BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us



 

2014 డిసెంబర్ 25

                       పరమాత్మ యొక్క సాంగత్యంలో ఒక అల్లారుముద్దు పిల్లవాడు

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను పరమాత్మ,

ఒక్కగానొక్క అల్లారుముద్దు పిల్లవాడిని. బాబాకు నా మీద చాలా ప్రేమ మరియు వాత్సల్యం ఉన్నాయనే విషయం నాకు తెలుసు.

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

బాబా..  సత్యయుగ రాజ్యాధికారం ఇవ్వడానికి మీరు నన్ను వెతుకుతూ ఇక్కడకు వచ్చారని నాకు తెలుసు. బాబా..  ఇది మీ శుభ కామన. నేను సత్యయుగ రాజ్యధికారిగా తయారుకావడానికి యోగ్యంగా కావాలి. బాబా.. మీరు నా నుంచి ఎప్పుడు ఏమి తీసుకోలేదు. కానీ మీరు దాతగా అయ్యి నన్ను ఎల్లప్పుడూ నింపుతూ ఉన్నారు.   

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

నేను పరంధామం నుండి వచ్చి, నిన్ను చదివించడానికి వెదికాను. నేను లండన్, అమెరికా లేదా భారత దేశం నుంచి కాదు, ఈ సాకార వతనానికి, అతీతమైన నిరాకారి ప్రపంచం నుంచి వచ్చాను. ఒకసారి ఆలోచించు, నేను ఎంత దూరదేశం నుంచి, నిన్ను వెతుకుతూ చదివించడానికి వస్తున్నాను. భగవంతుడు చదివించడం కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే విషయం ఉందా? ఎల్లప్పుడూ ఈ సంతోషం యొక్క నషాలో లీనమవ్వు.          

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

నేను సర్వ శక్తులతో సంపన్నమైన ఆత్మను, ప్రతిరోజు ఉదయం అమృత వేళ ఈ స్మృతిని ఇమర్జ్ చెయ్యి. ఈ అభ్యాసంతో నీవు సదాకాలికంగా యోగిగా అవుతావు. అప్పుడు పరమపిత పరమాత్మ వరదానీ సహయోగం ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ సహయోగంలో మాయ మీద సరళంగా మరియు సుందర రీతిలో నిశ్చిత విజయం  పొందుతావు.    

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.