BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


 

2014 డిసెంబర్ 11

ప్రేమ సాగరునితో మహారథి పిల్లవాని యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను మహారథి పిల్లవాడిని. విశేష సమయమైన అమృత వేళ లో ప్రేమ సాగరునిలో లీనమై, స్వయమును బాబా కు అతి సమీపంగా అనుభవం చేసుకుంటున్నాను.

నా రూపం బాబా సమానంగా తయారు అవుతుంది. బాబా గుణాలు నా గుణాలుగా అవుతున్నాయి. నేను బాబా ప్రేమను అనుభవం చేసుకోవడంలో నిపుణుడిగా తయారవుతున్నాను.         

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

ప్రేమ సాగరుడైన బాబా! నేను మీ వాడను. నేను ఎవరో ,ఎలా ఉన్నానో అలా మీవాడను . మీరు నావారు. మధురమైన బాబా.. నేను మీ  ప్రేమలో  లీనమై ఉన్నాను.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

ఎప్పుడైతే నీ రూపం నాలా అవుతుందో, నీ గుణాలు కూడా నాలా తయరవుతాయి. నువ్వు మహారథి గా అయ్యి నాతో మిలనం చేసుకో మరియు నాలోనే లీనం అవ్వు.

ఎలాగైతే నదులు సాగరంలో లీనం అవుతాయో అలానే బాబా యొక్క గుణాలు ఆత్మ వైన నీలో నింపుకో. మహారథి పిల్లల యొక్క అనుభవం బ్రహ్మ బాబా సమానంగా ఉంటుంది నువ్వు నీ సంపన్న మరియు సంపూర్ణ స్వరూపాన్ని అనుభవం చేసుకో.        

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  నేను వరదానాలను పొందుతున్నాను.

నీవు జ్ఞానీ మరియు తెలివైన ఆత్మవు. నీలో ఆత్మిక శక్తులను సమయానుసారంగా ఉపయోగించి మాయ యొక్క ఆటను మనోరంజనంగా మార్చే విశేషత నీలో ఉంది.

అందువలన నీ నుదుటి మీద విజయం యొక్క తిలకం సదా మెరుస్తూ ఉంటుంది. బాబా యొక్క బంగారు వరదాని హస్తం ఎల్లప్పుడూ  నీ శిరస్సు పై ఉంటుంది.       

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపం లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను