనండి కావున ఈరోజు సహచరుల గ్రూప్ కూడా వచ్చింది కదా! చిన్నవారైతే ఇంకా
అతిప్రియంగా అనిపిస్తారు. క్రింద ఉన్నా కూడా అందరూ పైనే కూర్చున్నారు. బాప్ దాదా
చిన్న అయినా లేక పెద్ద అయినా ధైర్యమును ఉంచే, సేవా క్షేత్రంలో స్వయమును సదా
బిజీగా ఉంచుకునే సేవాధారులకు చాలా చాలా ప్రియస్మృతులను తెలియజేస్తున్నారు.
కావున త్యాగులుగా అయి అనేకుల భాగ్యమును తయారుచేసేందుకు నిమిత్తంగా అయ్యే
సేవాధారులను బాప్ దాదా త్యాగం యొక్క విశేష ఆత్మలుగా గమనిస్తున్నారు. ఇటువంటి
విశేష ఆత్మలకు విశేష రూపంలో అభినందనలతోపాటు ప్రియస్మృతులు కూడా. డబల్ అద్భుతము
ఏమి? ఒకటేమో- బాబాను తెలుసుకునే అద్భుతము. దూరదేశము, ధర్మము యొక్క పరదా, ఆచార
వ్యవహారాలు, అన్నపానాదులు అన్నింటి భిన్నత యొక్క పరదా మధ్య ఉంటూ కూడా తండ్రిని
తెలుసుకున్నారు, కావున ఇది డబల్ అద్భుతము. పరదా లోపల దాగి ఉన్నారు. సేవ కొరకు
ఇప్పుడు జన్మ తీసుకున్నారు. పొరపాటు చేయలేదు, కాని డ్రామానుసారంగా సేవా
నిమిత్తము నలువైపులా చెల్లాచెదురైపోయారు. లేకపోతే ఇన్ని దేశాలలో సేవ ఎలా
జరుగుతుంది? కేవలం సేవ కారణంగా తమ కొద్ది సమయపు నామమాత్రపు లెక్కాచారాలను అక్కడ
జోడించారు. కావున డబల్ అద్భుతమును చూపించేవారు సదా బాబా స్నేహపు ఛాత్రకులు, సదా
హృదయంతో 'నా బాబా' అన్న గీతమును గానం చేసేవారు, సంవత్సరంలో 12 నెలలు బాబా వద్దకు
వెళ్ళాలి, వెళ్ళాలి అనే ఇదే ధునిలో ఉండేవారు ఇటువంటి ధైర్యమును ఉంచి బాప్
దాదాలకు సహాయకులుగా అయ్యే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులైన అక్కయ్యలు, అన్నయ్యలతో:- మహాయజ్ఞపు మహా
సేవ యొక్క ప్రసాదమును తిన్నారా? ఈ ప్రసాదము ఎప్పుడూ తగ్గేది కాదు. ఇటువంటి
అవినాశి మహాప్రసాదమును ప్రాప్తింపజేసుకున్నారా? ఎంత వెరౖటీ ప్రసాదము లభించింది!
సదాకాలికంగా సంతోషము, సదాకాలికమైన నషా, అనుభూతి... ఇలా అన్నిరకాలైన ప్రసాదాలను
పొందారా? కావున ప్రసాదమును పంచుకొని తినడం జరుగుతుంది. ప్రసాదమును కళ్ళకు
అద్దుకొని, మస్తకంపై ఉంచుకొని తినడం జరుగుతుంది. కావున ఈ ప్రసాదము మీ కళ్ళలో
ఇమిడిపోవాలి, మస్తకం యొక్క స్మృతి స్వరూపంగా అయిపోవాలి అనగా మీలో ఇమిడిపోవాలి.
ఇటువంటి ప్రసాదము ఈ మహాయజ్ఞంలో లభించిందా? మహాప్రసాదమును తీసుకునేవారు ఎంత మహాన్
భాగ్యవంతులు. ఇటువంటి అవకాశము ఎంతమందికి లభిస్తుంది? చాలా కొద్దిమందికి
లభిస్తుంది, ఆ కొద్దిమందిలో మీరూ ఉన్నారు. మరి మీరు మహాన్ భాగ్యవంతులుగా
అయిపోయినట్లే కదా! ఏవిధంగా ఇక్కడ బాబా మరియు సేవ తప్ప మూడవదేదీ గుర్తుండదో అలా
ఇక్కడి ఈ అనుభవమును సదా నిల్పుకొని ఉంచుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
విశేషంగా అక్కడి నుండి ఏదో ఒక గుర్తును తీసుకొని వెళతారు. కావున మధువనం యొక్క
విశేష స్మృతిచిహ్నంగా ఏమి తీసుకువెళతారు? నిరంతరము సర్వప్రాప్తీ స్వరూపంగా
ఉంటారా? కావున అక్కడకు వెళ్ళి కూడా అలాగే ఉంటారా లేక వాయుమండలం అలా ఉంది,
సాంగత్యం అలా ఉంది అని అంటారా! పరివర్తన భూమి నుండి పరివర్తన అయి వెళ్ళాలి.
ఎటువంటి వాయుమండలం ఉన్నాకాని మీరు మీ శక్తితో పరివర్తన చేసెయ్యండి. ఇంతి శక్తి
ఉంది కదా! వాయుమండలపు ప్రభావము మీపై పడకూడదు. అందరూ సంపన్నంగా అయి వెళ్ళాలి.
అచ్ఛా!
మాతలతో:- మాతలకొరకైతే ఇది ఎంతో సంతోషకరమైన విషయము.
ఎందుకంటే బాబా వచ్చిందే మాతలకొరకు. గోపాలునిగా అయి గోమాతల కొరకు వచ్చారు. దీని
స్మృతిచిహ్నమే గాయనం చేయబడ్డది. ఎవరినైతే ఎవ్వరూ యోగ్యంగా భావించలేదో
అటువంటివారినే బాబా యోగ్యంగా భావించారు. ఇదే సంతోషంలో సదా ఎగురుతూ ముందుకు
వెళ్ళండి. ఎటువంటి దు:ఖపు అల రాజాలదు. ఎందుకంటే సుఖసాగరుని పిల్లలుగా అయిపోయారు.
సుఖసాగరంలో ఇమిడిపోయి ఉండేవారికి ఎప్పుడూ దు:ఖపు అల రాజాలదు, ఇటువంటి
సుఖస్వరూపులుగా అవ్వాలి.