12.04.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బ్రాహ్మణ జీవితమునకు పునాది – పవిత్రత

బాప్ దాదా ఈరోజు హోలీ హంసలందరినీ చూస్తున్నారు. హోలీ హంసలు ప్రతి ఒక్కరు ఎంత వరకు హోలీ(పవిత్రం)గా అయ్యారు, ఎంతవరకు హంసలుగా అయ్యారు? పవిత్రతా శక్తిని అనగా హోలీగా అయ్యే శక్తిని ఎంతవరకు జీవితంలోకి తీసుకువచ్చారు అనగా సంకల్పాలు, మాటలు, కర్మలలో, సంబంధములో, సంపర్కములో ఎంతవరకు తీసుకువచ్చారు? ప్రతి సంకల్పము హోలీగా అనగా పవిత్రతా శక్తి సంపన్నంగా ఉందా? పవిత్రతా సంకల్పము ద్వారా ఏ అపవిత్ర సంకల్పము కల ఆత్మనైనా పరిశీలించి, పరివర్తన చెయ్యగలరా? పవిత్రతా శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క దృష్టి, వృత్తి మరియు కృతినైనా, ఈ మూడింటినీ మార్చగలరు. ఈ మహాశక్తి ముందు అపవిత్ర సంకల్పము కూడా యుద్ధము చేయజాలదు. కానీ ఎప్పుడైతే స్వయము యొక్క సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా ఓడిపోతారో అప్పుడు ఇతర వ్యక్తుల వలన లేక వైబ్రేషన్ ల వలన ఓటమి కలుగుతుంది. ఎవరి సంబంధము ద్వారానైనా లేక సంపర్కము ద్వారానైనా ఓడిపోవటము అనేది స్వయం బాబాతో సర్వ సంబంధాలను జోడించటంలో ఓడిపోయారు అన్నది నిరూపిస్తుంది, అప్పుడే ఏదైనా సంబంధములో లేక సంపర్కములో ఓడిపోతారు. పవిత్రతలో ఓడిపోవటము - ఇందుకు బీజము ఏ వ్యక్తి లేక వ్యక్తి గుణాలకుగానీ, స్వభావము, వ్యక్తిత్వము లేక విశేషతలకు గానీ ప్రభావితులవ్వటము. ఇలా వ్యక్తి లేక వ్యక్త భావమునకు ప్రభావితమవ్వటము అంటే అది ప్రభావితమవ్వటము కాదు కానీ నాశనమైపోవటము. వ్యక్తియొక్క వ్యక్తిగత విశేషతలు లేక గుణాలు, స్వభావము, ఇవన్నీ బాబా ఇచ్చిన విశేషతలు అనగా దాత ఇచ్చినవి. వ్యక్తిపై ప్రభావితమవ్వటము అనగా మోసపోవటము. మోసపోవటము అనగా దుఃఖాన్ని పొందటము. అపవిత్రతా శక్తి మృగతృష్ణ సమానమైన శక్తి, ఇది సంపర్కము మరియు సంబంధాల ద్వారా చాలా మంచిగా అనుభవమవుతుంది, ఆకర్షిస్తుంది. నేను మంచి వైపుకే ప్రభావితమవుతున్నాను అని భావిస్తారు కనుక ఇతను చాలా మంచిగా అనిపిస్తాడు లేక మంచిగా అనిపిస్తుంది లేక వీరి గుణాలు మరియు స్వభావము చాలా మంచిగా అనిపిస్తుంది అన్న మాటలే మాట్లాడ్తారు, అలాగే ఆలోచిస్తారు. వీరి జ్ఞానము మంచిగా అనిపిస్తుంది, యోగము చేయించటము మంచిగా అనిపిస్తుంది. దీనివలన శక్తి లభిస్తుంది, సహయోగము లభిస్తుంది, స్నేహము లభిస్తుంది. అల్పకాలికమైన ప్రాప్తి ఉంటుంది కానీ మోసపోతారు. ఇచ్చే దాతను అనగా బీజమును, పునాదిని నాశనము చేసి రంగురంగుల కొమ్మలను పట్టుకుని ఊగుతుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పునాది లేకపోతే కొమ్మ ఊపుతుందా లేక పడేస్తుందా? ఎప్పటివరకైతే బీజముద్వారా అనగా దాత, విధాత ద్వారా సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల రసమును అనుభ వించరో అప్పటి వరకు ఒక్కోసారి వ్యక్తులద్వారా, ఒక్కోసారి వైభవాలద్వారా, ఒక్కోసారి వైబ్రేషన్ లు, వాయుమండలము మొదలగు భిన్న భిన్న కొమ్మలద్వారా అల్పకాలిక ప్రాప్తికి చెందిన మృగతృష్ట సమానంగా మోసపోతూనే ఉంటారు. ఇలా ప్రభావితులవ్వటము అనగా అవినాశి ప్రాప్తి నుండి వంచితులవ్వటము. పవిత్రతా శక్తిద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థితి కావాలంటే ఆ స్థితి, ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తి, ఏ కార్యములో సఫలత కావాలంటే ఆ కార్యములో సఫలత, ఇవన్నీ మీ ముందు దాసి సమానంగా హాజరైపోతాయి. కలియుగ అంతిమములో కూడా రజోప్రధాన పవిత్రతా శక్తిని ధారణ చేసే నామధారీ మహానాత్మలకు ఇప్పటివరకు కూడా ప్రకృతి దాసిగా అయ్యే ప్రమాణములను చూస్తున్నారు. ఇప్పటివరకు కూడా పేరు మహాత్మ అనే నడుస్తుంది, ఇప్పటివరకు కూడా పూజ్యులుగా ఉన్నారు. అపవిత్ర ఆత్మలు వారి ముందు తల వంచుతారు. మరి ఆలోచించండి - అంతిమము వరకు పవిత్రతా శక్తికి ఎంతో మహానత ఉంది, మరి పరమాత్మ ద్వారా ప్రాప్తించిన సతోప్రధాన పవిత్రత ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందో ఆలోచించండి! ఈ శ్రేష్ఠ పవిత్రతా శక్తి ముందు అపవిత్రత తల వంచదు కానీ అది మీ కాలి క్రింద ఉంటుంది. అపవిత్రత రూపీ అసురీ శక్తిని శక్తి స్వరూపుల కాలి కింద చూపించటం జరిగింది. ఎవరైతే కాలి కింద ఓడిపోయి ఉన్నారో, వారు మిమ్మల్ని ఓటమిపాలు ఎలా చెయ్యగలరు?

బ్రాహ్మణ జీవితము మరియు ఓడిపోవటము, వీరిని నామధారీ బ్రాహ్మణులు అని అంటారు, ఇందులో నిర్ల్యకక్షులుగా అవ్వకండి. బ్రాహ్మణ జీవితమునకు పునాది పవిత్రతా శక్తి. ఒకవేళ పునాది బలహీనంగా ఉన్నట్లయితే ప్రాప్తులతో కూడిన 21 అంతస్థుల బిల్డింగ్ ఎలా నిలబడగలదు! పునాది కదుల్తున్నట్లయితే ప్రాప్తి యొక్క అనుభవము సదా ఉండజాలదు అనగా అచలంగా ఉండలేరు మరియు వర్తమాన యుగమును మరియు జన్మయొక్క మహా ప్రాప్తి యొక్క అనుభవమును కూడా చెయ్యలేరు. యుగము యొక్క, శ్రేష్ఠ జన్మ యొక్క మహిమను గానము చేసే జ్ఞాన భక్తులుగా అయిపోతారు అనగా వివేకము ఉంది కానీ స్వయం అలా లేరు, వీరినే జ్ఞాని భక్తులు అని అంటారు . ఒకవేళ బ్రాహ్మణులుగా అయ్యి కూడా సర్వ ప్రాప్తుల, సర్వ శక్తుల వరదానమును లేక వారసత్వమును అనుభవము చెయ్యనట్లయితే వారినేమంటారు? వంచిత ఆత్మనా లేక బ్రాహ్మణ ఆత్మనా? ఈ పవిత్రత యొక్క భిన్న - భిన్న రూపాలను మంచిగా తెలుసుకోండి, స్వయము పట్ల కఠినమైన దృష్టిని పెట్టుకోండి. నడిపించెయ్యద్దు. నిమిత్తంగా అయిన ఆత్మలను, బాబాను కూడా నడిపించెయ్యటానికి ప్రయత్నం చేస్తారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇలా ఎవరు తయారయ్యారు! లేకపోతే ఇది అపవిత్రత కాదు, మహానత, ఇదైతే సేవ సాధనము. ప్రభావితమవ్వటం కాదు, సహయోగమును తీసుకుంటాము అని అంటారు. సహాయకులు కనుక ప్రభావితులవుతారు. బాబాను మర్చిపోయారంటే మాయ యొక్క ఫిరంగి గుండు తగులుతుంది, మరల తమను తాము బయట పడేసుకునేందుకు - నేను చెయ్యలేదు, వీళ్ళు చేసారు అని అంటారు. కానీ బాబాను మర్చిపోయారంటే ధర్మరాజు రూపంలోనే బాబా లభిస్తారు, బాబా నుండి సుఖమును ఎప్పటికీ పొందలేరు కనుక దాచిపెట్టవద్దు, ఏదో నడిపించొద్దు ఇతరులను దోషిగా చెయ్యవద్దు. మృగతృష్ణ ఆకర్షణలో మోసపోవద్దు . ఈ పవిత్రతా పునాదిలో బాప్ దాదా ధర్మరాజు ద్వారా 100 రెట్లు, పదమాగుణాలుగా దండిస్తారు. ఇందులో క్షమించటము ఉండజాలదు, ఇందులో దయాహృదయులుగా అవ్వజాలరు ఎందుకంటే బాబానుండి సంబంధాన్ని తెంచేసారు, అప్పుడే ఎవరికైనా ప్రభావితులైపోతారు . పరమాత్మ ప్రభావమునుండి వెలువడి ఆత్మల ప్రభావములోకి రావటము అనగా బాబాను తెలుసుకోలేదు, గుర్తించలేదు. ఇటు వంటి వారి ముందు బాబా, బాబా రూపంలో కాకుండా ధర్మరాజు రూపంలో ఉంటా రు. ఎక్కడ పాపము ఉంటుందో అక్కడ బాబా ఉండరు. కనుక నిర్లకక్ష్యులుగా అవ్వకండి. దీనిని చిన్న విషయంగా భావించకండి. ఎవరిపట్లనైనా ప్రభావితులవ్వటము, కోరిక ఉండటము అనగా కామ వికారపు అంశము. కోరిక లేకుండా ప్రభావితులవ్వజాలరు. ఆ కోరిక కూడా కామ వికారము. మహాశతృవు. ఇది రెండు రూపాలలో వస్తుంది. కోరిక అనేది ప్రభావితమన్నా చేస్తుంది లేకపోతే వ్యాకులపరుస్తుంది కామ వికారము నరకానికి ద్వారము అని నినాదాలు చేస్తారు కదా! ఏవిధమైన అల్పకాలికమైన కోరిక అయినా మృగతృష్ణ సమానంగా మోసం చేసేది అని ఇప్పుడు మీరు మీ జీవితంలో దీనిని ధారణ చెయ్యండి. కోరిక అనగా మోసపోవటము. ఇంత కఠినమైన దృష్టిని పెట్టుకుని ఈ కామము అనగా కోరికపై కాళి రూపులుగా అవ్వండి. స్నేహీరూపులుగా అవ్వవద్దు , అయ్యో పాపం, మంచివారు, కొంచెమే ఉంది, బాగైపోతారు.... ఇలా అనుకోవద్దు. వికర్మపై భయంకర రూపాన్ని ధారణ చెయ్యండి. ఇతరుల పట్ల కాదు, స్వయముపై, అప్పుడే వికర్మలను వినాశనము చేసుకుని ఫరిస్తాలుగా అవ్వగలరు. యోగము కుదరటం లేదంటే చెక్ చేసుకోండి - ఏదైనా దాగి ఉన్న వికర్మ తప్పకుండా తన వైపు లాగుతుంది. బ్రాహ్మణ ఆత్మలు కానీ యోగము కుదరటం లేదు అన్నది జరగజాలదు. బ్రాహ్మణులు అంటేనే ఒక్కరికి చెందినవారు, ఒక్కరే. మరి ఎక్కడకు పోతారు? అసలు ఏమీ లేనప్పుడు మరెక్కడకు పోతారు? అచ్ఛా !

కేవలము బ్రహ్మచర్యమే కాదు కానీ కామ వికారమునకు చెందిన పిల్లాపాపలు ఇంకా ఉన్నాయి. బాప్ దాదాకు ఒక విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యమనిపిస్తుంది . బ్రాహ్మణులు అని అంటారు, బ్రాహ్మణ ఆత్మపై వ్యర్ధమునకు చెందిన వికారీ దృష్టి , వృత్తి పోతుంది . ఇది కుల కళంకితులకు చెందిన విషయము. అనేదేమో అక్యయ్యగారూ లేక అన్నయ్యగారూ అని కానీ చేసేది ఏంటి ? లౌకిక సోదరిపైనైనా ఒకవేళ చెడు దృష్టి పోయినట్లయితే, సంకల్పాలు వచ్చినట్లయితే వారిని కుల కళంకితులు అని అం టా రు . మరి ఇక్కడ ఏమనాలి ? ఒక్క జన్మకు కాదు కానీ జన్మ జన్మలకు కళంకాన్ని వేసేవారు. రాజ్య భాగ్యమును కాలితో తన్నేవారు. ఇటువంటి పదమాగుణ వికర్మను ఎప్పుడూ చెయ్యకూడదు . ఇది వికర్మ కాదు మహా వికర్మ కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి, సంభాళించండి. ఈ పాపములు యమదూతల వలె అంటుకుపోతాయి. చాలా మజాలో ఉన్నాము, ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసు అని ఇప్పుడు అనుకున్నా గానీ పాపముపై పాపము పెరుగుతూ ఉంటుంది మరియు పాప ఫలాన్ని అనుభవించే సమయము కూడా వస్తుంది. దీని రిజల్టు ఎంత కఠినంగా ఉంటుందనేది బాప్ దాదాకు తెలుసు. శరీరము ద్వారా తపించి - తపించి ఏవిధంగా శరీరము వదుల్తారో అలా బుద్ధి పాపాలలో తపించి - తపించి అప్పుడు శరీరాన్ని వదుల్తుంది. ఎల్లప్పుడు ఎదురుగా ఈ పాపానికి చెందిన యమదూతలు ఉంటారు. ఇంత కఠినమైన అంతము ఉంటుంది, కనుక వర్తమానములో పొరపాటున కూడా అటువంటి పాపమును చెయ్యకూడదు. కేవలము సమ్ముఖంలో ఉన్న పిల్లలకే బాప్ దాదా చెప్పటం లేదు కానీ నలువైపుల ఉన్న పిల్లలను సమర్ధులుగా చేస్తున్నారు. జాగ్రత్తపరులుగా, తెలివైనవారిగా చేస్తున్నారు. అర్థమైందా - ఇప్పటివరకు ఈ విషయములో బలహీనత చాలానే ఉంది. అచ్ఛా !

స్వయము గురించి సూచనతోనే అర్థం చేసుకునేవారందరికి, సదా తమ వికల్పాలు మరియు వికర్మలపై కాళీ రూపాన్ని ధారణ చేసేవారికి, సదా భిన్న - భిన్న మోసాల నుండి రక్షింపబడేవారికి, దుఃఖాల నుండి రక్షింపబడేవారికి, శక్తిశాలీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఎంచుకోబడిన విశేష మహా వాక్యాలు.

బ్రహ్మాబాబా అడుగుపై అడుగు వేసే బ్రహ్మాచారులుగా అవ్వండి.

బ్రహ్మాచారి అనగా బ్రహ్మాబాబా ఆచరణపై నడిచేవారు. సంకల్పాలు, మాటలు మరియు కర్మరూపీ అడుగు నేచురల్ గా బ్రహ్మాబాబా అడుగులో అడుగు వేసే విధంగా ఉండాలి, దీనినే ఫస్ట్ స్టెప్ ( అడుగుజాడ) అంటారు. ప్రతి అడుగులో బ్రహ్మాబాబా ఆచరణ కనిపించాలి అనగా ఈ మనసు - వాణి - కర్మలనే అడుగు బ్రహ్మాచారిగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి బ్రహ్మాచారులుగా ఉంటా రో వారి ముఖము మరియు నడవడిక ఎల్లప్పుడూ అంతర్ముఖి మరియు అతీంద్రియ సుఖపు అనుభవమును చేయిస్తుంది. ఎవరి ప్రతి కర్మ ద్వారా బ్రహ్మాబాబా కర్మ కనిపిస్తుందో వారే బ్రహ్మాచారులు. మాటలు బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి, లేవటము - కూర్చోవటము, చూడటము, నడవడిక - అన్నీ సమానంగా ఉండాలి. బ్రహ్మాబాబా ఏ సంస్కారాలనైతే తయారుచేసుకున్నారో మరియు నిరాకారి - నిరహంకారి - నిర్వికారి అని శరీరము యొక్క అంతిమ సమయములో కూడా స్మృతిని కలిగించారో - ఇదే బ్రాహ్మణుల నేచురల్ సంస్కారంగా ఉండాలి, అప్పుడే బ్రహ్మాచారి అంటారు. స్వభావ - సంస్కారాలలో బాబా సమానమైన నవీనత ఉండాలి. నా స్వభావము అని కాదు, కానీ బాబా స్వభావము ఏదో అదే నా స్వభావము.

పవిత్రతా వ్రతము అంటే కేవలము బ్రహ్మచర్య వ్రతమనే కాదు కానీ బ్రహ్మ సమానంగా ప్రతి మాటలో పవిత్రతా వైబ్రేషన్ లు ఇమిడి ఉండాలి, ప్రతి ఒక్క మాట మహావాక్యంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు, అలౌకికంగా ఉండాలి. ప్రతి సంకల్పములో పవిత్రత యొక్క మహత్వము ఉండాలి, ప్రతి కర్మలో కర్మ మరియు యోగము అనగా కర్మయోగి యొక్క అనుభవము ఉండాలి - వీరినే బ్రహ్మచారి మరియు బ్రహ్మాచారి అని అంటారు. బ్రహ్మాబాబా సాధారణ తనువులో ఉన్నా కూడా పురుషోత్తములుగా అనుభవమయ్యేవారు. అందరూ చూసారు లేక విన్నారు. ఇప్పుడు అవ్యక్తరూపములో కూడా సాధారణతలో కూడా పురుషోత్తమ ప్రకాశమును చూస్తారు. అలా ఫాలో ఫాదర్. పని సాధారణమైనదిగా ఉన్నా గానీ స్థితి గొప్పగా ఉండాలి. ముఖముపై శ్రేష్ఠ జీవితముయొక్క ప్రభావము ఉండాలి. ప్రతి నడవడికద్వారా బాబా యొక్క అనుభవము ఉండాలి. వీరినే బ్రహ్మాచారులు అని అంటారు.

బ్రహ్మాబాబా స్నేహము విశేషంగా మురళితో ఉండేది, కనుకనే మురళీధరులయ్యారు. భవిష్య శ్రీకృష్ణ రూపంలోకూడా 'మురళి'నే గుర్తుగా చూపిస్తారు. కనుక దేనిపైనైతే బాబాకు ప్రేమ ఉండేదో దానిపై ప్రేమ ఉండటము - ఇదే ప్రేమకు గుర్తు . వీరినే బ్రహ్మాబాబాకు ప్రియమైనవారు అనగా బ్రహ్మాచారులు అని అంటారు. ఏ కర్మ చేసినా కర్మ చేసేందుకు ముందు, మాట్లాడేందుకు ముందు, ఆలోచించేందుకు ముందు ఇది బ్రహ్మాబాబా సమానంగా ఉందా అన్నదానిని చెక్ చేసుకోండి, తరువాత సంకల్పాలను స్వరూపములోకి తీసుకురండి, మాటలను నోటి నుండి మాట్లాడండి, కర్మలను కర్మేంద్రియాల ద్వారా చెయ్యండి. ఇలా ఆలోచించలేదు గానీ అయిపోయింది అని ఇలా అనటం కాదు. బ్రహ్మాబాబా విశేషత విశేషంగా ఇదే ఉండేది - ఏది ఆలోచించారో అదే చేసారు, ఏది అన్నారో అదే చేసారు, ఇలా బాబాను ఫాలో చేసేవారే బ్రహ్మాచారులు .

బ్రహ్మాబాబా నిశ్చయము ఆధారంతో, ఆత్మిక నషా ఆధారంతో నిశ్చిత భావి యొక్క జ్ఞాతగా అయ్యి క్షణములో అన్నింటినీ సఫలము చేసేసారు, తనకోసము ఏమీ ఉంచుకోలేదు, సఫలము చేసారు. దీనికి ప్రత్యక్షప్రమాణంగా అంతిమ దినం వరకు కూడా తనువు ద్వారా ఉత్తర ప్రత్యుత్తరముల వ్యవహారముద్వారా సేవ చేసారు, నో టి ద్వారా మహావాక్యాలను ఉచ్ఛరించారు. అంతిమదినం కూడా సమయము, సంకల్పాలు, శరీరమును సఫలము చేసారు. కనుక బ్రహ్మాచారి అనగా అన్నింటినీ సఫలము చేసేవారు. సఫలము చెయ్యటమునకు కల అర్థమే - శ్రేష్ఠము వైపు పెట్టడము. బ్రహ్మాబాబా సదా హర్షితముగా మరియు గంభీరత్వముగా - రెండింటి బ్యాలెన్స్ యొక్క ఏకరస స్థితిలో ఉన్నారు, అలా ఫాలో ఫాదర్. ఎప్పుడూ ఏ విషయములోనూ కన్ ఫ్యూజ్ అవ్వకూడదు మరియు ఎప్పుడూ ఏ విషయము వలన మూడ్ ఛేంజ్ చేసుకోకూడదు. సదా ప్రతి కర్మలో బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యాలి. అప్పుడే బ్రహ్మాచారి అని అం టా రు .

బ్రహ్మాబాబాకు చాలా ఇష్టమైన స్లోగన్ - '' తక్కువ ఖర్చు - ఎక్కువ ప్రసిద్ధి ''. కనుక తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రసిద్ధి చేసి చూపించండి . ఖర్చు తక్కువగా ఉండాలి కానీ దానివలన వచ్చే ప్రాప్తి ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉండాలి. శక్తి మరియు సంకల్పాలు ఎక్కువ ఖర్చు కాకూడదు. తక్కువ మాటలు ఉండాలి కానీ ఆ తక్కువ మాటలలో ఎక్కువ స్పష్టీకరణ ఉండాలి, సంకల్పాలు తక్కువగా చెయ్యాలి కానీ అవి శక్తివంతమైనవిగా ఉండాలి - దీనినే '' తక్కువ ఖర్చు - ఎక్కువ ప్రసిద్ధి '' అని అంటారు లేక ఎకానమీయొక్క అవతారము అని అంటారు.

ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు - అన్నదానిని బ్రహ్మాబాబా ప్రాక్టికల్ లో కర్మలలో చేసి చూపించారు. ఇలా బాబా సమానంగా అయ్యేవారిని కూడా ఫాలో చెయ్యాలి. ఎప్పుడూ దుఃఖితులుగా కాకూడదు, సదా సంతోషంగా ఉండాలి - అని బ్రహ్మాబాబా సమానంగా ఈ సంకల్పమునే చెయ్యాలి. మాయ కదిలించాలని చూసినా గానీ కదలకూడదు. ఒకవేళ మాయ హిమాలయ పర్వతమంత పెద్ద రూపములో వచ్చినా ఆ సమయములో దారిని వెతుక్కోకండి, ఎగరండి. ఎగిరేకళ కలిగిన వారికి పర్వతముకూడా క్షణములో దూదిలా అయిపోతుంది .

సాకార బ్రహ్మాబాబా నుండి ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ స్పష్టంగా అనుభవము చేసేవారు - ఇది తపస్సు యొక్క అనుభవమునకు గుర్తు. అలా ఈ పర్సనాలిటీ ఇప్పుడు మీ ముఖము మరియు గుణాలద్వారా ఇతరులకు అనుభవమవ్వాలి. బ్రహ్మాబాబా సాకార కర్మయోగికి చిహ్నము. ఎవరు ఎంత బిజీగా ఉన్నాగానీ బ్రహ్మాబాబా కంటే ఎక్కువగా ఎవరూ బిజీగా ఉండలేరు. ఎన్ని బాధ్యతలు ఉన్నా గానీ బ్రహ్మాబాబా పైన ఉన్నన్ని బాధ్యతలు మరెవరిపైనా ఉండవు. కనుక బ్రహ్మాబాబా బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఎలా కర్మయోగిగా ఉన్నారో, స్వయమును చేసేవారుగా భావిం చుకుని కర్మ చేసారో, చేయించేవారుగా భావించలేదు, అలా ఫాలో ఫాదర్. ఎంత పెద్ద కార్యము చేసినా గానీ ఎలా అనుకోవాలంటే ఆడించేవారు ఆడిస్తున్నారు మరియు మేము ఆడుతున్నాము అని అనుకున్నట్లయితే అలసిపోరు. తికమక చెందరు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.