BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2015
జనవరి 9

ఆత్మిక ప్రశిక్షకునితో డబల్ లైట్ ఫరిస్థా యొక్క ఆత్మిక సంభాషణ 

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను డబల్ లైట్ ఫరిస్థాను. నేను నా యొక్క సర్వ భాద్యతల భారాన్ని బాబాకు ఇచ్చేసాను. సూక్ష్మ వతనంలో నా ప్రకాశ శరీరంతో నాట్యం చేస్తున్నాను.             

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

మీ సన్ముఖంలో కూర్చోగానే నాయొక్క మూడు స్వరూపాలు జ్ఞాపకం వస్తున్నాయి. నేను మీ సంతానమును, నేను యజమానిని, నేను ఫరిస్తాను.  మీ సంతానముగా అయ్యి నా సర్వ భారాలను మీకు ఇచ్చేసాను. నా సూక్ష్మ కర్మేంద్రియాలపై యజమానిగా అయ్యి, సదా అవ్యభిచారి జ్ఞాపకంలో ఉంటాను. ఫరిస్తాగా అయ్యి ఎల్లప్పుడూ శబ్దానికి అతీతమైన స్థితిలో ఉంటాను. పాత ప్రపంచం ఇప్పుడు నన్ను ఆకర్షితం చేయలేదు.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

అన్ని భాధ్యతలను బాబాకు ఇచ్చి నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. పగలు-రాత్రి నువ్వు 'ఫరిస్తాగా  నాట్యం' అంటే 'మన్నసుతో నాట్యం' చేస్తూ ఉండు. దేహాభిమానము అంటే మనుష్యులుగా, ఆత్మాభిమానము అంటే ఫరిస్తాగా ఉండటము. అమృత వేళ లేస్తూనే నీ ఫరిస్తా స్వరూపాన్ని స్మృతిలోకి తెచ్చుకొని సంతోషం యొక్క నాట్యం చెయ్యి. సంతోషం ఎలాంటి డిస్టర్బ్ చేసే పరిస్థితులనైన సమాప్తం చేసేస్తుంది.           

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

నీవు దాత యొక్క పిల్లవాడివి. నీ చేతులు, హృదయం మరియు మనస్సు ఈశ్వరీయ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నాయి. కారణంగా నీవు తృప్త ఆత్మగా అయ్యి, దాత యొక్క పిల్లవాడు అనే స్టాంప్, ఆత్మవైన నీపై వేయబడుతుంది.      

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. ఈ రోజు నేను మానసికంగా కాని, భౌతికంగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? ఈ రోజు  నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.