08.01.1986        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


"ధరిత్రియొక్కహోలీసితారలు"

ఈ రోజు జ్ఞాన సూర్యుడైన తండ్రి అనేక రకాల విశేషతలతో సంపన్నమైన తమ విశేష సితారలను చూస్తున్నారు. ప్రతి సితార యొక్క విశేషత, అది విశ్వాన్ని పరివర్తన చేసేందుకు ప్రకాశాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో విశ్వంలో సితారల గురించి విశేషంగా పరిశోధన చేస్తున్నారు, ఎందుకంటే సితారల ప్రభావం ధరిత్రిపై పడుతుంది. సైన్సువారు ఆకాశంలో ఉన్న సితారల గురించి పరిశోధిస్తున్నారు, బాప్ దాదా తన హోలీ సితారల విశేషతలను చూస్తున్నారు. ఆకాశంలోని సితారలు ఎంతో దూరం నుండి తమ మంచి లేక చెడు ప్రభావాన్ని వేయగలిగినప్పుడు, హోలీ సితారలైన మీరు ఈ విశ్వాన్ని పరివర్తన చేసేందుకు, పవిత్రత-సుఖ-శాంతిమయ ప్రపంచాన్ని తయారుచేసే ప్రభావాన్ని ఎంత సులభంగా వేయవచ్చు. మీరు ధరిత్రిపై సితారలు, అవి ఆకాశంలోని సితారలు. ధరిత్రిపై గల సితారలైన మీరు ఈ విశ్వాన్ని ఆందోళన నుండి రక్షించి సుఖమయ ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారుచేసేవారు. ఈ సమయంలో ప్రకృతి మరియు వ్యక్తులు ఇరువురూ ఆందోళన కలిగించేందుకు నిమిత్తంగా ఉన్నారు కానీ పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖపు శ్వాస, శాంతి యొక్క శ్వాస ఇచ్చేందుకు నిమిత్తమైనవారు. ధరిత్రి సితారలైన మీరు సర్వాత్మల యొక్క సర్వ ఆశలు పూర్తి చేసే ప్రాప్తి స్వరూప సితారలు, అందరి నిరాశలను ఆశలలోకి పరివర్తన చేసే శ్రేష్ఠమైన ఆశా సితారలు. కనుక శాంతి సితార, హోలీ సితార, సుఖ స్వరూప సితార, సదా సఫలత సితార, సర్వ ఆశలను పూర్తి చేసే సితార, సంతుష్టత యొక్క ప్రభావశాలి సితార అయిన నాకు ప్రభావం వేసేటువంటి మెరుపు మరియు ప్రకాశం ఎంత ఉంది? అని తమ శ్రేష్ఠ ప్రభావాన్ని పరిశీలించుకోండి. ఎంత వరకు ప్రభావం వేస్తున్నాను? ప్రభావం యొక్క వేగం ఎంత ఉంది? ఎలాగైతే ఆ సితారల వేగాన్ని పరిశీలిస్తారో, అలాగే తమ ప్రభావం యొక్క వేగాన్ని స్వయమే పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు విశ్వంలో హోలీ సితారలైన మీ యొక్క అవసరముంది. కనుక బాప్ దాదా అన్ని రకాల సితారలను చూస్తున్నారు.

ఈ ఆత్మిక సితారల సంగఠన ఎంత శ్రేష్ఠమైనది, ఎంత సుఖాన్నిచ్చేది. అలా స్వయాన్ని ప్రకాశించే సితారగా భావిస్తున్నారా? ఎలాగైతే ఆ సితారలను చూసేందుకు ఎంతగా ఇష్టపడుతారు. ఇప్పుడు హోలీ సితారలైన మిమ్మల్ని చూసేందుకు అందరూ ఇష్టపడే సమయం వస్తుంది. ఈ శాంతి ప్రభావం, సుఖ ప్రభావం, అచలంగా చేసే ప్రభావం ఎక్కడ నుండి వస్తుంది అని సితారలైన మీ కోసం వెతుకుతారు. ఇది కూడా పరిశోధన చేస్తారు. ఇంత వరకు ప్రకృతిని పరిశోధించడంలో నిమగ్నమై ఉన్నారు, ఎప్పుడైతే ప్రకృతి పరిశోధనలో అలసిపోతారో అప్పుడు ఈ ఆత్మిక పరిశోధన చేయాలనే సంకల్పం వస్తుంది. దానికంటే ముందే హోలీ సితారలైన మీరు స్వయాన్ని సంపన్నం చేసుకోండి. ఏదైనా ఒక గుణాన్ని, శాంతిని గానీ, శక్తిని గానీ ఏదో ఒక విశేషతను తమలో నింపుకునేందుకు విశేషంగా తీవ్ర వేగంతో ఏర్పాట్లను చేయండి. మీరు కూడా పరిశోధన చేయండి. అన్ని గుణాలైతే ఉండనే ఉన్నాయి కాని కనీసం ఒక్క గుణం యొక్క విశేషతతో స్వయాన్ని విశేషంగా అందులో సంపన్నం చేసుకోండి. ఎలా అయితే ఆ డాక్టర్లకు - సాధారణ వ్యాధుల గురించి జ్ఞానం ఉంటుంది కాని ఏదో ఒకదాని గురించి విశేష జ్ఞానముంటుంది. ఆ విశేషత కారణంగా వారు ప్రసిద్ధమవుతారు. కావున సర్వగుణ సంపన్నంగా అవ్వాల్సిందే. అయినాసరే ఒక విశేషతను విశేష రూపంలో అనుభవంలోకి తీసుకొస్తూ, సేవలోకి తీసుకొస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. భక్తిమార్గంలో కూడా ప్రతి దేవి యొక్క మహిమలో ప్రతి ఒక్కరి విశేషత వేరు వేరుగా మహిమ చేయబడుతుంది. ఆ విశేషత అనుసారంగానే పూజ కూడా జరుగుతుంది, ఎలా అయితే సరస్వతిని విశేషంగా విద్యాదేవి అని అంటూ భావిస్తారు మరియు పూజిస్తారు. శక్తి స్వరూపమే కాని విద్య యొక్క దేవి అని విశేషత చెప్తూ పూజిస్తారు. లక్ష్మిని ధన దేవి అని అంటూ పూజిస్తారు. అలా తమలో సర్వ గుణాలు, సర్వ శక్తులు ఉన్నా ఒక విశేషతలో విశేషంగా పరశోధన చేసి స్వయాన్ని ప్రభావశాలిగా తయారుచేసుకోండి. ఈ సంవత్సరంలో ప్రతి గుణాన్ని, ప్రతి శక్తిని పరిశోధన చేయండి. ప్రతి గుణం యొక్క సూక్ష్మతలోకి వెళ్ళండి. ఆ సూక్ష్మతతో ఆ గుణం యొక్క మహానతను అనుభవం చేయగలరు. స్మృతి యొక్క స్థితులను, పురుషార్థం యొక్క స్థితులను సూక్ష్మంగా పరిశోధన చెయ్యండి, లోతుల్లోకి వెళ్ళండి, లోతైన అనుభూతులను చేయండి. అనుభవమనే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. కేవలం పైపైన అలలలో తేలియాడే అనుభవీలుగా అవ్వడం, ఇదే సంపూర్ణ అనుభవం కాదు. ఇంకా అంతర్ముఖులుగా అయి గుహ్య అనుభవాల రత్నాలతో బుద్ధిని నిండుగా చేసుకోండి, ఎందుకంటే ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా వస్తుంది. సంపన్నంగా అవ్వండి, సంపూర్ణంగా అవ్వండి, అప్పుడు సర్వాత్మల ముందున్న అజ్ఞానమనే పరదా తొలగిపోతుంది. మీ సంపూర్ణతా ప్రకాశంతో ఈ పరదా స్వతహాగనే తెరుచుకుంటుంది, కనుక పరిశోధన చెయ్యండి. సర్చ్ లైట్ గా అవ్వండి, అప్పుడే గోల్డెన్ జూబిలీని జరుపుకున్నారని అంటారు.

గోల్డెన్ జూబిలి యొక్క విశేషత, ప్రతి ఒక్కరి ద్వారా అందరికీ ఇదే అనుభవమవవ్వాలి, దృష్టి ద్వారా కూడా సువర్ణభరిత శక్తుల అనుభూతి కలగాలి. ఎలాగైతే లైట్ కిరణాలు ఆత్మలను గోల్డెన్ గా చేసేందుకు శక్తినిస్తున్నాయి. అలా ప్రతి సంకల్పం, ప్రతి కర్మ గోల్డెన్ గా ఉండాలి. గోల్డ్ గా తయారుచేసేందుకు నిమిత్తమైనవారు. ఈ గోల్డెన్ జూబిలి సంవత్సరంలో స్వయాన్ని పారసనాథుని పిల్లలైన మాస్టర్ పారసనాథులుగా భావించండి. ఎటువంటి ఇనుము సమానమైన ఆత్మ అయినా కాని పారస్ యొక్క సాంగత్యంతో ఇనుము కూడా పారస్ గా అయిపోవాలి. ఇది ఇనుము, అని ఆలోచించకండి. నేను పారస్ అని భావించాలి. పారస్ కర్తవ్యమే ఇనుమును కూడా పారస్ గా చేయడం. ఇదే లక్ష్యాన్ని మరియు ఇదే లక్షణాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి, అప్పుడు హోలీ సితారల ప్రభావం విశ్వం యొక్క దృష్టిలోకి వస్తుంది. ఇప్పుడైతే, ఫలానా-ఫలానా సితార వస్తుందని పాపం భయపడుతున్నారు. తర్వాత హోలీ సితారలు వస్తున్నాయని సంతోషిస్తారు. విశ్వంలో నలువైపులా హోలీ సితారల మెరుపు అనుభవమవుతుంది. అందరి నోటి నుండి భాగ్యశాలి సితారలు, సఫలతా సితారలు వచ్చేశారనే మాటలు వెలువడతాయి. సుఖ-శాంతులనిచ్చే సితారలు వచ్చేశారు. ఇప్పుడైతే దుర్భిణీలు (టెలిస్కోపులు) తీసుకొని చూస్తారు కదా. తర్వాత దివ్య నేత్రమైన మూడవ నేత్రంతో చూస్తారు. కాని ఈ సంవత్సరం తయారయ్యే సంవత్సరం. మంచి రీతిలో ఏర్పాట్లను చేయండి. అచ్ఛా - ప్రోగ్రాంలో ఏం చేస్తారు! బాప్ దాదా కూడా వతనంలో దృశ్యాన్ని ఇమర్జ్ చేశారు, దృశ్యం ఏమిటి?

కాన్ఫరెన్స్ జరిగే స్టేజ్ పై అయితే ఉపన్యసించే వారినే కూర్చోబెట్టారు కదా. కాన్ఫరెన్స్ స్టేజ్ అనగా స్పీకర్ల స్టేజ్. ఈ రూపు రేఖలను తయారుచేస్తారు కదా. మీరు టాపిక్ పై అయితే సదా ఉపన్యసిస్తూనే ఉంటారు - చాలా బాగా చేస్తారు కాని ఈ గోల్డెన్ జూబ్లీలో ప్రసంగించే సమయం తక్కువగా ఉండాలి, ప్రభావం ఎక్కువగా ఉండాలి. అదే సమయంలో వేరు వేరు స్పీకర్లు తమ ప్రభావశాలి ఉపన్యాసమును చేయవచ్చు, దాని రూపురేఖలు ఎలా ఉండాలి. ఒక రోజు విశేషంగా అర్ధగంట కోసం ఈ ప్రోగ్రాం పెట్టండి మరియు ఎలాగైతే బయటివారు లేక విశేషంగా ఉపన్యాసం ఇచ్చేవారు ఉపన్యాసం ఇస్తారో, భలే అది నడిచినా, కాని అర్థగంట కొరకు ఒక రోజు స్టేజ్ పైన భిన్న-భిన్న వయసు గలవారు అనగా ఒక చిన్న బాలుడు, ఒక కుమారి, ఒక పవిత్రమైన యుగల్ ఉండాలి. ప్రవృత్తిలో ఉండే ఒక యుగల్ ఉండాలి. ఒక వృద్ధుడు ఉండాలి. ఈ భిన్న-భిన్నమైనవారందరూ చంద్రుని ఆకారంలో స్టేజ్ పై కూర్చొని ఉండాలి, స్టేజ్ యొక్క లైట్లు ఎక్కువగా ఉండకూడదు. సాధారణంగా ఉండాలి. ఒక్కొక్కరు మూడేసి నిమిషాలలో ఈ శ్రేష్ఠ జీవితం తయారయ్యేందుకు ఏ గోల్డెన్ వర్షన్స్ (బంగారు మహావాక్యాలు) లభించాయో, దేని ద్వారా జీవితాన్ని తయారుచేసుకున్నారో, ఆ విశేషమైన గోల్డెన్ వర్షన్స్ ను వినిపించాలి. పిల్లల కొరకు ఏ మహావాక్యాలు లభించాయో, చిన్న కుమారుడు అనగా బాలుడు లేక బాలిక వినిపించాలి. కుమారి జీవితానికి ఏ గోల్డెన్ వర్షన్స్ లభించాయి, బాల బ్రహ్మచారి యుగల్స్ కు ఏ గోల్డెన్ వర్షన్స్ లభించాయి. అలాగే ప్రవృత్తిలో ఉండే ట్రస్టీ ఆత్మలకు ఏ గోల్డెన్ వర్షన్స్ లభించాయి. వృద్ధులకు ఏ గోల్డెన్ వర్షన్స్ లభించాయి. వారు మూడేసి నిమిషాలు చెప్పాలి. కాని చివర్లో గోల్డెన్ వర్షన్స్ ను స్లోగన్ రూపంలో మొత్తం సభలోని వారితో చెప్పించాలి. ఎవరిదైతే మాట్లాడే టర్న్ ఉంటుందో వారిపై విశేషంగా లైట్ ఉండాలి. అప్పుడు స్వతహాగా అందరి అటెన్షన్ వారి వైపు వెళ్తుంది. సైలెన్సు ప్రభావం ఉండాలి. ఏదైనా డ్రామా చేసినప్పుడు ఎలా ఉంటుందో, అటువంటి దృశ్యమే ఉండాలి. ఉపన్యాసం కావొచ్చు కాని దృశ్యం రూపంలో ఉండాలి. కొద్దిగానే మాట్లాడాలి. మూడు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ముందు నుండే తయారై ఉండాలి. రెండవ రోజు మళ్ళీ ఇవే రూపురేఖలతో భిన్న-భిన్న వర్గాల వారిది ఉండాలి. ఉదాహరణకు డాక్టరు గాని, వ్యాపారి గాని, ఆఫీసర్ గాని... ఇలా భిన్న-భిన్న వర్గాలకు చెందినవారు మూడేసి నిమిషాలు మాట్లాడుతూ - ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నా ఏ ముఖ్యమైన గోల్డెన్ ధారణ ద్వారా కార్యంలో సఫలమవుతూ ఉంటారో, ఆ ముఖ్యమైన సఫలతా పాయింట్లను గోల్డెన్ వర్షన్స్ రూపంలో వినిపించాలి. ఉపన్యాసమే ఉంటుంది కాని రూపురేఖలు కొంచెం భిన్నంగా ఉన్నందుకు ఈ ఈశ్వరీయ జ్ఞానం ఎంత విశాలమైనదో, ప్రతి వర్గం కొరకు ఏ విశేషత ఉందో, అది మూడు-మూడు నిమిషాలలో అనుభవాన్ని, అనుభవం వినిపించినట్లు వినిపించకూడదు, కానీ అనేకులు అనుభవం చేయాలి. వాతావరణం ఎంత సైలెన్స్ గా ఉండాలంటే వినేవారికి కూడా మాట్లాడే లేక అలజడి చేసే ధైర్యముండకూడదు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు ఏ లక్ష్యముంచుకోవాలంటే ఎంత సమయం ప్రోగ్రాం నడుస్తుందో అంత సమయం ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ రికార్డు మోగినప్పుడు అందరూ సైలెన్స్ వాయుమండలాన్ని తయారుచేస్తారో - అలా ఈసారి ఈ వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు నోటితో ఉపన్యాసం కాదు, శాంతి యొక్క ఉపన్యాసం చేయాలి. నేను కూడా ఒక స్పీకర్ నే, బంధింపబడి ఉన్నాను. శాంతి యొక్క భాష కూడా తక్కువేమి కాదు. ఈ బ్రాహ్మణుల వాతావరణం ఇతరులను కూడా అదే అనుభూతిలోకి తీసుకొస్తుంది. వీలైనంత వరకు ఇతర కార్యాలను సమాప్తం చేసి సభ జరిగే సమయంలో బ్రాహ్మణులందరూ వాయుమండలాన్ని తయారుచేసేందుకు సహయోగం తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ ఎవరికైనా అటువంటి డ్యూటీ ఉంటే వారు ముందుకు కూర్చోకూడదు. ముందున అలజడి అవ్వకూడదు. మూడు గంటలు భట్టి జరిగిందంటే, ఉపన్యాసం బాగుందని అనరు కానీ మంచి అనుభవమయిందని అంటారు. ఉపన్యాసంతో పాటు అనుభూతి కూడా కలగాలి కదా. వచ్చే బ్రాహ్మణులందరూ మేము భట్టీకి వెళ్తున్నామని భావించి రావాలి. కాన్ఫరెన్స్ చూసేందుకు రాకూడదు, సహయోగులుగా అయ్యి రావాలి. కనుక వాయుమండలాన్ని ఎంత శక్తిశాలిగా చేయాలంటే, ఎటువంటి అలజడి చేసే ఆత్మలైనా కొంత సమయమైనా శాంతి మరియు శక్తులను అనుభవం చేసి వెళ్ళాలి. ఇది మూడు వేల మంది సభ కాదు ఫరిస్తాల సభ అని అనిపించాలి. కల్చరల్ ప్రోగ్రాం జరిగినప్పుడు భలే నవ్వండి, సంతోషంగా ఉండండి కాని కాన్ఫరెన్స్ జరిగే సమయంలో శక్తిశాలి వాతావరణం ఉండాలి. అప్పుడు మిగతా వచ్చేవారు కూడా అదే విధంగా మాట్లాడ్తారు. వాయుమండలం ఎలా ఉంటుందో అలా మాట్లాడే మిగతావారు కూడా అదే వాయుమండలంలోకి వచ్చేస్తారు. అందుకు కొంత సమయంలో ఎక్కువ ఖజానాను ఇచ్చే ప్రోగ్రాం ను తయారుచేయండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. ఒకవేళ మన బ్రాహ్మణులు నెమ్మదిగా మాట్లాడినట్లయితే, మిగతా బయటివారు కూడా నెమ్మదిగా మాట్లాడ్తారు. అచ్ఛా. ఇప్పుడేం చేస్తారు? స్వయాన్ని విశేషమైన సితారగా ప్రత్యక్షం చేస్తారు కదా. కనుక ఈ గోల్డెన్ జూబిలీ సంవత్సరాన్ని విశేషంగా స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా చేసుకునే సంవత్సరంగా జరుపుకోండి. ఆందోళనలోకి రాకండి, ఆందోళనలోకి తీసుకురాకండి. ఆందోళన కలిగించే ప్రకృతే చాలా ఉంది. ఈ ప్రకృతి తన కర్తవ్యాన్ని చేస్తూ ఉంది. మీరు మీ పని చేయండి. అచ్ఛా.

సదా హోలీ సితారలుగా అయి విశ్వాన్ని సుఖ-శాంతిమయంగా చేసేవారు, మాస్టర్ పారస్ నాథులుగా అయి బంగారు ప్రపంచాన్ని తయారు చేసేవారు, అందరిని పారస్ గా చేసేవారు, సదా అనుభవాల సాగర లోతుల్లో ఉండే అనుభవాల రత్నాలను స్వయంలో జమ చేసుకునేవారు, సర్చ్ లైట్ గా అయి అజ్ఞానమనే పరదాను తొలగించేవారు - ఇలా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషమైన రత్నాలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్లతో:- కొత్త ప్రపంచాన్ని తయారుచేసే కాంట్రాక్ట్ ను తీసుకున్నారు కదా! కావున సదా కొత్త ప్రపంచాన్ని తయారుచేసేందుకు కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం సదా ఉంటుందా లేక విశేషమైన సమయంలో ఉల్లాసం వస్తుందా? అప్పుడప్పుడు వచ్చే ఉల్లాస-ఉత్సాహాలతో కొత్త ప్రపంచం స్థాపన అవ్వదు. సదా ఉల్లాస-ఉత్సాహాలున్నవారే కొత్త ప్రపంచాన్ని తయారుచేసేందుకు నిమిత్తంగా అవుతారు. కొత్త ప్రపంచానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత కొత్త ప్రపంచం యొక్క విశేష వస్తువుల విస్తారం జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రపంచంలోకి వచ్చేవారు కూడా మీరే, తయారుచేసేవారు కూడా మీరే. కనుక తయారుచేయడంలో శక్తులు కూడా ఉపయోగపడ్తాయి, సమయం కూడా పడ్తుంది కాని శక్తిశాలి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు సదా విఘ్నాలను సమాప్తం చేసి ముందుకు వెళుతూ ఉంటారు. కనుక మీరు ఇటువంటి కొత్త ప్రపంచానికి పునాది. ఒకవేళ పునాది కచ్చా (అసంపూర్ణం) గా ఉంటే బిల్డింగ్ ఏమవుతుంది! కనుక కొత్త ప్రపంచాన్ని తయారుచేసే డ్యూటీలో ఎవరైతే ఉన్నారో వారు కష్టపడి పునాదిని పక్కాగా చేయాలి. 21 జన్మల వరకు బిల్డింగ్ ఉండే విధంగా పక్కాగా చేయాలి. కనుక మీ 21 జన్మల బిల్డింగ్ తయారుచేసుకున్నారు కదా! అచ్ఛా.

2. తండ్రి హృదయ సింహాసనాధికారి ఆత్మలము, ఇలా అనుభవం చేస్తున్నారా? ఈ సమయంలో హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు తర్వాత విశ్వరాజ్యాధికారులు. ఎవరి హృదయంలో అయితే ఒక్క తండ్రి స్మృతే ఇమిడి ఉంటుందో, వారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. ఎలాగైతే తండ్రి హృదయంలో సదా పిల్లలు ఇమిడి ఉంటారో, అలా పిల్లల హృదయంలో సదా మరియు స్వతహాగా తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి తప్ప ఇంకేముంది. కనుక సింహాసనాధికారులమనే నషా మరియు సంతోషంలో ఉండండి. అచ్ఛా.

వీడ్కోలు సమయంలో -గురువారం ఉదయం 6 గంటలకు:- నలువైపులా ఉన్న స్నేహీ సహయోగి పిల్లలపై సదా వృక్షపతి యొక్క బృహస్పతి దశ ఉండనే ఉంది. ఈ బృహస్పతి దశలోనే శ్రేష్ఠంగా చేసే సేవలో ముందుకు వెళ్తూ ఉన్నారు. స్మృతి మరియు సేవ రెండిటిలో విశేష సఫలతను ప్రాప్తి చేసుకుంటున్నారు, అలాగే చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు సంగమయుగమే బృహస్పతి సమయము. ప్రతి ఘడియ సంగమయుగానికి బృహస్పతి అనగా భాగ్యశాలి, అందువలన మీరు భాగ్యశాలురు, భగవంతునికి చెందినవారు, భాగ్యాన్ని తయారుచేసేవారు. భాగ్యశాలి ప్రపంచానికి అధికారులు. ఇటువంటి సదా భాగ్యశాలి పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.