BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



2014 డిసెంబర్ 22

సూర్యుని యొక్క తేజస్వీ కిరణాలలో మరియు చంద్రుని యొక్క శీతలమైన  వెన్నెలలో లీనమయ్యే ఒక ఆత్మ.

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను. నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఒక ఆత్మను, బాబా యొక్క పిల్లవాడిని. నేను బాబాతో సర్వ సంబంధాల యొక్క మధురతను అనుభవం చేసుకుంటున్నాను. ఈ రెండు సంకల్పాల యొక్క నషా, నన్ను సహజంగా సూక్ష వతనం వైపు ఎగిరేల చేస్తుంది.         

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

"నేను బాబా వాడిని" మరియు "నా యొక్క సర్వ సంబంధాలు ఒక్క మధురమైన బాబాతో జోడించబడ్డాయి". ఈ రెండు సంకల్పాలు  నన్ను సహజ యోగిగా మరియు సదా యోగిగా తయారుచేస్తున్నాయి.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

పిల్లలైనా మీకు పిక్ నిక్  వెళ్ళడం మరియు హాలిడే జరుపుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అందువలన బాప్ దాదా పిల్లలలైన మీకు,అమృత వేళ సమయంలో  సూక్ష్మ వతనంలోకి రమ్మని విశేషమైన ఆహ్వానం ఇస్తున్నారు. జ్ఞాన సాగరుని తీరానికి రండి మరియు సాగరంలో లీనం అవ్వండి. నా యొక్క చత్రఛాయలో, సర్వ సూక్ష్మ ఖజానాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి.

 పిల్లలూ.. రండి.. వచ్చి జ్ఞాన సూర్యుని యొక్క ప్రకాశంలో మరియు జ్ఞాన చంద్రుని శీతలమైన వెన్నెలలో లీనమవ్వండి. అందరు కలిసి ఆత్మిక పిక్నిక్ జరుపుకోండి మరియు ఆత్మిక ఆటలు ఆడండి.

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

స్వమానమనే ఉన్నతమైన సీట్లో కూర్చొన్న నువ్వు, హీరో పాత్ర పోషిస్తూ, అన్ని భయానకమైన పరిస్తితుల మీద విజయం సాదిస్తున్నావు. నువ్వు ఒక విజయీ రత్నానివి మరియు మాస్టర్ సర్వ శక్తివంతుడివి. ఈ స్మృతి, నిన్ను స్వమానం యొక్క సీట్ మీద కుర్చోబెడుతుంది. ఈ సీట్ పై కూర్చోడం ద్వారా నీ ప్రతి ఆజ్జ్ఞ పాలన అవుతుంది మరియు నీ చేతుల్లోకి పరమాత్మ శక్తుల యొక్క మేజిక్ వస్తుంది.

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపం లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.