22.02.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


' సంగమంలో నాలుగు కంబైండ్ రూపాల అనుభూతి ''

ఈ రోజు బాప్దాదా పిల్లలందరి కంబైండ్ రూపాలను చూస్తున్నారు. పిల్లలందరికి తమ కంబైండ్ రూపాలేవో బాగా తెలుసా? మొదటిది - శ్రేష్ఠమైన ఆత్మలు - ఈ అంతిమ పాత శరీరము. కాని అతి అమూల్యంగా తయారుచేసే శరీరముతో కంబైండ్ గా ఉన్నారు. శ్రేష్ఠమైన ఆత్మలందరూ ఈ శరీరం ఆధారంతో శ్రేష్ఠమైన కార్యాలను మరియు బాప్దాదాలతో మిలనాన్ని అనుభవం చేస్తున్నారు. పాత శరీరమే కాని త్యాగము(బలిహారం) ఈ అంతిమ శరీరానిదే. ఎందుకంటే శ్రేష్ఠ ఆత్మ దీని ఆధారంతోనే అలౌకిక అనుభవాన్ని చేస్తుంది. కనుక మీరు ఆత్మ మరియు శరీరాల కంబైండ్ రూపాలు. పాత శరీరమనే భ్రాంతిలోకి రాకండి. కాని యజమానులుగా అయ్యి శరీరము ద్వారా పనులు చేయించాలి. అందువలన ఆత్మాభిమానులుగా అయ్యి కర్మయోగులుగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయించాలి.

రెండవది - అలౌకిక విచిత్రమైన కంబైండ్ రూపం. మొత్తం కల్పమంతటిలో ఈ కంబైండ్ రూపాన్ని కేవలం ఇప్పుడు మాత్రమే అనుభవం చేయగలరు. అదేమంటే మీరు మరియు తండ్రి(ఆప్ఔర్బాప్). ఈ కంబైండ్ రూపం యొక్క అనుభవం సదా మాస్టర్ సర్వశక్తివంతులు, సదా విజయులు, సదా సర్వుల విఘ్నవినాశకులుగా చేస్తుంది. అంతేకాక సదా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ కర్మల ద్వారా విశ్వకళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది. సెకండులో సర్వ సమస్యల సమాధాన స్వరూపంగా చేయిస్తుంది. స్వయం కొరకు మరియు సర్వుల పట్ల దాతలుగా, మాస్టర్ వరదాతలుగా చేయిస్తుంది. కేవలం ఈ కంబైండ్ రూపంలో సదా స్థితులై ఉన్నట్లైతే సహజంగా స్మృతి మరియు సేవల సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. విధి నిమిత్త మాత్రమైపోతుంది మరియు సిద్ధి సదా మీ జతలో ఉంటుంది. ఇప్పుడు విధిలో చాలా సమయం పడ్తోంది. సిద్ధి యథాశక్తి అనుభవమవుతోంది. కాని ఎంత ఈ అలౌకిక శక్తిశాలి కంబైండ్ రూపంలో సదా ఉంటారో అంత విధి కన్నా ఎక్కువ సిద్ధి అనుభవమవుతుంది. సిద్ధి స్వరూపులు అనగా ప్రతి కార్యంలో సిద్ధి లభించే ఉందని ప్రాక్టికల్ గా అనుభవమవ్వాలి.

మూడవ కంబైండ్ రూపము - మనమే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేవారము. బ్రాహ్మణ రూపము మరియు అంతిమ కర్మాతీత ఫరిస్తా స్వరూపము. ఈ కంబైండ్ రూపము యొక్క అనుభూతి విశ్వం ముందు సాక్షాత్కారమూర్తులుగా చేస్తుంది. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా స్మృతి ద్వారా నడుస్తూ - తిరుగుతూ స్వయాన్ని వ్యక్త శరీరము, వ్యక్త దేశంలో పాత్రను అభినయిస్తున్నా బ్రహ్మబాబాకు సాథీలుగా(సహచరులుగా) అవ్యక్త వతన ఫరిస్తాలము, విశ్వ సేవ కోసం వ్యక్త దేహము మరియు దేశములోకి వచ్చామని భావిస్తారు. ఈ విధంగా వ్యక్త భావానికి అతీతంగా, అవ్యక్త రూపధారులుగా అనుభవం చేస్తారు. ఈ అవ్యక్త భావము అనగా ఫరిస్తాతనపు భావము స్వతహాగా అవ్యక్తం అనగా వ్యక్తతనపు మాటలు, ప్రవర్తనలు, వ్యక్త భావపు స్వభావాలు, వ్యక్త భావపు సంస్కారాలు సులభంగా పరివర్తన చేసుకుంటారు. భావము మారిపోయినట్లయితే అంతా మారిపోతుంది. అటువంటి అవ్యక్త భావాన్ని సదా స్వరూపంలోకి తీసుకు రండి. బ్రాహ్మణులే ఫరిస్తాలని స్మృతిలో ఉంది. ఇప్పుడు స్మృతిని స్వరూపంలోకి తీసుకు రండి. స్వరూపము నిరంతరము స్వతహాగా మరియు సహజంగా అయిపోతుంది. స్వరూపంలోకి తీసుకు రావడం అనగా సదా అవ్యక్త ఫరిస్తా. ఒకసారి మర్చిపోవడం, ఒకసారి స్మృతిలోకి రావడం - ఇది స్మృతిలో మొదటి స్టేజ్. స్వరూపంగా అయిపోవడం శ్రేష్ఠమైన స్థితి.

నాల్గవది - భవిష్య చతుర్భుజ స్వరూపము. లక్ష్మి మరియు నారాయణుల కంబైండ్ రూపము. ఎందుకంటే ఈ సమయంలో ఆత్మలో లక్ష్మి మరియు నారాయణునిగా అయ్యే ఇరువురి సంస్కారాలు నిండుతున్నాయి. ఒకసారి లక్ష్మిగా అవుతారు, ఒకసారి నారాయణునిగా అవుతారు. భవిష్య ప్రాలబ్ధపు ఈ కంబైండ్ స్వరూపము ఇంత స్పష్టంగా ఉండాలి, ఈ రోజు ఫరిస్తాలు, రేపు దేవతలు. ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు, ఇప్పుడిప్పుడే దేవతలు. తమ రాజ్యము, తమ రాజ్య స్వరూపము రానే వచ్చింది. తయారవ్వనే అయ్యారు. ఇటువంటి సంకల్పం స్పష్టంగా మరియు శక్తిశాలిగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ స్పష్టమైన సమర్థ సంకల్పాల ఇమర్జ్(ప్రత్యక్ష) రూపం ద్వారా మీ రాజ్యం సమీపంగా వచ్చేస్తుంది. మీ ఎమర్జ్ సంకల్పము కొత్త సృష్టిని రచిస్తుంది. అనగా సృష్టి పైకి తీసుకొస్తుంది. మీ సంకల్పం మర్జ్అయ్యి ఉంటే కొత్త సృష్టి ఇమర్జ్అవ్వజాలదు. బ్రహ్మకు తోడుగా బ్రాహ్మణులు చేసే ఈ సంకల్పం ద్వారా కొత్త సృష్టి ఈ భూమి పై ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మబాబా కూడా కొత్త సృష్టిలో మొదటి నూతన పాత్రను అభినయించేందుకు బ్రాహ్మణ పిల్లలైన మీ కోసం ''మీ వెంట వస్తాను'' అనే వాగ్ధానము చేసిన కారణంగా మీ కొరకు వేచి ఉన్నాడు. అతడొక్కడే బ్రహ్మ నుండి కృష్ణుడిగా అవుతే ఒంటరిగా ఏం చేస్తాడు? తోడుగా చదువుకునేవారు, ఆడుకునేవారు కూడా కావాలి కదా! అందువలన బ్రహ్మబాబా, అవ్యక్త రూపధారి తండ్రినైన నా సమానంగా అవ్యక్త రూపధారులుగా, అవ్యక్త స్థితిధారులైన ఫరిస్తా రూపులుగా అవ్వండి అని బ్రాహ్మణ పిల్లలను ఉద్ధేశించి అంటున్నారు. ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. అర్థమయ్యిందా! ఈ కంబైండ్ రూపాలన్నిటిలో స్థితులై ఉండడం వల్లనే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయిపోతారు. తండ్రి సమానంగా అయ్యి సహజంగా కర్మలో సిద్ధిని అనుభవం చేస్తారు.

డబల్ విదేశీ పిల్లలకు బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేసే లేక మిలనము చేసే కోరిక తీవ్రంగా ఉంది. అందరూ మేము ఈ రోజే కలవాలని భావిస్తారు. కాని ఈ సాకార ప్రపంచంలో అన్నీ చూడవలసి ఉంటుంది. సూర్య-చంద్రుల ప్రభావములోని ప్రపంచము కదా! వాటికి అతీతంగా ఉన్న ప్రపంచంలోకి వచ్చేసినట్లయితే అప్పుడు మొత్తం సమయమంతా నాతో కూర్చోండి. బాప్దాదాకు కూడా ప్రతి పుత్రుడు తమ తమ విశేషతల వలన ప్రియమైన పుత్రుడు. వీరు ప్రియమైనవారు, మేము తక్కువ ప్రియమైనవారమని ఎవరైనా అనుకుంటే అటువంటి విషయమేమీ లేదు. మహారథులు తమ విశేషతలతో ప్రియమైనవారు. తండ్రి ముందు తమ తమ రూపాలతో అందరూ మహారథులే. మహానాత్మలు, అందుకే మహారథులు. ఇదైతే కార్యాన్ని నడిపించేందుకు కొందరిని స్నేహంలో నిమిత్తంగా చేయవలసి ఉంటుంది. లేకపోతే కార్యానికి నిమిత్తంగా తమ తమ స్థానాలు లభించాయి. ఒకవేళ అందరూ దాదీలుగా అయిపోతే పని నడుస్తుందా? నిమిత్తంగా అయితే చేయవలసి ఉంటుంది కదా! నిజానికి తమ పద్ధతిలో అందరూ దాదీలే. అందరిని దీదీ లేక దాదీ అని అయితే అంటారు కదా! అయినా మీరందరూ కలిసి ఒకరిని నిమిత్తంగా అయితే చేశారు కదా! అందరూ చేశారా లేక తండ్రి ఒక్కరే చేశారా! ఇక్కడ కేవలం నిమిత్త కార్య వ్యవహారాల ప్రమాణంగా తమ తమ కార్యానుసారంగా నిమిత్తంగా చేయవలసే ఉంటుంది. దీని అర్థం మీరు మహారథులు కారని కాదు. మీరు కూడా మహారథులే, మహావీరులే. మాయను ఛాలెంజ్ చేసే మహారథులుగా అవ్వకపోతే ఇంకేమైనట్లు!

బాప్దాదాకు ఏడు రోజుల కోర్సు తీసుకున్న పుత్రుడు కూడా మహారథియే. ఎందుకంటే ఈ జీవితాన్ని శ్రేష్ఠంగా తయారు చేసుకోవాలని భావించినప్పుడే ఏడు రోజుల కోర్సు తీసుకుంటారు. ఛాలెంజ్ చేశారు అందుకే మహారథులు, మహావీరులుగా అయ్యారు. బాప్దాదా పిల్లలందరికీ సదా ఒక నినాదాన్ని(స్లోగన్ను) కార్యంలోకి తీసుకొచ్చేందుకు గుర్తు చేస్తూ ఉంటారు. ఒకటి - తమ స్వ స్థితిలో ఉండాలి, రెండవది - కార్య వ్యవహారాలలోకి రావడం. స్వ స్థితిలో అయితే అందరూ పెద్దవారే, చిన్నవారెవ్వరూ లేరు. కార్యవ్యవహారాలలో నిమిత్తంగా తయారు చేయవలసే ఉంటుంది. అందువలన కార్య వ్యవహారాలలో సదా సఫలత పొందేందుకు స్లోగన్- ''గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి'' ఇతరులకు గౌరవం ఇవ్వడమే గౌరవం తీసుకోవడం. ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది. గౌరవాన్ని ఇచ్చినట్లయితే గౌరవం లభిస్తుంది. గౌరవం తీసుకునే సాధనమే ఇవ్వడం. మీరు గౌరవం ఇవ్వండి, మీకు గౌరవం లభించకపోవడమనేది జరగదు. కాని హృదయపూర్వకంగా ఇవ్వండి, స్వార్థంతో కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా గౌరవాన్ని ఇస్తారో వారికి హృదయపూర్వకమైన గౌరవం లభిస్తుంది. స్వార్థంతో గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వార్థమైనదే లభిస్తుంది. సదా హృదయపూర్వకంగా ఇవ్వండి, హృదయపూర్వకంగా తీసుకోండి. ఈ స్లోగన్ ద్వారా సదా నిర్విఘ్నంగా, నిస్సంకల్పంగా, నిశ్చింతగా ఉంటారు. నాకేమి జరుగుతుందనే చింతయే ఉండదు. నాది అయ్యే ఉంది, తయారయ్యే ఉందని నిశ్చింతగా ఉంటారు. అంతేకాక అటువంటి శ్రేష్ఠ ఆత్మల శ్రేష్ఠ ప్రాలబ్ధం వర్తమానము మరియు భవిష్యత్తు నిశ్చితమయ్యే ఉంది. దీనినెవ్వరూ మార్చజాలరు. ఎవ్వరూ ఎవరి సీటును తీసుకోజాలరు. నిశ్చతమై ఉంది. నిశ్చితం కనుక నిశ్చింతగా ఉంటారు. దీనినే తండ్రి సమానంగా ఫాలో ఫాదర్ చేసేవారని అంటారు. అర్థమయిందా!

డబల్ విదేశీ పిల్లలపై అయితే విశేష స్నేహముంది. స్వార్థమైనది కాదు. హృదయపూర్వకమైన స్నేహముంది. బాప్దాదా ''ఉన్నతోన్నతమైన గోడలు''............... అన్న ఒక పాట వినిపించారు కదా! ఇది డబల్ విదేశీయుల పాట. సముద్రాలను దాటుతూ ధర్మం, దేశం, భాష మొదలైన ఎత్తైన గోడలను దాటి తండ్రివారిగా అయిపోయారు. కనుక తండ్రికి ప్రియమైనవారిగా ఉన్నారు. భారతవాసులైతే దేవతల పూజారులుగానే ఉన్నారు. వారు ఉన్నతమైన గోడలను దాటలేదు. కాని డబల్ విదేశీయులైన మీరు ఎత్తైన గోడలను ఎంత సహజంగా దాటుకున్నారు! అందుకే బాప్దాదా హృదయంలో పిల్లల ఈ విశేషతల పాటను పాడ్తారు. అర్థమయిందా! కేవలం సంతోషపరచేందుకు చెప్పడం లేదు. చాలామంది పిల్లలు, బాప్దాదా అయితే అందరినీ సంతోషపరుస్తారని అంటారు. కాని అర్థ సహితంగా సంతోషింపజేస్తారు. బాప్దాదా ఊరకే అంటారా లేక ఇది ప్రాక్టకల్ గా ఉందా! అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. ఎత్తైన గోడలను దాటి వచ్చేశారు కదా! ఎంత శ్రమతో టికెట్ తీసుకుంటారు! ఇక్కడి నుండి వెళ్తూనే ధనము ప్రోగు చేస్తారు కదా. బాప్దాదా పిల్లల స్నేహాన్ని చూసినప్పుడు, స్నేహంతో చేరుకునేందుకు సాధనాలను ఎలా ఉపయోగిస్తారో, ఏ విధంగా చేరుకుంటారో, స్నేహీ ఆత్మల స్నేహ సాధనను చూసి, పట్టుదలను చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎలా వస్తారో దూరము నుండి వచ్చేవారిని అడగండి. శ్రమ చేసి అయినా చేరుకుంటారు కదా! అచ్ఛా సదా కంబైండ్ రూపంలో స్థితులై ఉండేవారికి, సదా తండ్రి సమానంగా అవ్యక్త భావంలో స్థితులై ఉండే వారికి, సదా సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసేవారికి, తమ సమర్థ స్వరూపము ద్వారా సాక్షాత్కారాలను చేయించేవారికి, అటువంటి సదా నిశ్చింత సదా నిశ్చిత విజయులైన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

శాన్ ఫ్రాన్సిస్కో గ్రూపుతో - అందరూ స్వయాన్ని మొత్తం విశ్వంలో విశేష ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మొత్తం విశ్వంలోని అనేక ఆత్మల నుండి తండ్రిని గుర్తించే భాగ్యము విశేషాత్మలైన మీకే లభించింది. ఉన్నతోన్నతమైన తండ్రిని గుర్తించడం ఎంత గొప్ప భాగ్యము! గుర్తించారు, సంబంధాన్ని జోడించారు, అంతేకాక ప్రాప్తి కూడా లభించింది. ఇప్పుడు స్వయాన్ని తండ్రి సర్వ ఖజానాలకు యజమానిగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడైతే సదా పిల్లలుగా ఉన్నారో, పిల్లలు అనగా సదా అధికారులు. ఇదే స్మృతితో పదే పదే రివైజ్ చేయండి. నేనెవరిని? ఎవరి సంతానాన్ని? అమృతవేళ శక్తిశాలిగా లేకుంటే రోజంతటిలో చాలా విఘ్నాలు వస్తాయి. కనుక అమృతవేళ సదా శక్తిశాలిగా ఉండాలి. అమృతవేళ స్వయం తండ్రియే పిల్లలకు విశేష వరదానాలను ఇచ్చేందుకు వస్తారు. ఆ సమయంలో ఎవరైతే వరదానము తీసుకుంటారో వారికి రోజంతా సహజయోగి స్థితి ఉంటుంది. కనుక చదువు మరియు అమృతవేళ మిలనము, ఈ రెండు విశేషంగా శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు సదా సురక్షితంగా ఉంటారు.

జర్మనీ గ్రూపుతో - సదా తమను విశ్వకళ్యాణకారి అయిన తండ్రి పిల్లలుగా, విశ్వకళ్యాణకారి ఆత్మలుగా భావిస్తున్నారా? అనగా సర్వ ఖజానాలతో భర్ పూర్ (నిండు)గా ఉండేవారు. తమ వద్ద ఖజానాలు సంపన్నంగా ఉన్నప్పుడే ఇతరులకు ఇస్తారు కదా! కనుక సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మలు బాలకుల నుండి యజమానులు, ఇలా అనుభవం చేస్తున్నారా? 'తండ్రి' అని అన్నారంటే బాలకుల నుండి యజమానులుగా అయిపోయారు. ఈ స్మృతి విశ్వ కళ్యాణకారులుగా స్వతహాగానే తయారు చేస్తుంది. ఇదే స్మృతి సదా సంతోషంగా ఎగిరిస్తుంది. ఇదే బ్రాహ్మణ జీవితము. సంపన్నంగా ఉండడం, సంతోషంగా ఎగరడం మరియు తండ్రి ఖజానాలకు అధికారులమన్న నశాలో ఉండడం. మీరు ఇటువంటి శ్రేష్ఠమైన ఆత్మలు. మంచిది.