12.01.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'సదా సమర్థంగా ఆలోచించండి, సమర్థంగా మాట్లాడండి ( వర్ణన చెయ్యండి ) ''

ధ్వనికి అతీతంగా ఉండే తండ్రి తన పిల్లలందరిని ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలోకి తీసుకెళ్ళేందుకు ఈ రోజు ధ్వని ప్రపంచంలోకి వచ్చారు. ఎందుకంటే ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలో అతి సుఖ-శాంతులు అనుభవం అవుతాయి. ధ్వనికి అతీతమైన శ్రేష్ఠ స్థితిలో స్థితులైతే సదా స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్న స్థితిలో అనుభవం చేస్తారు. ఈనాటి మానవులు ధ్వనికి అతీతంగా సత్యమైన శాంతి కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో సాధనాలను ప్రయోగిస్తున్నారు. కానీ మీరందరూ శాంతిసాగరుని పిల్లలు శాంత స్వరూపులు, మాస్టర్ శాంతి సాగరులు. సెకండులో తమ శాంతి స్వరూప స్థితిలో స్థితులవుతారు. ఇలాంటి అనుభవీలుగా ఉన్నారు కదా! సెకండులో శబ్ధములోకి రావడం మరియు సెకండులో శబ్ధానికి అతీతంగా స్వధర్మంలో స్థితులవ్వడం - ఈ అభ్యాసం ఉందా? ఈ కర్మేంద్రియాలకు అధిపతులు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి రండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మకు అతీతంగా కర్మాతీత స్థితిలో స్థితులవ్వండి. ఇప్పుడిప్పుడే అతీతంగా మరియు ఇప్పుడిప్పుడే కర్మ ద్వారా సర్వులకు ప్రియమైనవారని వీరినే అంటారు. ఇలాంటి నిగ్రహ శక్తి(కంట్రోలింగ్ పవర్), పాలనా శక్తి(రూలింగ్ పవర్) అనుభవం అవుతున్నాయి కదా! ఏ విషయాలనైతే ప్రపంచంలోని మానవులు కష్టమని అంటారో ఆ కష్టమైన విషయాలు శ్రేష్ఠ ఆత్మలైన మీకు కేవలం సహజమే కాదు, అతి సహజము. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వ శక్తివంతులు, ప్రపంచంలోని మానవులైతే ఇదెలా సాధ్యమని అనుకుంటారు. ఈ సంశయంలోనే బుద్ధి ద్వారా, శరీరం ద్వారా భ్రమిస్తూ ఉంటారు. కాని మీరు ఏమంటారు? ఎలా అవుతుంది? అనే సంకల్పం ఎప్పుడైనా రాగలదా? ఎలా అని అంటున్నారంటే అది ప్రశ్నార్థకం! కావున ఎలా అనేందుకు బదులు మళ్ళీ ఇలా అవుతుంది అనే శబ్ధము వస్తుంది. ఇలా అనగా ఫుల్స్టాప్. ప్రశ్నార్థకం మారిపోయి ఫుల్స్టాప్ పెట్టబడింది కదా! నిన్న ఎలా ఉండేవారు ఈరోజు ఎలా ఉన్నారు! రెండిటికి మహాన్ అంతరము (తేడా) ఉంది కదా! మహాన్ తేడా వచ్చిందని భావిస్తున్నారు కదా! నిన్నటి వరకు ఓ భగవంతుడా! అని అనేవారు కాని ఈ రోజు 'ఓ' అని అనేందుకు బదులు 'ఓహో' అని అంటున్నారు. ఓహో మధురమైన బాబా! అని అంటున్నారు. భగవంతుడు కాదు, బాబా. దూరం నుండి కాక, దగ్గరగా తండ్రి లభించారు. మీరు తండ్రిని వెతికారు, తండ్రి కూడా పిల్లలైన మిమ్ములను మూల మూలల నుండి వెతుక్కున్నారు. కానీ తండ్రికి కష్టపడవలసిన అవసరం రాలేదు. మీరు చాలా శ్రమ చేయవలసి వచ్చింది ఎందుకంటే తండ్రికి పరిచయం ఉంది, మీకు పరిచయం లేదు, మీరందరూ స్నేహంతో పాటలు పాడ్తారు. బాప్దాదా కూడా పిల్లల పై స్నేహంతో పాటలు పాడ్తారు. అన్నిటికంటే గొప్ప కంటే గొప్ప స్నేహ పాటను బాప్దాదా రోజూ పాడ్తారు. ఈ పాటను విని విని స్నేహీ పిల్లలందరి మనసు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది. రోజూ పాటలు పాడుతూ ఉంటారు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా పాట మహత్వం చాలా శ్రేష్ఠంగా ఉంది. తండ్రి పాటకు స్మృతి చిహ్నంగా 'గీత' ను తయారు చేశారు. అంతేకాక పిల్లల పాటను విని సంతోషంతో నాట్యం చెయ్యడం మరియు సంతోషంలో, ఆనందంలో, సుఖంలో భిన్న-భిన్న అనుభవాలకు స్మృతి చిహ్నంగా భాగవతాన్ని తయారు చేశారు. కావున ఇరువురి స్మృతిచిహ్నాలు తయారయ్యాయి కదా! ఇలాంటి శ్రేష్ఠ భాగ్యవంతులుగా స్వయాన్ని భావిస్తున్నారా! లేక అనుభవం చేస్తున్నారా! భావించేవారు అనేకమంది ఉంటారు. కాని అనుభవం చేసేవారు కోట్లలో కొంతమందే ఉంటారు. అనుభవీ మూర్తులు తండ్రి సమానం సంపన్న అనుభవీ మూర్తులుగా ఉంటారు. ప్రతి మాట, ప్రతి సంబంధము అనుభవమవ్వాలి. సంబంధం ద్వారా భిన్న-భిన్న ప్రాప్తులు అనుభవమవ్వాలి. ప్రతి శక్తి అనుభవమవ్వాలి, ప్రతి గుణము అనుభమవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గుణాలనే నగలను ధారణ చెయ్యగలరు. ఇవి సర్వగుణాల వెరైటీ నగలు. ఎలాంటి సమయమో, ఎలాంటి స్థానమో అలాంటి గుణాల నగలతో స్వయాన్ని అలంకరించుకోగలరు. కేవలం స్వయానికే కాదు, కానీ ఇతరులకు కూడా గుణాలను దానం చెయ్యగలరు. జ్ఞానదానంతో పాటు గుణ దానానికి కూడా మహత్వముంది. గుణాలను మహాదానం చేసే ఆత్మ ఎప్పుడైనా ఎవరి అవగుణాలను చూస్తున్నా ధారణ చెయ్యదు. ఎవ్వరి అవగుణాల సాంగత్య దోషంలోకి రారు. ఇంకా గుణాల దానం ద్వారా ఇతరుల అవగుణాలను గుణాలలోకి పరివర్తన చేస్తారు. ఎలాగైతే ధనం లేని భికారులకు ధనం ఇచ్చి సంపన్నులుగా తయారు చేస్తారో అలా అవగుణాలు ఉన్నవారికి గుణ దానం ఇచ్చి గుణమూర్తులుగా చెయ్యండి. ఎలాగైతే యోగదానం, శక్తుల దానం, సేవ దానం ప్రసిద్ధంగా ఉందో, అలా గుణ దానం కూడా విశేషమైన దానము. గుణ దానం ద్వారా ఆత్మలో ఉత్సాహ-ఉల్లాసాల మెరుపును అనుభవం చేయించగలరు. కావున ఇలాంటి సర్వ మహాదానీ మూర్తులుగా అనగా అనుభవీ మూర్తులుగా అయ్యారా?

ఈ రోజు విశేషించి డబల్ విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. డబల్ విదేశీ పిల్లల విశేషతనైతే బాప్దాదా వినిపించారు. అయినా బాప్దాదా డబల్ విదేశీ పిల్లలను దూరదేశి బుద్ధి గల పిల్లలని అంటారు. దూరంగా ఉన్నా బుద్ధి ద్వారా తండ్రిని గుర్తించి అధికారులుగా అయ్యారు. ఇలాంటి దూరదేశి బుద్ధి కలిగిన పిల్లల పై విశేషత అనుసారంగా బాప్దాదాకు విశేషమైన స్నేహం ఉంది. అందరూ దీపపు పురుగులుగా అయ్యి తమ తమ దేశాల నుండి ఎగురుతూ, ఎగురుతూ దీపము పై ఆహుతి అయ్యేవారా లేక ఎవరైనా కేవలం భ్రమణం చేసేవారిగా కూడా ఉన్నారా? ఆహుతి అవ్వడం అనగా సమానంగా అవ్వడం కావున ఆహుతి అయ్యేవారా? లేక కేవలం భ్రమణం చేసేవారా? ఎక్కువ సంఖ్య ఎవరిది? ఎవరు ఎలా ఉన్నా బాప్దాదాకు ఇష్టమైనవారిగా ఉన్నారు. అయినా ఎంత కష్టపడి చేరుకున్నారో చూడండి. అందువలన సదా స్వయాన్ని మేము తండ్రికి చెందినవారమని అంతేకాక సదా తండ్రివారిగానే ఉంటామని భావించండి. ఈ దృఢ సంకల్పము మిమ్ములను సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. బలహీనతలను గురించి ఎక్కువగా ఆలోచించకండి. బలహీనతలను ఆలోచిస్తూ ఆలోచిస్తున్నా ఇంకా బలహీనంగా అవుతారు. నేను రోగిని, నేను రోగిని అని అనుకుంటూ ఉంటే ఇంకా డబుల్ రోగిగా అవుతారు. నేను అంత శక్తిశాలిగా లేను, నా యోగం అంత మంచిగా లేదు, నా సేవ అంత మంచిగా లేదు, నేను బాబాకు ప్రియంగా ఉన్నానా లేదా? నేను ముందుకు వెళ్లగలనో లేదో తెలియదు.... ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువ బలహీనంగా చేస్తాయి. మొదట మాయ తేలిక రూపంలో ప్రయత్నం చేస్తుంది, మీరు దానిని పెద్ద రూపంగా చేస్తారు. కనుక మాయకు మీ సాథీగా(స్నేహీగా) అయ్యే అవకాశం లభిస్తుంది. అది కేవలం ప్రయత్నిస్తుంది కానీ దాని ప్రయత్నాన్ని అర్థము చేసుకోకుండా నేను ఇలాగే ఉన్నానని భావిస్తారు. అందువలన అది కూడా మీకు తోడుగా అవుతుంది. బలహీనతలకు తోడుగా మాయ ఉంటుంది. ఎప్పుడూ బలహీన సంకల్పాలను మాటిమాటికి వర్ణన చెయ్యకండి, ఆలోచించకండి. మాటిమాటికి ఆలోచించినా స్వరూపంగా అయిపోతారు. సదా నేను బాబాకు చెందినవాడిగా అవ్వకుంటే ఎవరు అవుతారు అని ఆలోచించండి. నేనే ఉన్నాను ఇప్పుడు నేనే అలా ఉన్నాను. కల్ప-కల్పం నేనే అవుతాను. ఈ సంకల్పం ఆరోగ్యవంతులుగా, మాయాజీతులుగా చేస్తుంది. బలహీనత తర్వాత వస్తుంది. మీరు దానిని గుర్తించకుండా సత్యంగా భావిస్తారు కనుక మాయ తనదిగా చేసుకుంటుంది. ఎలాగైతే సీత డ్రామాను చూపిస్తారు కదా! భికారి(బిక్షగాడు) కాడు కానీ సీత భికారిగా భావించింది. అతడు కేవలం ప్రయత్నం చేసేందుకు వచ్చాడు కాని సీత దానిని నిజమని భావించింది. అందువలన అతడు ఆమె అమాయకత్వాన్ని చూసి తనదానిగా చేసుకున్నాడు. ఇవి కూడా వ్యర్థ సంకల్పాలు, బలహీన సంకల్పాలు మాయ రూపంగా అయ్యి ప్రయత్నం చేసేందుకు వస్తాయి. కానీ మీరు అమాయకులైపోతారు. అందువలన అది తనవారిగా చేసుకుంటుంది. ''నేను ఉన్నదే ఇలాగా'' అని అనుకుంటూ ఉంటారు. మాయ తన స్థానాన్ని తయారు చేసుకుంటుంది. మీరు ఇలాంటి బలహీనులు కారు, సమర్థులు. మాస్టర్ సర్వ శక్తివంతులు. బాప్దాదా కోట్ల నుండి ఎన్నుకున్న కొద్దిమంది పిల్లలు. ఇటువంటి వారు బలహీనులుగా ఎలా అవ్వగలరు! బలహీనంగా ఆలోచించడమే మాయకు స్థానం ఇవ్వడం. స్థానం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ బయటకు తీయండి అని ఎందుకు అంటున్నారు. అసలు స్థానం ఎందుకు ఇస్తారు, ఏ బలహీనతా లేదు. అందరూ మాస్టర్లు(యజమానులు) సదా మహావీరులు. సదాకాలం కొరకు మహావీరులుగానే ఉంటారు. ఇదే శ్రేష్ఠ సంకల్పం ఉంచుకోండి. సదా తండ్రికి తోడుగానే ఉంటారు. ఎక్కడ తండ్రికి తోడుగా ఉన్నారో అక్కడ మాయ మిమ్ములను తోడుగా చేసుకోలేదు. మధువనానికి ఎందుకు వచ్చారు?(మాయను వదిలేయడానికి) మధువనం మహా యజ్ఞం కదా! కావున మహాయజ్ఞంలో స్వాహా చేసేందుకు వచ్చారు. అయితే బాప్దాదా, అందరూ తమ విజయాష్టమి జరుపుకునేందుకు వచ్చారని అంటున్నారు. విజయ తిలకాన్ని దిద్దుకునే ఉత్సవం జరుపుకునేందుకు వచ్చారు. విజయులుగా అయ్యి విజయ తిలకాన్ని దిద్దుకునే ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు అవును కాపీ చేసేందుకు అందరూ తెలివిగలవారిగా ఉన్నారు కదా! ఇది కూడా గుణమే. ఇక్కడ కూడా తండ్రిని కాపీ చెయ్యాలి. ఫాలో చెయ్యడం అనుసరించడము - అనగా కాపీ చెయ్యడము. ఇది సహజం కదా! మీరు మీ దేశం వదిలి వస్తారు కావున బాప్దాదా కూడా తన దేశాన్ని వదిలి వస్తారు.

బాప్దాదాకు కుటుంబం లేదా ఏమిటి? మొత్తం విశ్వ కార్యాన్నంతా వదిలి ఇక్కడకు వస్తారు. విశ్వ పరివారమంతా తండ్రి పరివారమే. తండ్రికేమో అందరూ పిల్లలే. దోసిలి అయితే అందరికీ ఇవ్వాలి. వారసత్వం ఇవ్వరు. దోసిలి అయితే ఇస్తారు కదా. మంచిది.

సర్వ శ్రేష్ఠ అధికారులకు, తండ్రి సమానంగా సదా మహాదానీ, వరదానీ ఆత్మలకు, సదా మహాన్ తేడా ద్వారా స్వయాన్ని మహోన్నతంగా అనుభవం చేయువారు సదా మాయను గుర్తించి మాయాజీతులుగా అయ్యేవారికి, సర్వశక్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపులా దేశ-విదేశాలలో ఉన్నవారికి, లగనంలో నిమగ్నం అయ్యే వారికి, తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేవారికి, తండ్రితో మిలనం జరుపుకునే వారికి, ప్రియ స్మృతులను ఉత్తరాల ద్వారా పంపేవారికి కొంచెం మధురాతి మధురమైన సమాచారం మరియు స్వ పురుషార్థము గురించి స్నేహపూర్వక సమాచారం ఇచ్చే, పిల్లలందరినీ బాప్దాదా సన్ముఖంలో చూసి ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అంతేకాక దీపపు పురుగులుగా అయ్యి జ్యోతికి ఆహుతి అయ్యేవారు అనగా ప్రతి అడుగులో తండ్రి సమానంగా అయ్యే పిల్లలకు స్నేహ - సంపన్న ప్రియ స్మతులు మరియు నమస్తే.

మహారథి సోదరీ - సోదరుల పట్ల ఉచ్ఛరించిన అవ్యక్త మహావాక్యాలు :-

సేవకు నిమిత్తంగా అయిన పిల్లల మాల కూడా ఉంది కదా! విశేష రత్నాలందరూ నిమిత్తంగా అయ్యారు. నిమిత్తంగా అయ్యే విశేషత నిమిత్తంగా చేస్తుంది. బ్రహ్మబాబాకు మీ అందరి పైన ఒక్క విషయం గురించిన గర్వం ఉంది. ఏ విషయం గురించి విశేషమైన సంతోషం ఉంది? పిల్లలందరూ ఒకరు ఇంకొకరితో ఆలోచనలు కలుపుకుంటూ ఆది నుండి ఐకమత్య రూపాన్ని చూపించారు. దీని పై బ్రహ్మాబాబాకు విశేషమైన గర్వం ఉంది. ఐకమత్యము బ్రాహ్మణ పరివారం యొక్క పునాది. అందువలన బ్రహ్మాబాబా అవ్యక్త వతనంలో ఉంటున్నా పిల్లల పై గర్వం ఉంది. కార్య వ్యవహారాలు చూస్తూ ఉంటారు కదా!

లండన్ గ్రూపుతో :- సదా ఆత్మిక గులాబీపుష్పాలుగా అయ్యి ఇతరులకు కూడా సుగంధాన్ని ఇచ్చే అవినాశీ తోటలోని పుష్పాలుగా ఉన్నారు కదా! అందరూ ఆత్మిక గులాబీపుష్పాలు. ఈ ఆత్మిక గులాబీపుష్పాలను చూసి మొత్తం విశ్వమంతా ఆకర్షించబడ్తోంది. ఒక్కొక్క ఆత్మిక గులాబీపుష్పము ఎంత విలువైనది, అమూల్యమైనది! ఇప్పటివరకు తమ జడ చిత్రాలకు కూడా విలువ ఉంది. ఒక్కొక్క జడ చిత్రాన్ని ఎంత విలువతో తీసుకుంటారు లేక ఇస్తారు! సాధారణ రాయి లేక వెండి లేక బంగారం అయినా ఆ చిత్రాలకు ఎంత విలువ ఉంది! బంగారు మూర్తిని ఎంత విలువలో ఇస్తారు. ఇంత విలువైనవారిగా ఎలా అయ్యారు! ఎందుకంటే తండ్రివారిగా అవ్వడం వలన సదాకాలం కొరకు శ్రేష్ఠంగా అయ్యారు. ఇదే భాగ్యం యొక్క పాటలు సదా పాడుతూ ఉండండి. ''ఓహో(వాహ్) నా భాగ్యము, ఓహో భాగ్యవిధాత, మరియు ఓహో సంగమ యుగము! ఓహో మధరమైన డ్రామా!'' అన్నింటిలో ఓహో ఓహో అనే మాట వస్తుంది కదా,........ వాహ్ వాహ్ పాటలు పాడుతూ ఉంటారు కదా. బాప్దాదాకు లండన్ నివాసుల పై గర్వముంది. సేవా వృక్షానికి బీజం లండన్. కావున లండన్ నివాసులు కూడా బీజరూపులుగా అయ్యారు. యు.కెవారు అనగా సదా ఓ.కెగా ఉండేవారు. సదా చదువు మరియు సేవ రెండిటి బ్యాలెన్స్ ఉంచేవారు. సదా ప్రతి అడుగులో ఉన్నతిని అనుభవం చేయువారు. ఎప్పుడైతే తండ్రివారిగా అయ్యారో అప్పుడు సదా మీకు తండ్రి తోడు మరియు తండ్రి హస్తము ఉంది. ప్రతి పుత్రుని పై ఉంది అని అనుభవం చేస్తున్నారు కదా! ఎవరి పై తండ్రి చేయి ఉందో, వారు సదా సురక్షితంగా ఉంటారు. మీరు సదా సురక్షితంగా ఉండేవారే కదా! ఓ.కె గ్రూపువారి దగ్గరకు మాయ రావడం లేదు కదా! మాయ కూడా సదా ఓ.కె, ఓ.కె అని వీడ్కోలు ఇచ్చి వెళ్లిపోతుంది. యు.కె అనగా ఓ.కె గ్రూపుకు సాంగత్యం కూడా చాలా శ్రేష్ఠంగా ఉంది కదా! సాంగత్యం మంచిదిగా, వాయుమండలం శక్తిశాలిగా ఉంటే మాయ ఎలా రాగలదు. సదాకాలం కొరకు సురక్షితంగా ఉంటారు. ఓ.కె గ్రూప్ అనగా మాయాజీత్ గ్రూప్.

మరీషియస్ పార్టీ :- సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యశాలురుగా భావిస్తున్నారా? భాగ్యంలో ఏమి లభించింది? భగవంతుడే భాగ్యంలో లభించారు. స్వయం భాగ్యవిధాత అయిన భగవంతుడు భాగ్యంలో లభించాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? కావున మీకు సదా విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యశాలి ఆత్మలము అనే సదా సంతోషం ఉంటుంది. మేము కాదు, ఆత్మలమైన మేము. ఆత్మ అని అన్నట్లయితే ఎప్పుడూ ఉల్టా నశా రాదు. ఆత్మాభిమానిగా అయితే శ్రేష్ఠమైన నశా, ఈశ్వరీయ నశా ఉంటుంది. 'భాగ్యశాలి పిల్లలు' మీ భాగ్యం ఇప్పటికీ మహిమ చేయబడ్తూ ఉంది. 'భాగవతము' మీ భాగ్యానికి స్మృతిచిహ్నం. ఇలాంటి అవినాశీ భాగ్యం గురించి ఇప్పటి వరకు గాయనముంది. ఇదే సంతోషంలో సదా ముందుకు సాగుతూ ఉండండి. కుమారీలైతే నిర్బంధనులు. తనువుతోనూ నిర్బంధనులు, మనసుతో కూడా నిర్బంధనులు. ఇటువంటి బంధనాలు లేనివారే ఎగిరే కళను అనుభవం చేయగలరు. మంచిది. ఓంశాంతి.