BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


 

2014 డిసెంబర్ 31

స్వర్ణకారునితో ఒక సంపన్న ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను ఒక సంపన్న ఆత్మను జ్ఞానం, గుణాలు మరియు శక్తులనే అతి అమూల్యమైన రత్నాలతో, నా యొక్క ఖజానాలు నిండి ఉన్నాయి.

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

బాబా... నేను జ్ఞాన సాగరుడైన , రత్నాకరునితో మీతో బేరం కుదుర్చు కుంటున్నాను బాబా.. మీరు నాకు పళ్ళేలతో నింపి-నింపి జ్ఞానం, గుణాలు మరియు శక్తులనే  రత్నాలను ఇస్తున్నారు ఈ రత్నాలతో ఆడుకుంటూ నా యొక్క పాలన అవుతుంది.

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

నీవు ఎంతైతే ఈ రత్నాలను కార్య వ్యవహారాలలో ఉపయోగిస్తావో, అవి అంతగా వృద్ది చెందుతాయి. ఏ అత్మలైతే ఈ రత్నాలతో ఎల్లపుడు బిజీగా ఉంటారో వారే అందరికన్నా సంపన్నమైనవారు. పిల్లలు! అతి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఏ వ్యర్ద విషయాన్నీ   చూడకు ,వినకు, ఆలోచించకు మరియు మాట్లాడకు.         

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

నీ యొక్క వివేకం పవిత్రంగా మరియు శుద్ధంగా తయారవుతుంది. సత్యత అనే ప్రకాశం మరియు బాబా యొక్క స్నేహం ద్వారా ఆ మెరుపు పెరుగుతూ ఉంది. నీ పవిత్రత యొక్క సుందరత ద్వారా నీ భవిష్యత్ యొక్క చిత్రం ఎలా తయారు అవుతుందంటే..అది నీ ఊహ కి కూడా అందదు

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపము లో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.