10.12.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' పాత ఖాతా సమాప్తికి గుర్తు ''

ఈ రోజు బాప్దాదా సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని సాకార ప్రపంచంలో సాకార రూపం కలిగిన పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు. వర్తమాన సమయంలోని అలజడి ప్రపంచం అనగా దు:ఖ వాతావరణం గల ప్రపంచంలో బాప్దాదా తన అచంచలమైన, స్థిరమైన పిల్లలను చూస్తున్నారు. అలజడిలో ఉంటూ అందుకు అతీతంగా, బాబాకు ప్రియంగా ఉన్న కమల పుష్పాలను చూస్తున్నారు. భయం కలిగించే వాతావరణంలో ఉంటూ నిర్భయంగా ఉన్న శక్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. ఈ విశ్వాన్ని పరివర్తన చేసే నిశ్చింత చక్రవర్తులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న చింతల వాతావరణ ప్రభావం అంశమాత్రం కూడా పడజాలని నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. వర్తమాన సమయం విశ్వంలో మెజారిటీ ఆత్మలలో విశేషంగా భయము మరియు చింత ఈ రెండు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. వారు ఎంత చింతలో ఉన్నారో మీరు అంత శుభ చింతకులుగా ఉన్నారు. చింతకు బదులు శుభచింతక భావనా స్వరూపంగా అయ్యారు. భయభ్రాంతులుగా అయ్యేందుకు బదులు సుఖం కలిగించే పాటలు పాడుతున్నారు. ఇంత పరివర్తనను అనుభవం చేస్తున్నారు కదా! సదా శుభ చింతకులుగా అయ్యి శుభ భావన, శుభ కామనల మానసిక సేవ ద్వారా అందరికీ సుఖ-శాంతుల దోసిలిని(ఓదార్పును) ఇచ్చేవారు కదా! అకాలమృత్యువు కలిగిన ఆత్మలకు అకాలమూర్తులుగా అయ్యి శాంతి, శక్తుల సహయోగాన్ని ఇచ్చేవారు కదా! ఎందుకంటే వర్తమాన సమయం అకాల మృత్యువుల సీజన్ గా ఉంది. ఎలాగైతే సముద్రం, వాయువుల తుఫాను అకస్మాత్తుగా వస్తుందో, అలా ఈ అకాలమృత్యువుల తుఫాను కూడా అకస్మాత్తుగా మరియు వేగంగా ఒకేసారి అనేమందిని తీసుకెళ్తుంది. ఈ అకాల మృత్యువుల తుఫాను ఇప్పుడే ప్రారంభమయ్యింది. విశేషించి భారతదేశంలో సివిల్ యుద్ధాలు మరియు ప్రాకృతిక ఆపదలే ప్రతి కల్పము పరివర్తనకు నిమిత్తంగా అవుతాయి. విదేశాల రూపురేఖలు వేరుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఈ రెండు విషయాలే విశేషంగా నిమిత్తంగా అవుతాయి. ఈ రెండిటి రిహార్సల్స్ చూస్తున్నారు కదా! రెండూ జత జతలో తమ పాత్రను అభినయిస్తున్నాయి.

పిల్లలూ! - ''ఒకే సమయంలో సామూహిక మృత్యువులు ఎలా మరియు ఎందుకు జరుగుతాయి?'' అని ప్రశ్నించారు. దీనికి కారణముంది. ఇప్పుడు సంపన్నంగా అయ్యే సమయం సమీపంగా వస్తోందని మీకు తెలుసు మరియు అనుభవం చేస్తున్నారు. ద్వాపర యుగం లేక కలియుగం నుండి చేసిన ఆత్మలందరి వికర్మలు లేక మిగిలిన పాపఖాతా ఇప్పుడు పూర్తిగా సమాప్తమవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్లాలి. ద్వాపర యుగం నుండి చేసిన కర్మ లేక వికర్మల రెండిటి ఫలం ఒక్క జన్మలో సమాప్తమవ్వకుంటే తర్వాత జన్మలో కూడా సమాప్తి చేసుకునే లేక ప్రాప్తి పొందే లెక్క నడుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు అంతిమ సమయము, పాపాల ఖాతా(లెక్క) ఎక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు త్వర త్వరగా జన్మ మరియు మృత్యువులు జరుగుతున్నాయి. ఈ శిక్ష ద్వారా అనేకమంది ఆత్మల పాత ఖాతా సమాప్తమవుతూ ఉంది. కనుక వర్తమాన సమయంలో మృత్యువు కూడా బాధాకరంగా మరియు మెజారిటీ వారి జన్మ కూడా చాలా దు:ఖంతో జరుగుతూ ఉంది. కనుక మృత్యువూ సహజంగా లేదు, జన్మ కూడా సహజంగా లేదు. కనుక బాధాకరమైన మృత్యువు మరియు దు:ఖంతో కూడిన జన్మ. ఇది త్వరగా లెక్కా ఖాతాలు సమాప్తమయ్యేందుకు సాధనాలు. ఎలాగైతే ఈ పాత ప్రపంచంలో చీమలు, దోమలు మొదలైనవి చంపేందుకు సాధనాలను ఉపయోగిస్తారు ఆ సాధనాల ద్వారా ఒకేసారి చీమలు లేక దోమలు లేక అనేక రకాల కీటాణువులు కలిసి వినాశనం అయిపోతాయి కదా! అలాగే ఈనాటి సమయంలో మానవులు కూడా చీమలు - దోమల వలె అకాలమృత్యువుకు వశమవుతున్నారు. మానవులకు మరియు చీమలకు భేదమే లేదు. ఈ లెక్కాఖాతాలన్నీ సదాకాలం కొరకు సమాప్తమయ్యేందుకే అకాల మృత్యువుల తుఫానులు ప్రతిసారీ వస్తున్నాయి.

అలాగే ధర్మరాజపురిలో కూడా శిక్షల పాత్ర అంతిమంలో నిశ్చితమై ఉంది. కానీ ఆ శిక్షలు కేవలం ఆత్మ తనకు తాను అనుభవించి తన లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటుంది. కానీ కర్మల లెక్కలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ విశేషించి మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆత్మ తనంతకు తాను అనుభవించే లెక్కలు, ఉదాహరణానికి రోగాల లాంటివి. స్వయం ఆత్మయే శారీరిక రోగం ద్వారా లెక్క సమాప్తి చేసుకుంటుంది. అలాగే బుద్ధి బలహీనంగా అవ్వడం లేక ఏదో ఒక భూతం ప్రవేశించడము. ఇలాంటి అనేక రకాల శిక్షల ద్వారా ఆత్మ స్వయం లెక్కాచారాలను అనుభవిస్తుంది. రెండవ లెక్కాచారం సంబంధ-సంపర్కాల ద్వారా దు:ఖం ప్రాప్తిస్తుంది. ఇది ఎలాగో అర్థం చేసుకోగలరు కదా! ఇక మూడవది ప్రాకృతిక ఆపదల ద్వారా లెక్కాచారాలు సమాప్తమవ్వడం. మూడు రకాల ఆధారాలతో లెక్కాచారాలు సమాప్తమవుతున్నాయి. కనుక ధర్మరాజపురిలో సంబంధం మరియు సంపర్కం ద్వారా లేక ప్రాకృతిక ఆపదల ద్వారా లెక్కాచారాలు సమాప్తమవ్వవు. అవి ఇక్కడ సాకార సృష్టిలో జరుగుతాయి. మొత్తం పాత ఖాతాలన్నీ సమాప్తమవ్వాల్సిందే. అందువలన ఈ లెక్కాఖాతాలను సమాప్తి చేసే మిషనరీ ఇప్పుడు తీవ్రగతితో నడవాల్సిందే, విశ్వంలో ఇవన్నీ జరగాల్సిందే. అర్థమయ్యిందా? ఇది కర్మల లెక్కాచారము. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మనైన నేను తీవ్ర వేగంతో తీవ్ర పురుషార్థము ద్వారా నా అన్ని లెక్కాచారాలు సమాప్తి చేసుకున్నానా లేక ఇప్పటికీ కొంత భారం మిగిలి ఉందా? పాత ఖాతా ఇప్పుడింకా కొద్దిగా ఉందా లేక సమాప్తమయ్యిందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దీని విశేష గుర్తు తెలుసా? శ్రేష్ఠ పరివర్తనలో లేక శ్రేష్ఠ కర్మ చేయడంలో ఏదైనా మీ స్వభావ - సంస్కారము విఘ్నము వేస్తుంది లేక ఎంత చేయాలనుకుంటున్నారో, ఎంత ఆలోచిస్తున్నారో అంత చెయ్యలేకపోతారు. తర్వాత కోరుకోకపోయినా ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు అనే మాటలు లేక సంకల్పాలు మనసులో నడుస్తాయి లేక స్వయం శ్రేష్ఠంగా అవ్వాలని కోరుకుంటారు, ధైర్యం-ఉత్సాహం ఉన్నప్పటికీ పరవశ స్థితిని అనుభవం చేస్తారు. ఇలా చెయ్యకుండా ఉండాల్సింది, ఆలోచించలేదు కానీ జరిగిపోయింది అని అంటారు. దీనినే స్వయంలోని పాత స్వభావ సంస్కారాలకు పరవశులయ్యారు లేక ఎవరి సాంగత్య దోషంలోనైనా పరవశులయ్యారు లేక ఏ వాతావరణ వైబ్రేషన్లకు పరవశులయ్యారు అని అంటారు. ఈ మూడు రకాల పరవశ స్థితులుంటే కోరుకోకపోయినా జరగడం, ఆలోచిస్తూ కూడా జరగకపోవడం లేక పరవశులుగా అయ్యి సఫలతను ప్రాప్తి చేసుకోలేకపోవడం - ఈ గుర్తులన్నీ వెనుకటి పాతఖాతాల భారం ఉన్నందుకు గుర్తు. ఈ గుర్తుల ద్వారా ఏ విధమైన భారం అయినా ఎగిరేకళ అనుభవం నుండి క్రిందకు తీసుకురావడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. లెక్క సమాప్తి చేసుకోవడం అనగా అన్ని ప్రాప్తుల అనుభవాలలో ఎగిరేకళ ఉండాలి. అప్పుడప్పుడు ప్రాప్తి ఉంది. అప్పుడప్పుడు అనగా ఇప్పుడు లేదు. కనుక ఈ విధి ద్వారా స్వయాన్ని చెక్ చేసుకోండి. దు:ఖమయ ప్రపంచం కనుక దు:ఖమిచ్చే ఘటనల పర్వతం తప్పకుండా పగలాల్సిందే. ఇలాంటి సమయంలో రక్షణా సాధనం - తండ్రి ఛత్రఛాయ. ఛత్రఛాయ అయితే ఉంది కదా! మంచిది.

మిలన మేళా జరుపుకునేందుకు అందరూ వచ్చారు. ఈ మిలన మేళా ఎంత బాధాకరమైనా బాబాతో మిలనము ఉంటే ఇది ఆటలాగా అనిపిస్తుంది, భయపడరు. మిలనం యొక్క పాటలు పాడుతూ ఉంటారు, సంతోషంగా నాట్యం చేస్తారు. ఇతరులకు కూడా సాహసం యొక్క సహయోగాన్ని ఇస్తారు. స్థూలంగా నాట్యం చెయ్యడం కాదు ఇది సంతోషంతో నాట్యం చెయ్యడం. మేళా సదా జరుపుకుంటూ ఉంటారు కదా! ఉండడమే మిలన మేళాలో ఉంటున్నారు. అయినా మధువనం మేళాకు వచ్చారు. బాప్దాదా కూడా ఇలాంటి మేళా జరుపుకునే పిల్లలను చూసి సంతోషిస్తారు. మధువవనం అలంకారమైన పిల్లలు మధువనానికి చేరుకున్నారు మంచిది.

సదా స్వయం లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకొని ఇతరులకు కూడా లెక్కాచారాలను సమాప్తి చేయించే శక్తి స్వరూప ఆత్మలకు, సదా దు:ఖము, బాధాకరమైన వాయుమండలంలో ఉంటూ అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండే ఆత్మిక కమల పుష్పాలకు, సర్వాత్మల పట్ల శుభ చింతకులుగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్స్అక్కయ్యలతో :- సేవాధారులుగా ఉన్నారు, టీచర్లు కాదు. సేవలో త్యాగం, తపస్సు ఇమిడి ఉన్నాయి. సేవాధారిగా అవ్వడం అనగా ఖజానాకు అధికారిగా అవ్వడం. సేవ ఎలాంటిదనగా దీని(సేవ) ద్వారా ప్రతి క్షణంలో సంపన్నతయే సంపన్నత అనగా సంపన్నమవుతారు. అర్ధకల్పం వరకు తింటూనే ఉండేంత సంపన్నంగా ఉంటారు. ఇలాంటి సేవాధారులు కష్టపడే అవసరం లేదు. ఆత్మిక స్థితిలో స్థితులై ఆత్మలకు సేవ చేసేవారిని ఆత్మిక సేవాధారులని అంటారు. ఇలాంటి ఆత్మిక సేవాధారులకు బాప్దాదా సదా ఆత్మికగులాబీ అనే టైటిల్ఇస్తారు. కావున ఆత్మిక గులాబీలందరూ ఎప్పుడూ వాడిపోయేవారు కాదు. సదా తమ ఆత్మీయతా సుగంధంతో అందరినీ రిఫ్రెష్ చేసేవారు.

2. సేవాధారిగా అవ్వడం కూడా చాలా శ్రేష్ఠమైన భాగ్యము. సేవాధారి అనగా తండ్రి సమానమైనవారు. తండ్రి ఎలాగైతే సేవాధారిగా ఉన్నారో అలాగే మీరు కూడా నిమిత్త సేవాధారులు. తండ్రి బేహద్ శిక్షకులు. మీరు కూడా నిమిత్త శిక్షకులు. కావున తండ్రి సమానంగా అయ్యే భాగ్యం ప్రాప్తించింది. సదా ఇదే శ్రేష్ఠ భాగ్యం ద్వారా ఇతరులకు కూడా అవినాశీ భాగ్యం యొక్క వరదానం ఇప్పిస్తూ ఉండండి. మొత్తం విశ్వంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము చాలా కొద్దిమంది ఆత్మలకే ఉంది. ఈ విశేష భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థులుగా అయ్యి సమర్థంగా చేస్తూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. సదా స్వయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకెెళ్ళండి. మంచిది.

ఎంచుకోబడిన అవ్యక్త మహావాక్యాలు

మాయాజీతులుగా అవ్వడంతో పాటు ప్రకృతిజీతులుగా అవ్వండి

పిల్లలైన మీరు మాయాజీతులుగా అయితే అవుతూనే ఉన్నారు కానీ ప్రకృతిజీతులుగా కూడా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో చాలా అలజడులు జరగనున్నాయి. ఒకసారి సముద్రపు నీరు తన ప్రభావాన్ని చూపిస్తుంది, ఇంకొకసారి ధరణి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకృతిజీత్ అయినట్లయితే ప్రకృతిలోని ఏ అలజడి కూడా మిమ్ములను కదిలించలేదు. సదా సాక్షిగా అయ్యి అన్ని ఆటలను చూస్తూ ఉంటారు మీరు ఎంతగా మీ ఫరిస్తా రూపంలో అనగా ఉన్నత స్థితిలో ఉంటే అలజడి నుండి అంత స్వత:గానే అతీతంగా ఉంటారు. ప్రకృతిజీత్ అయ్యేందుకు ముందు కర్మేంద్రియజీత్ అవ్వండి. అప్పుడు ప్రకృతిజీత్ నుండి కర్మాతీత స్థితి అనే ఆసనధారి నుండి విశ్వరాజ్యాధికారిగా అవ్వగలరు. కావున స్వయాన్ని అడగండి - ప్రతి కర్మేంద్రియము జీ హజూర్, జీ హాజిర్(ఓ యజమానీ అలాగే) అని నడుస్తున్నాయా? కదా? మీ మంత్రి, ఉపమంత్రి ఎక్కడా మోసం చెయ్యడం లేదు కదా?

పిల్లలైన మీ వద్ద మహాన్ శక్తి అయిన పవిత్రత చాలా ఉంది. తమ పవిత్ర మనసు అనగా శుద్ధమైన వృత్తి ద్వారా ప్రకృతిని కూడా పరివర్తన చెయ్యవచ్చు. మనసా పవిత్రతా శక్తికి ప్రత్యక్ష ప్రమాణము - ప్రకృతిని కూడా పరివర్తన చెయ్యడం. కావున స్వ పరివర్తనతో ప్రకృతిని, వ్యక్తిని పరివర్తన చెయ్యవచ్చు. తమోగుణీ మనుష్య ఆత్మలు మరియు తమోగుణీ ప్రకృతి, వాతావరణాల వైబ్రేషన్ల నుండి రక్షించుకునేందుకు సహజ సాధనం ఈ ఈశ్వరీయ మర్యాదలు. మర్యాదలకు లోబడి ఉంటే కష్టం నుండి రక్షించబడ్తారు. మర్యాదలనే రేఖల నుండి సంకల్పాలు, మాటలు, కర్మల నుండి బయటికి వచ్చినప్పుడు శ్రమ చెయ్యవలసి ఉంటుంది.

మీరు సదా తమ పూర్వజ స్థితిలో ఉంటూ సంకల్పం ద్వారా ఆజ్ఞాపించండి - ఓ పంచ వికారాలూ, మీరు అర్ధకల్పం కొరకు వీడ్కోలు తీసుకోండి, ఓ ప్రకృతీ! సతోప్రధానంగా సుఖదాయిగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వు అని ఆజ్ఞాపించినట్లయితే, అవి మీ ఆజ్ఞ ప్రమాణంగా పని చేస్తాయి. తర్వాత ప్రకృతి మోసం చెయ్యలేదు. కానీ మొదట స్వయానికి అధికారిగా అవ్వండి. స్వభావ- సంస్కారాలకు కూడా అధీనులుగా అవ్వకండి. అధికారిగా అయినప్పుడు అన్నీ ఆజ్ఞ ప్రమాణంగా పని చేస్తాయి. సైన్సు శక్తితో ప్రకృతి అనగా తత్వాలను ఈ రోజు కూడా తమ అధీనంలో ఉంచుకుంటున్నారు. ఈశ్వరీయ సంతానం అయిన మాస్టర్ రచయితలు మాస్టర్ ర్వశక్తివంతుల ముందు ఈ ప్రకృతి మరియు పరిస్థితి దాసిగా అవ్వలేదా? సైన్సు అణుశక్తి మహాన్ కర్తవ్యం చేస్తూ ఉంటే ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి ఏం చెయ్యలేదు! సహజంగానే ప్రకృతి మరియు పరిస్థితుల రూపం మరియు గుణాలు పరివర్తన చెయ్యగలరు. సర్వ విఘ్నాలతో, సర్వ ప్రకారాల పరిస్థితులతో లేక తమోగుణీ ప్రకృతి ఆపదలతో సెకండులో విజయీగా అయ్యేందుకు కేవలం నిశ్చయం మరియు నశాలో ఉంటూ ''ఓహో (వహ్వా) నేను, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను'' అనే స్మృతిలో ఉంటే సమర్థ స్వరూపులుగా అవ్వగలరు.

ప్రకృతి ద్వారా ఎప్పుడు పేపర్ వచ్చినా ఇది ఎందుకు, ఇది ఏమిటి అనే అలజడిలోకి రాకండి. అలజడిలోకి రావడం అనగా ఫెయిల్అవ్వడం. ఏది జరిగినా లోపలి నుండి సదా ''ఓహో మధురమైన డ్రామా'' అనే మాట రావాలి. అయ్యో ఏమయ్యింది అని సంకల్పంలో కూడా రారాదు. డ్రామా జ్ఞానంతో స్వయాన్ని ఇంత దృఢంగా చేసుకోండి. మాయాజీత్ లేక ప్రకృతిజీత్ అయ్యేందుకు సర్దకునే శక్తిని ధారణ చెయ్యండి. దీని కొరకు చూస్తున్నా చూడకండా, వింటున్నా వినకుండా ఉండే అభ్యాసం చెయ్యండి. ఇప్పుడిప్పుడే సాకారీ, ఇప్పుడిప్పుడే ఆకారీ మరియు ఇప్పుడిప్పుడే నిరాకారీ స్థితిని అభ్యాసం చెయ్యండి. ప్రకృతి అలజడిని చూసి ప్రకృతిపతిగా అయ్యి తమ ఫుల్ స్టాప్(బిందు రూప) స్థితితో ప్రకృతి అలజడిని(స్టాప్) ఆపండి. తమోగుణీ నుండి సతోగుణీ స్థితిలోకి పరివర్తన చెయ్యండి. ఈ అభ్యాసాన్ని పెంచండి.

సంగమ యుగంలోనే ప్రకృతి సహయోగిగా అయ్యే తన పాత్రను ఆరంభం చేస్తుంది. అన్ని వైపుల నుండి ప్రకృతిపతిని మరియు మాస్టర్ ప్రకృతి పతులను ఆహ్వానం చేస్తుంది. అన్ని వైపుల నుండి ఆహ్వానముంటుంది. అందువలన ప్రకృతిలోని ప్రతి తత్వాన్ని దేవత రూపంలో చూపించారు. దేవత అనగా ఇచ్చేవారు. చివరి సమయంలో ప్రకృతి తత్వాలన్నీ మీ అందరికి సహయోగాన్ని ఇచ్చే దేవతలుగా అవుతాయి. నలువైపులా ఏ తత్వం ద్వారా ఎంత అలజడి జరిగినా, ప్రకృతి యజమానులైన మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి దాసిగా అయ్యి సేవ చేస్తుంది. కేవలం మీరు ప్రకృతిజీతులుగా అవ్వండి. తర్వాత ఈ ప్రకృతి యజమానులైన మీకు సహయోగం అనే మాలను ధరింపజేస్తుంది. ఎక్కడైతే ప్రకృతిజీత్ బ్రాహ్మణులైన మీ పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టమూ జరగజాలదు. తర్వాత అందరూ మీ వైపు స్థూల, సూక్ష్మ సహాయం తీసుకునేందుకు పరుగులు తీస్తారు. మీ స్థానాలన్నీ శరణాలయాలుగా అవుతాయి. అందరి నోటి నుండి ''ఓ ప్రభూ! మీ లీల అపరం అపారము'' అనే మాటలు వస్తాయి. ''మీరు ధన్యులు, ధన్యులు! మీరు పొందారు, మేము తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము'' అనే మాటలు నలువైపుల నుండి వస్తాయి. మంచిది. ఓంశాంతి.