2014
డిసెంబర్
24
బాబా యొక్క ఒడిలో కూర్చున్న ఒక పిల్లవాడు
స్మృతికి రావలసిన మొదటి విషయము
నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం,
నేను ఒక ఆత్మ అని భావిస్తాను:
నేను మధురమైన ఇంటి నుంచి,
ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి
వచ్చాను.
నేను ఎవరు?
నేను బాబా యొక్క పిల్లవాడిని.
పరమపిత పరమాత్మ నా యొక్క తల్లి మరియు తండ్రి.
బాబా చేతుల ద్వారా నా యొక్క పాలన అవుతుంది.
నేను ఎవరికి చెందుతాను?
బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:
మధురమైన బాబా..
గుడ్ మోర్నింగ్..
బాబా!
సత్య యుగంలో నేను,
రత్న జడితమైన ఊయలలో ఆడుకుంటాను.
కానీ ఇప్పుడు నాకు,
మీ ఒడిలో ఆడుకునే సౌభాగ్యము ప్రాప్తించింది.
ఇది నా శ్రేష్ఠ సమయాన్ని గడపడానికి సాధనం.
బాబా మీ ఒడిలో కూర్చొన్న నాకు,
అతిఇంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.
అత్మతో బాబా యొక్క సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి
నాతో కుర్చో...
అవును!
సత్యయుగంలో అన్య పవిత్ర ఆత్మల సాంగత్యంలో రత్న
జడితమైన బొమ్మలతో ఆడుకుంటావు.
కాని ఇక్కడ నీవు నాతో ఏ ఆట కావాలంటే ఆ ఆట
ఆడుకోవచ్చు.
నీవు నా తోడుగా మరియు స్నేహితుడి రూపంలో కూడా
ఆడుకోవచ్చు.
నీవు నా పిల్లవానిగా లేదా నన్ను నీ పిల్లవానిగా
చేసుకుని కూడా ఆడుకోవచ్చు.
ఇలాంటి విశేషమైన మరియు అవినాశి ఆట వస్తువు,
మొత్తం కల్పంలో ఎప్పుడు లభించదు.
ప్రేరణ పొందుట:
నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి..
మనస్సును శాంతి సాగరుడైన..
బాబా మీద ఏకాగ్రం చేస్తాను...
బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన,
ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.
బాబా నుంచి వరదానములను పొందుట:
సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ
చేస్తున్నాను..
బాబా యొక్క ప్రియమైన,
పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా
బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.
దాతయే స్వయం నిండుగా ఉంటాడు.
ఈ ప్రపంచంవారు వినడంతో అలసిపోయారు కాబట్టి
ప్రత్యక్ష్య ప్రమాణం చూడాలని అనుకుంటున్నారు.
నీవు గుణమూర్తిగా అయ్యి అందరి మనోకామనలను పూర్ణం
చేస్తున్నావు.
నీ నేత్రాల ద్వారా విశేషతల యొక్క ప్రకాశం
వ్యాపిస్తుంది.
నీ యొక్క కర్మలు,
ఇతరులను గుణవంతులుగా తాయారు చేస్తున్నాయి.
నీ యొక్క మాటలు,
గుణాలను వర్ణిస్తున్నాయి మరియు నీ శ్రేష్ట
సంకల్పాలు,
అన్య ఆత్మలకు నిజగుణాల యొక్క ప్రకాశాన్ని మరియు
ఎగరడానికి కావలసిన ప్రేరణను ఇస్తున్నాయి.
బేహద్ సూక్ష సేవ
(చివరి
15
నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి
ఇస్తున్నాను.
నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం
ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో
ఇస్తున్నాను...
నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి
వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు ఉపక్రమించే ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను.
నేను మానసికంగా కాని,
భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని
పరిశీలించుకుంటున్నాను.
నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా?
అని చెక్ చేసుకుంటున్నాను.
ఒకవేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను.
ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు
లోను కాలేదు కదా?
నేను చేసిన కర్మలను చార్ట్ లో రాసి
30
నిమిషాల
యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని
తొలగిస్తున్నాను.
నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో
నిద్రిస్తాను.